Viral: ఏడాదికి రూ. కోటి శాలరీ.. కానీ బోరింగ్ జాబ్ అంటూ కంపెనీపై కేసు.. సీన్ కట్ చేస్తే..
సాధారణంగా చాలామంది ఉద్యోగులు తమకు ఇచ్చే జీతం కంటే ఎక్కువ పని చేస్తున్నామని ఫీల్ అవుతుంటారు. ఇంకా చెప్పాలంటే..
సాధారణంగా చాలామంది ఉద్యోగులు తమకు ఇచ్చే జీతం కంటే ఎక్కువ పని చేస్తున్నామని ఫీల్ అవుతుంటారు. ఇంకా చెప్పాలంటే.. మాకు సెలవులు ఇవ్వట్లేదు.. ఇంటికెళ్లినా కూడా ఆఫీస్ వర్కే చేయిస్తున్నారు. బ్రేక్‌కు కూడా వెళ్లలేకపోతున్నాం అని బాధపడే ఉద్యోగులూ ఉన్నారు. అయితే మీకు ఇప్పుడు చెప్పబోయే వ్యక్తి కొంచెం డిఫరెంట్. డిఫరెంట్ అంటే.. అలా ఇలా కాదు.. కోట్లలో శాలరీ వచ్చి పడుతున్నా.. నాకు ఉద్యోగం బోరింగ్‌గా ఉందని.. ఆ సంస్థ మీదకు కేసు పెట్టి ఏకంగా కోర్టుకెక్కాడు. అవునండీ మీరు వినేది నిజమే. ఓ రైల్వే ఉద్యోగి తాను చేస్తున్న పని బోరు కొడుతోందని.. సదరు సంస్థపై కేసు పెట్టాడు. ఈ ఘటన ఐర్లాండ్‌లో చోటు చేసుకుంది. దాని వివరాల్లోకి వెళ్తే..
ఐర్లాండ్‌కు చెందిన డెర్మోట్ అలస్టైర్ మిల్స్ అనే వ్యక్తి డబ్లిన్‌లోని ఐరిష్ రైల్వేలో ఫైనాన్స్ మేనేజర్‌గా పని చేస్తున్నాడు. ఇక అతడి శాలరీ ఏడాది రూ. కోటి. అబ్బో.! ఇంత ఎక్కువ జీతమా.? ఇంకెందుకు కేసు పెట్టడం అని అనుకుంటున్నారా..? అసలు విషయం చెప్తా ఉందండి. మనోడికి జీతం బాగానే ఉంది. కానీ చేసే పని మాత్రం బోరింగ్ అంట. చేయడానికి పనేం లేదని కోర్టు కెక్కాడు. వారంలో కనీసం ఒక్కరోజైనా చేసేందుకు పన్లేదని.. న్యూస్ పేపర్లు చదవడం తప్ప వేరే పని ఏం లేదని మిల్స్ ఆవేదన చెందుతున్నాడు. 2014లో అకౌంట్స్ విషయంలో అవకతవకలు రావడంతో అప్పటి నుంచి తనకు ఎలాంటి పనులు అప్పజెప్పకుండా.. కేవలం న్యూస్ పేపర్లు చదవడానికే పరిమితం చేస్తున్నారని మిల్స్ వాపోయాడు. అందువల్ల తనను మిగతా సహోద్యోగుల నుంచి దూరం చేసిందని కోర్టులో మిల్స్ పేర్కొన్నాడు. కాగా, ఈ కేసు తదుపరి విచారణ ఫిబ్రవరికి వాయిదా పడగా.. ప్రస్తుతం ఈ అంశం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా తమ స్పందన తెలియజేస్తున్నారు.
మరిన్నిట్రెండింగ్ వార్తల కోసం..