Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Earphones: అలర్ట్.. ఇయర్‌ఫోన్స్‌తో యమ డేంజర్ గురూ.. గంటలు గంటలు వాడితే ఇక అంతే..

మనిషి పనిని సులభతరం చేసే సాంకేతికత ఇప్పుడు ప్రజల జీవితంలో భాగంగా మారింది. ఈ రోజుల్లో ఎక్కువ సమయం ప్రజలు గాడ్జెట్‌లు, ఆధునిక పరికరాల మధ్యనే గడుపుతున్నారు.

Earphones: అలర్ట్.. ఇయర్‌ఫోన్స్‌తో యమ డేంజర్ గురూ.. గంటలు గంటలు వాడితే ఇక అంతే..
Earphones
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Dec 06, 2022 | 7:01 PM

మనిషి పనిని సులభతరం చేసే సాంకేతికత ఇప్పుడు ప్రజల జీవితంలో భాగంగా మారింది. ఈ రోజుల్లో ఎక్కువ సమయం ప్రజలు గాడ్జెట్‌లు, ఆధునిక పరికరాల మధ్యనే గడుపుతున్నారు. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు రోజంతా చుట్టుపక్కల పరికరాలే ఉంటున్నాయి. సౌలభ్యం కోసం తయారు చేసిన ఈ పరికరాలు ఇప్పుడు మనపై, మన ఆరోగ్యం ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో సాంకేతికత లేకుండా మన జీవితాన్ని అస్సలు ఊహించలేము. ఇలాంటి పరికరాలలో ఒకటి ఇయర్‌ఫోన్‌లు.. నేడు దాదాపు ప్రతి వ్యక్తి జీవితంలో ఒక ముఖ్యమైన గాడ్జెట్‌గా మారింది. ఈ రోజుల్లో పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ చెవిలో ఇయర్‌ఫోన్స్ లేదా హెడ్‌ఫోన్స్ పెట్టుకుని కనిపిస్తున్నారు. కానీ ఈ విషయం మీకు తెలుసా..? ఇయర్‌ఫోన్స్ లేదా హెడ్‌ఫోన్స్ అధిక వినియోగం మన చెవులు, మెదడుపై చాలా చెడు ప్రభావాన్ని చూపుతుంది. నిరంతరం ఇయర్‌ఫోన్స్ లేదా హెడ్‌ఫోన్స్ వాడే వారిలో మీరు కూడా ఉన్నట్లయితే.. దాని వల్ల కలిగే అనర్ధాల గురించి తప్పకుండా తెలుసుకోండి.

చెవి నొప్పి సమస్య..

చాలా మంది రోజులో ఎక్కువ గంటలు హెడ్ ఫోన్స్ లేదా ఇయర్ ఫోన్స్ చెవిలో పెట్టుకునే అలవాటు ఉంటుంది. ఇయర్‌ఫోన్‌లు లేదా హెడ్‌ఫోన్‌లను ఎక్కువసేపు నిరంతరం ఉపయోగించడం వల్ల మీ చెవులపై చెడు ప్రభావం చూపుతుంది. ఇది చెవుపోటుకు లేదా తీవ్రమైన నొప్పిని కలిగిస్తుంది.

మెదడుపై ప్రభావం..

నిత్యం ఇయర్‌ఫోన్స్‌ని ఎక్కువసేపు వాడటం వల్ల మన చెవులు దెబ్బతినడమే కాకుండా మెదడుపై కూడా ప్రభావం చూపుతుంది. ఇయర్‌ఫోన్‌లు లేదా హెడ్‌ఫోన్‌ల నుండి వచ్చే విద్యుదయస్కాంత తరంగాలు మన మెదడును చెడుగా ప్రభావితం చేస్తాయి.

ఇవి కూడా చదవండి

చెవి ఇన్ఫెక్షన్ ప్రమాదం..

తరచుగా ప్రజలు తమ ఇయర్‌ఫోన్‌లు లేదా హెడ్‌ఫోన్‌లను అవసరమైనప్పుడు పరస్పరం మార్చుకుంటుంటారు. ఇలా చేయడం చాలా హానికరం. వాస్తవానికి, ఇయర్‌ఫోన్‌లను మార్పిడి చేయడం వల్ల చెవి ఇన్‌ఫెక్షన్ ప్రమాదాన్ని పెంచుతుంది. ఎందుకంటే.. వేరొకరి ఇయర్‌ఫోన్‌లను ఉపయోగించడం ద్వారా, ఇతరుల చెవిలోని బ్యాక్టీరియా అందులో ఉన్న స్పాంజ్ ద్వారా మీ చెవిలోకి వస్తుంది. కావున మీరు మీ ఇయర్‌ఫోన్‌ను మరొకరికి ఇచ్చినప్పుడు, మళ్లీ దానిని తిరిగి తీసుకున్నప్పుడు దాని స్పాంజ్‌ను శుభ్రం చేసిన తర్వాత మాత్రమే ఉపయోగించండి.

