Hyderabad: కోరిక తీర్చు.. లేకుంటే ఆ ఫొటోలు పోస్ట్ చేస్తా.. టీవీ యాంకర్‌కు బెదిరింపులు.. చివరకు..

ప్రేమంటూ తిరిగాడు.. కానీ ఆ యువతి నిరాకరించింది.. ఫ్రెండ్‌షిప్ చేద్దామంటూ నమ్మించాడు.. చివరకు కోరిక తీర్చాలంటూ మార్ఫింగ్ చేసిన ఫొటోలతో బెదిరించసాగాడు..

Hyderabad: కోరిక తీర్చు.. లేకుంటే ఆ ఫొటోలు పోస్ట్ చేస్తా.. టీవీ యాంకర్‌కు బెదిరింపులు.. చివరకు..
Women
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Dec 08, 2022 | 1:43 PM

ప్రేమంటూ తిరిగాడు.. కానీ ఆ యువతి నిరాకరించింది.. ఫ్రెండ్‌షిప్ చేద్దామంటూ నమ్మించాడు.. చివరకు కోరిక తీర్చాలంటూ మార్ఫింగ్ చేసిన ఫొటోలతో బెదిరించసాగాడు.. ఈ షాకింగ్ ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. కోరిక తీర్చాలని.. లేకుంటే మార్ఫింగ్‌ చేసిన నగ్న ఫొటోలను సోషల్ మీడియాలో పెడతానంటూ ఓ టీవీ ఛానల్‌ యాంకర్‌ను బెదిరిస్తున్న వ్యక్తిపై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. యాంకర్ ఫిర్యాదు మేరకు ఎస్సాఆర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఎస్సార్‌నగర్‌ సీఐ సైదులు వివరాల ప్రకారం.. మధురానగర్‌లోని హాస్టల్‌లో ఉంటున్న యువతి (27) ఓ టీవీలో యాంకర్‌గా పనిచేస్తోంది. ఆమె కళాశాలలో చదివే రోజుల్లో సహ విద్యార్థి అయిన కూకట్‌పల్లికి చెందిన కె.సామ్రాట్‌ (30) అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో సామ్రాట్ ప్రేమిస్తున్నానని చెప్పడంతో ఆమె నిరాకరించింది. ఆతర్వాత సామ్రాట్ స్నేహితుల్లా ఉందామంటూ ఆమెను నమ్మించడంతో ఓకే చెప్పింది.

ఫ్రెండ్‌షిప్ పేరిట.. గతంలో ఓసారి యువతిని కారులో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకుపోయి అత్యాచారానికి యత్నించాడని.. కానీ ఈ సమయంలో తప్పించుకున్నట్లు పోలీసులకు వివరించింది. దీంతో కక్ష గట్టిన సామ్రాట్‌.. యువతి చిత్రాలను నగ్న చిత్రాలుగా మార్ఫింగ్‌ చేశాడని పేర్కొంది.

ఇవి కూడా చదవండి

అనంతరం.. తన కోరిక తీర్చకుంటే సామాజిక మాధ్యమాల్లో పెట్టి, పరువు తీస్తానంటూ బెదిరిస్తున్నాడని.. బాధితురాలైన యాంకర్ బుధవారం పోలీసులను ఆశ్రయించినట్లు ఎస్సార్ నగర్ పోలీసులు తెలిపారు. యువకుడిని పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?