AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TSPSC Lecturer Jobs: తెలంగాణ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీల్లో 247 లెక్చర్‌ ఉద్యోగాలు.. దాదాపు రూ.2 లక్షల జీతం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన టెక్నికల్ ఎడ్యుకేషన్ సర్వీసులోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీల్లో.. 247 పాలిటెక్నిక్‌ లెక్చరర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్పీయస్సీ) నోటిఫికేషన్‌..

TSPSC Lecturer Jobs: తెలంగాణ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీల్లో 247 లెక్చర్‌ ఉద్యోగాలు.. దాదాపు రూ.2 లక్షల జీతం
TSPSC Lecturer Jobs
Srilakshmi C
|

Updated on: Dec 08, 2022 | 2:59 PM

Share

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన టెక్నికల్ ఎడ్యుకేషన్ సర్వీసులోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీల్లో.. 247 పాలిటెక్నిక్‌ లెక్చరర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్పీయస్సీ) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద దాదాపు 19 సబ్జెక్టుల్లో లెక్చరర్‌ పోస్టులను భర్తీ చేసేందుకు ఈ ఏడాది జులై 23వ తేదీన ఆర్థిక శాఖ అనుమతి తెల్పిన విషయం తెల్సిందే.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంజినీరింగ్‌ బీఈ/బీటెక్‌/బీఎస్/పీజీ/బీఆర్క్‌/బీఫార్మసీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్ధుల వయసు జులై 1, 2022వ తేదీ నాటికి తప్పనిసరిగా 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే జులై 1, 2004 నుంచి జులై 2, 1978 తేదీల మధ్య జన్మించి ఉండాలి. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ విధానంలో జనవరి 4, 2023వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్‌ 14వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. రాత పరీక్ష ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. మే/జూన్‌ 2023 నెలల్లో రాత పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది. ఎంపికైన వారికి నెలకు రూ.56,100ల నుంచి రూ.1,82,400ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు..

  • ఆటోమొబైల్ ఇంజనీరింగ్ పోస్టులు: 15
  • బయో-మెడికల్ ఇంజనీరింగ్ పోస్టులు: 3
  • కెమికల్ ఇంజనీరింగ్ పోస్టులు: 1
  • సివిల్ ఇంజనీరింగ్ పోస్టులు: 82
  • ఎలక్ట్రికల్ అండ్‌ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ పోస్టులు: 24
  • ఎలక్ట్రానిక్స్ అండ్‌ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ పోస్టులు: 41
  • ఎలక్ట్రానిక్స్ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ పోస్టులు: 1
  • ఫుట్ వేర్ టెక్నాలజీ పోస్టులు: 5
  • లెటర్ ప్రెస్ (ప్రింటింగ్ టెక్నాలజీ) పోస్టులు: 5
  • మెకానికల్ ఇంజనీరింగ్ పోస్టులు: 36
  • మెటలర్జీ పోస్టులు: 5
  • ప్యాకేజింగ్ టెక్నాలజీ పోస్టులు: 3
  • టెన్నెరీ పోస్టులు: 3
  • టెక్స్‌టైల్ టెక్నాలజీ పోస్టులు: 1
  • ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్ పోస్టులు: 4
  • ఫార్మసీ పోస్టులు: 4
  • జియోలజీ పోస్టులు: 1
  • కెమిస్ట్రీ పోస్టులు: 8
  • ఫిజిక్స్‌ పోస్టులు: 5

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
అమ్మకాల్లో రికార్డు సృష్టిస్తున్న ఎలక్ట్రిక్‌ స్కూటర్‌..
అమ్మకాల్లో రికార్డు సృష్టిస్తున్న ఎలక్ట్రిక్‌ స్కూటర్‌..
వరల్డ్ రికార్డ్‌తో చరిత్ర సృష్టించిన టీమిండియా స్పిన్ స్టార్..
వరల్డ్ రికార్డ్‌తో చరిత్ర సృష్టించిన టీమిండియా స్పిన్ స్టార్..
పాకిస్తాన్‌పై భారత్ ఘనవిజయం.. ప్రపంచకప్‌లో హర్మన్ సేన బోణీ..!
పాకిస్తాన్‌పై భారత్ ఘనవిజయం.. ప్రపంచకప్‌లో హర్మన్ సేన బోణీ..!
400 కి.మీ వరకు మైలేజీనిచ్చే ఇ-స్కూటర్ల గురించి తెలుసా?
400 కి.మీ వరకు మైలేజీనిచ్చే ఇ-స్కూటర్ల గురించి తెలుసా?
సోమవారం శివాలయానికి వెళ్లలేకపోతున్నారా? ఇంట్లోనే ఈ విధంగా పూజి..
సోమవారం శివాలయానికి వెళ్లలేకపోతున్నారా? ఇంట్లోనే ఈ విధంగా పూజి..
దీపారాధన మధ్యలో ఆగిపోతే అశుభమా? ఐశ్వర్యం, పుణ్యం, మరణానంతర..
దీపారాధన మధ్యలో ఆగిపోతే అశుభమా? ఐశ్వర్యం, పుణ్యం, మరణానంతర..
మీ మొదటి ₹1000 ఎలా ₹1 లక్ష అవుతుందో తెలుసా..? మనీ మ్యాజిక్
మీ మొదటి ₹1000 ఎలా ₹1 లక్ష అవుతుందో తెలుసా..? మనీ మ్యాజిక్
ఛేజింగ్‌కు ముందే ఓటమి ఒప్పేసుకున్న పాక్ కోచ్.. ఎందుకంటే?
ఛేజింగ్‌కు ముందే ఓటమి ఒప్పేసుకున్న పాక్ కోచ్.. ఎందుకంటే?
నాగచైతన్య సినిమాలో సీనియర్ హీరోయిన్..
నాగచైతన్య సినిమాలో సీనియర్ హీరోయిన్..
డిగ్రీ పాస్ అయితే చాలు.. 4,500 బ్యాంక్ అప్రెంటిస్ పోస్టులు, నెలకు
డిగ్రీ పాస్ అయితే చాలు.. 4,500 బ్యాంక్ అప్రెంటిస్ పోస్టులు, నెలకు