PM Modi: మేనియా ఆయనదే.. మ్యాజిక్ ఆయనదే.. గుజరాత్‌లో కమల వికాసం వెనుక మోడీ తంత్రం..

కర్త, కర్మ, క్రియ అన్నీ తానై.. అభ్యర్థులను కాదు.. నన్ను చూసి ఓటేయ్యండి అంటూ చేసిన మోడీ ప్రచారం సూపర్ హిట్ అయింది. గుజరాత్‌ అభివృద్ధే లక్ష్యం అంటూ మోడీ చేసిన ప్రచార అస్త్రాలు బీజేపీ విజయంలో కీలక పాత్ర పోషించాయి.

PM Modi: మేనియా ఆయనదే.. మ్యాజిక్ ఆయనదే.. గుజరాత్‌లో కమల వికాసం వెనుక మోడీ తంత్రం..
Pm Modi
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Dec 08, 2022 | 5:08 PM

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఏడుసార్లు.. డబుల్‌ హ్యాట్రిక్..! అయినా బీజేపీ మేనియా తగ్గలేదు. గత రికార్డులన్నీ తిరగరాస్తూ.. గుజరాత్‌లో భారతీయ జనతా పార్టీ.. మరోసారి బంపర్‌ మెజార్టీ సాధించింది. 27 ఏళ్లుగా అధికారాన్ని కొనసాగిస్తున్న బీజేపీకి మోడీనే బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారారు. బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ మోడీ మేనియా ముందు తేలిపోయారు. మోడీ వ్యూహానికి బీజేపీకి ఓట్లు, సీట్లు పెరగడంతోపాటు.. కాంగ్రెస్, ఆప్ కకావికలమయ్యాయి. ఈ సారి ట్రయాంగిల్‌ ఫైట్‌ ఉన్నా మోడీ ముందు అవేం పనిచేయలేదు. కులాల కుంపట్లు, ప్రాంతాల వారీగా పాలిటిక్స్ ఉన్నా.. ప్రజలు గుజరాత్ వికాస్ నినాదానికే పట్టంకట్టారు. అభివృద్ధికి అవినీతికి జరుగుతున్న యుద్ధంగా ఈ ఎన్నికలను ప్రకటించిన మోదీ తన ప్రచారంతో విశేషంగా ఆకట్టుకున్నారు. కర్త, కర్మ, క్రియ అన్నీ తానై.. అభ్యర్థులను కాదు.. నన్ను చూసి ఓటేయ్యండి అంటూ చేసిన మోడీ ప్రచారం సూపర్ హిట్ అయింది. గుజరాత్‌ అభివృద్ధే లక్ష్యం అంటూ మోడీ చేసిన ప్రచార అస్త్రాలు బీజేపీ విజయంలో కీలక పాత్ర పోషించాయి. ఈ ఫలితాల్లో బీజేపీకి రికార్డు మెజార్టీ దక్కింది. ఏకంగా 157 స్థానాల్లో బీజేపీ సత్తా చాటగా, కేవలం 16 స్థానాలకే పరిమితమైంది కాంగ్రెస్‌. ఆమ్‌ఆద్మీ ఐదు స్థానాలు దక్కుతున్నాయి.

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దేశంలోనే సంచలనంగా మారాయి. గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ విజయం చారిత్రాత్మకం కానుందనడంలో సందేహం లేదు. కాంగ్రెస్‌కి పూర్తిగా పతనమైంది. ప్రస్తుతం ఆపార్టీ నాయకుల్లో కాంగ్రెస్ ఓట్లు ఎట్లు బదిలీ అయ్యాయి. అనే సందేహం కలుగుతోంది. సంచలనం సృష్టిస్తామన్న ఆప్ పార్టీ మాత్రం సింగిల్ డిజిట్‌కే పరిమితమైంది. అయితే, ఈ ఎన్నికల ఫలితాలు గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మేనియా అని.. దాని ప్రకారమే ఓట్లు, సీట్లు వచ్చాయని భావిస్తున్నారు. గుజరాత్‌లో మోడీ మ్యాజిక్ ఎలా పనిచేసిందో తెలుసుకుంటే మీరే ఆశ్చర్యపోతారు. మోడీ.. 22 ఏళ్ల ప్రయాణంతో ఇది సాధ్యమైందని చెప్పవచ్చు.. అదేంటో ఈ ప్రత్యేక కథనంలో చూడండి..