చెవిటితనం..

ఎక్కువ సేపు చెవుల్లో ఇయర్ ఫోన్స్ లేదా హెడ్ ఫోన్స్ పెట్టుకోవడం వల్ల కూడా వినికిడి లోపం వచ్చే అవకాశాలు ఎక్కువ. ఎక్కువసేపు ఇయర్‌ఫోన్‌లు ధరించడం వల్ల చెవుల నరాలపై ఒత్తిడి పడుతుంది. దీని కారణంగా నరాలలో మంట వచ్చే అవకాశం గణనీయంగా పెరుగుతుంది. అటువంటి పరిస్థితిలో వినికిడి కణాలు, కంపనం కారణంగా వాటి సున్నితత్వాన్ని కోల్పోవడం ప్రారంభిస్తాయి. ఇది చెవుడుకు కూడా దారితీస్తుంది.

ఇయర్‌ఫోన్‌లతో చెవులను ఎలా రక్షించుకోవాలి..

  • హెడ్‌ఫోన్స్, ఇయర్‌ఫోన్‌లను ఎక్కువసేపు ఉపయోగించడం మానుకోండి.
  • హెడ్‌ఫోన్‌లు – ఇయర్‌ఫోన్‌లను ఉపయోగిస్తున్నప్పుడు రెండింటి సౌండ్‌ను నార్మల్‌గా ఉంచండి.
  • వీలైనంత వరకు మీ హెడ్‌ఫోన్ లేదా ఇయర్‌ఫోన్‌ని ఎవరితోనూ పంచుకోకండి.
  • చెవుల లోపల ఇయర్‌ఫోన్‌లను ఎక్కువగా సర్దుబాటు (సౌండ్ పెంచడం) చేయడానికి ప్రయత్నించవద్దు.
  • కంపెనీకి చెందిన హెడ్‌ఫోన్‌లు, ఇయర్‌ఫోన్‌లను మాత్రమే ఉపయోగించడానికి ప్రయత్నించండి.
  • హెడ్‌ఫోన్‌లు, ఇయర్‌ఫోన్‌ల నుంచి ఎప్పటికప్పుడు విరామం తీసుకోండి.
  • వాటిని రోజుకు 60 నిమిషాల కంటే ఎక్కువ ఉపయోగించవద్దు.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం..

కోల్‌కతాపై ఘన విజయం.. పాయింట్ల పట్టికలో బిగ్ షాకిచ్చిన ముంబై..
కోల్‌కతాపై ఘన విజయం.. పాయింట్ల పట్టికలో బిగ్ షాకిచ్చిన ముంబై..
వారికి ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం.. 12 రాశుల వారికి రాశిఫలాలు
వారికి ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం.. 12 రాశుల వారికి రాశిఫలాలు
టెన్త్ విద్యార్థులకు అలెర్ట్.. పరీక్షలపై కీలక ప్రకటన
టెన్త్ విద్యార్థులకు అలెర్ట్.. పరీక్షలపై కీలక ప్రకటన
వేసవిలో చర్మాన్ని తాజాగా ఉంచేందుకు ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!
వేసవిలో చర్మాన్ని తాజాగా ఉంచేందుకు ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!
రికెల్టన్, సూర్య తుఫాన్ ఇన్నింగ్స్.. ముంబై ఖాతాలో తొలి విజయం
రికెల్టన్, సూర్య తుఫాన్ ఇన్నింగ్స్.. ముంబై ఖాతాలో తొలి విజయం
తనిఖిల్లో భాగంగా వాహనాన్ని ఆపిన పోలీసులు.. లోపల చెక్ చేయగా..
తనిఖిల్లో భాగంగా వాహనాన్ని ఆపిన పోలీసులు.. లోపల చెక్ చేయగా..
మీకు ఉన్న ఈ అలవాటును వెంటనే మానుకోండి..!
మీకు ఉన్న ఈ అలవాటును వెంటనే మానుకోండి..!
ఇంటర్నేషనల్ ప్లేయర్లతో కామెడీ ఆటలు.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్
ఇంటర్నేషనల్ ప్లేయర్లతో కామెడీ ఆటలు.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్
ముంబై ఏషియన్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్‌‌కు కొడాలి నాని తరలింపు
ముంబై ఏషియన్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్‌‌కు కొడాలి నాని తరలింపు
కెప్టెన్సీని విడిచిపెట్టే ముందు పరాగ్‌కు షాకిచ్చిన బీసీసీఐ
కెప్టెన్సీని విడిచిపెట్టే ముందు పరాగ్‌కు షాకిచ్చిన బీసీసీఐ