UG textbooks: డిగ్రీ పాఠ్యపుస్తకాలను ప్రాంతీయ భాషల్లో ముద్రించేందుకు అంతర్జాతీయ పబ్లిషర్లతో యూజీసీ భాగస్వామ్యం
దేశంలోని వివిధ ప్రాంతీయ భాషల్లో అండర్ గ్రాడ్యుయేట్ టక్ట్స్ బుక్స్‌లను ముద్రించడంపై పలు అంతర్జాతీయ పబ్లిషర్లతో యూజీసీ ఛైర్మన్ ఎమ్ జగదీశ్ కుమార్ బుధవారం (డిసెంబర్ 7) సమావేశం నిర్వహించారు..
దేశంలోని వివిధ ప్రాంతీయ భాషల్లో అండర్ గ్రాడ్యుయేట్ టక్ట్స్ బుక్స్‌లను ముద్రించడంపై పలు అంతర్జాతీయ పబ్లిషర్లతో యూజీసీ ఛైర్మన్ ఎమ్ జగదీశ్ కుమార్ బుధవారం (డిసెంబర్ 7) సమావేశం నిర్వహించారు. విలే ఇండియా, స్ప్రింగర్ నేచర్, టేలర్ అండ్ ఫ్రాన్సిస్, కేంబ్రిడ్జ్ యూనివర్శిటీ ప్రెస్ ఇండియా, సెంగేజ్ ఇండియా, మెక్‌గ్రా-హిల్ ఇండియా ప్రతినిధులతో ఈ సమావేశంలో పలు అంశాలపై ఆయన చర్చించారు. ప్రాంతీయ భాషలను ప్రోత్సహించేందుకు చేపట్టిన ఈ మిషన్‌లో పాల్గొనేందుకు ఆయా సంస్థల ప్రతినిధుల భాగస్వామ్యాన్ని కోరినట్లు యూజీసీ ఛైర్మాన్ తెలిపారు.
‘ఈ జాతీయ మిషన్‌లో భాగస్వాములయ్యేందుకు అంతర్జాతీయ పబ్లిషర్లు అందరూ తమ అంగీకారాన్ని తెలిపారు. దీనిపై యూజీసీ అపెక్స్ కమిటీని సైతం ఏర్పాటు చేసింది. త్వరలోనే ప్రణాళికలు రూపొందించి కార్యచరణ ప్రారంభిస్తాం. త్వరలోనే దేశంలోని విభిన్న ప్రాంతీయ భాషల్లో డిగ్రీ పాఠ్యపుస్తకాలు తీసుకొస్తామని పేర్కొంటూ’ బుధవారం తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేశారు.
Today met representatives from Wiley India, Springer Nature, Taylor & Francis, Cambridge University Press India, Cengage India, and McGraw-Hill India to discuss bringing out Undergraduate English textbooks in Indian languages.
— Mamidala Jagadesh Kumar (@mamidala90) December 7, 2022
కాగా మధ్యప్రదేశ్‌లో ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ అనాటమీ, బయోకెమిస్ట్రీ, ఫిజియాలజీ సబ్జెక్టులకు సంబంధించి హిందీ మీడియం టెక్స్ట్ బుక్‌లను కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రారంభించిన కొన్ని నెలల తర్వాత యూజీసీ ఈ సమావేశం నిర్వహించడం విశేషం. మెడికల్, టెక్నికల్ ఎడ్యుకేషన్‌ను ప్రాంతీయ భాషల్లో అభ్యసించేందుకు విద్యార్ధులను ప్రోత్సహించడం ద్వారా ‘బ్రెయిన్ డ్రెయిన్’ను ‘బ్రెయిన్ గెయిన్’గా మర్చే ప్రయత్నం ప్రధాని మోదీ చేస్తున్నారని జగదీష్‌కుమార్ తెలిపారు. టెక్నికల్ కోర్సులను కూడా ప్రాంతీయ భాషల్లో బోధించేందుకు ఇప్పటికే ప్రారంభమైన చర్చలు వచ్చే ఏడాది జనవరి 31 వరకు కొనసాగనున్నాయి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.