బీజేపీని గెలిపించే నాయకుడిగా నరేంద్ర మోదీ ఎలా మారారు? దీనికి ప్రధాన కారణాలు ఏమిటో తెలుసుకోండి..

ప్రణాళికగా టిక్కెట్ల పంపిణీ.. ఆ సంప్రదాయానికి తెర..

గెలిచిన వారికి టిక్కెట్లు ఇచ్చే సంప్రదాయం ప్రతి ఎన్నికల్లోనూ మారిపోతూ వచ్చింది. గత దశాబ్ద కాలంలో టిక్కెట్ల పంపిణీ విధానంలో బీజేపీ పెనుమార్పు తెచ్చింది. పార్టీని బలోపేతం చేసేందుకు, ఎన్నికల్లో గెలవడానికి ప్రధాని మోదీ వివిధ రంగాలకు చెందిన వ్యక్తులను ఎంచుకున్నారు. టిక్కెట్ జాబితాలో క్రీడాకారులు, రచయితలు, కళాకారులు, కవులు, సామాజిక కార్యకర్తలు, రిటైర్డ్ సాయుధ సిబ్బంది, బ్యూరోక్రాట్‌లను చేర్చారు. ప్రతి వర్గానికి పార్టీని కనెక్ట్ చేయడానికి వెనుకబడిన వర్గాలకు టిక్కెట్లు ఇవ్వడం ప్రారంభించారు. నియోజకవర్గాల వారీగి రిపోర్ట్, పరిశోధన, అభ్యర్థుల గుర్తింపు తర్వాత టికెట్‌ ఇచ్చే సంస్కృతిని తీసుకువచ్చారు. ఇలా, గెలిచే అభ్యర్థికే టికెట్ ఇచ్చే సంప్రదాయం ఒక్కోసారిగా మారిపోయింది. దాని ప్రభావం కూడా ఈ ఎన్నికల్లో కనిపించింది.

పరిశోధన: రాజకీయ సర్వేల నుంచి ప్రజల మనస్సును అర్థం చేసుకోవడం

నరేంద్ర మోడీ రాజకీయ సర్వే ప్రారంభించారు. బీజేపీ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో, ఆ పార్టీని ఎంతగా ఇష్టపడుతున్నారు, బీజేపీ విధానాలను ఎంత దగ్గరగా అర్థం చేసుకున్నారో అర్థం చేసుకోవడానికి ఇది సహాయపడుతుంది. సర్వే ఆధారంగా బీజేపీకి దూరమైన ఓటర్లను మళ్లీ వెనక్కి తీసుకురావడానికి ఇలాంటి రాజకీయ సర్వేలను ప్రారంభించారు. దీన్ని బట్టి ఏయే నియోజకవర్గాల్లో పార్టీ బలంగా ఉందో, ఏయే నియోజకవర్గాల్లో వెనుకబడి ఉందో అర్థమవుతోంది. సంఘ్ ప్రచారకుడిగా, ఆర్ఎస్ఎస్ నేతగా.. దేశ ప్రజలు ఏమనుకుంటున్నారో అర్థం చేసుకోవడానికి నరేంద్ర మోడీ ఈ పంథాను ప్రయత్నించారు. పార్టీకి కూడా అదే ఆలోచన అమలు చేశారు.

ప్రచారం: ర్యాలీలతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం..

1995లో నరేంద్ర మోదీ చండీగఢ్‌కు ఇన్‌ఛార్జ్‌గా బాధ్యతలు స్వీకరించినప్పుడు, కార్యకర్తలతో సమావేశాలు ఒక దశలో జరిగాయి. భాజపా ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి 2 వేల మంది మాత్రమే హాజరు కావడంపై కార్యకర్తలకు సూటిగా ప్రశ్నలు వేశారు. భారీగా తరలించాలని.. దాని కోసం వ్యూహాలను అమలు చేయాలని సూచించారు. ఇది.. చండీగఢ్‌లో మార్పునకు దారి తీసింది. ఆ తర్వాత అక్కడ జరిగిన ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. బీజేపీ ఈ ఫార్ములాను కూడా అమలు చేస్తూ వచ్చింది.

2001లో మోడీ గుజరాత్ ముఖ్యమంత్రి అయినప్పుడు, మరుసటి సంవత్సరం అంటే 2002లో అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కోవలసి వచ్చింది. గుజరాత్‌లో గౌరవ్ యాత్రను ప్రారంభించారు. ఇది బాగా సక్సెస్ అయింది. 3000 కిలోమీటర్ల సుదీర్ఘ యాత్రకు గుజరాతీలు స్వాగతం పలుకగా, పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. ఈ సద్భావన యాత్ర తర్వాత గుజరాతీలపై ప్రభావం చూపింది. ఈ పర్యటనల ద్వారా నరేంద్ర మోదీ నేరుగా ప్రజలతో మమేకమయ్యారు. ఈ ప్రయోగాన్ని కొనసాగిస్తూ యువతను పార్టీతో అనుసంధానం చేసేందుకు 2012లో వివేకానంద యువ వికాస్ యాత్రను ప్రారంభించారు.

మేనిఫెస్టో: ప్రజలకు చెప్పిన వాటిని నెరవేర్చే ప్రయత్నం

ఎన్నికల మేనిఫెస్టోలో మోదీ ప్రజలకు ఇచ్చిన హామీని కచ్చితంగా నెరవేర్చేవారు. 2007 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విద్యుత్ బిల్లు మాఫీ అంశాన్ని లేవనెత్తింది. ఇందుకోసం అప్పటి ముఖ్యమంత్రి మోదీపై కూడా ఒత్తిడి తెచ్చారు. బీజేపీ మేనిఫెస్టోలో చేర్చాలని పార్టీ నాయకులు ఆయనకు సూచించారు. ఇది నెరవేరకపోతే.. తాను నాయకుడిని కాను అంటూ మోడీ సమాధానం ఇచ్చారు. అనవసర వాగ్దానాలు ప్రజల్లో తప్పుడు సందేశాన్ని ఇస్తాయని.. గుజరాత్‌లో ఏ అభివృద్ధి చేసినా ఇచ్చిన మాట ప్రకారం పూర్తిచేయాలని పేర్కొనేవారు. మేనిఫేస్టో లో చెప్పకపోయినా అభివృద్ది చేసి చూపించాలని పేర్కొనే వారు.

బూత్ నిర్వహణ: బూత్ లెవల్లో పార్టీ బలోపేతం..

బూత్ మేనేజ్‌మెంట్‌ను మెరుగుపరిచేందుకు బీజేపీ ఏడాదికేడాది వ్యూహాన్ని పటిష్టం చేస్తోంది. ఎన్నికలను సైన్స్‌గా పరిగణించాలని మోదీ ఎప్పటి నుంచో నమ్ముతున్నారు. చండీగఢ్ ఇన్‌ఛార్జ్‌గా, బూత్‌లో కనీసం 11 మందితో కూడిన బృందం ఉండాలని ఆయన పట్టుబట్టేవారు. లోపల ఇద్దరు వ్యక్తులు ఉండాలి, ఒకరు రిలీవర్, మరొకరు అటెండర్, ఒకరు బయట టేబుల్ వద్ద కూర్చునే వారు.. మరొకరు స్లిప్ సేకరించి ఇచ్చేవారు.. అంతే కాదు ఇంకా ఓటు వేయని వ్యక్తులకు కూడా చేరువ కావాలి. మన బూత్ అత్యంత బలమైనది కావాలంటూ మోడీ కార్యకర్తలకు బోధించేవారు. అదే మోడీ నినాదంతో బీజేపీ అధికారంలోకి రావడానికి ఏడాది పొడవునా బూత్ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. బీజేపీ ఇంటింటికి ప్రచారం అత్యంత ప్రజాదరణ పొందింది.

పేజ్ ప్రెసిడెంట్: ప్రజల్లో పార్టీని బలోపేతం చేసేందుకు కార్యక్రమాలు

ప్రధాని మోదీ పర్యవేక్షణలో బూత్‌ను బలోపేతం చేసేందుకు బూత్‌ల నుంచి జాతీయ స్థాయి నేతలకు పేజ్ అధ్యక్షుడి బాధ్యతలు అప్పగించారు. గుజరాత్‌లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బూత్ మేనేజ్‌మెంట్, పేజీ ప్రెసిడెంట్ అనే భావనను ప్రవేశపెట్టారు. ముఖ్యమంత్రి పదవిని చేపట్టినప్పుడు, అతను గుజరాత్‌లోని ఒక బూత్‌లో పేజ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వహించడం ద్వారా పార్టీ, దానితో ఉన్న కార్యకర్తలు ప్రేరేపితం అవుతారని మోడీ.. విశ్వసిస్తారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం