Cantonment Board Jobs 2022: 8వ/పదో తరగతి అర్హతతో కంటోన్మెంట్ బోర్డు ఉద్యోగాలు.. ఇలా ఎంపిక చేస్తారు..

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన కంటోన్మెంట్ బోర్డు దేశ వ్యాప్తంగా పలు కేంద్రాల్లో.. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన 173 జూనియర్‌ క్లర్క్, ఆర్‌ఎమ్‌ఓ, అసిస్టెంట్‌ టీచర్‌ ఇతర పోస్టుల భర్తీకి అర్హులైన..

Cantonment Board Jobs 2022: 8వ/పదో తరగతి అర్హతతో కంటోన్మెంట్ బోర్డు ఉద్యోగాలు.. ఇలా ఎంపిక చేస్తారు..
Cantonment Board
Follow us

|

Updated on: Dec 07, 2022 | 6:25 PM

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన కంటోన్మెంట్ బోర్డు దేశ వ్యాప్తంగా పలు కేంద్రాల్లో.. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన 173 జూనియర్‌ క్లర్క్, ఆర్‌ఎమ్‌ఓ, అసిస్టెంట్‌ టీచర్‌ ఇతర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆయ పోస్టులను బట్టి 8వ తరగతి, పదో తరగతి, డిప్లొమా, సంబంధిత స్పెషలైజేషన్‌లో డిగ్రీ, ఎంబీబీఎస్‌ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్ధుల వయసు 21 నుంచి 35 ఏళ్లకు మధ్య ఉండాలి. రిజర్వేషన్‌ వర్గాలకు వయోపరిమితి విషయంలో సడలింపు వర్తిస్తుంది. ఈ అర్హతలున్న వారు ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌ విధానంలో జనవరి 30, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. జీతభత్యాలు నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ప్రాంతాల వారీగా ఖాళీల వివరాలు..

  • లక్నోలో ఖాళీలు: 15
  • ఢిల్లీ ఖాళీలు: 4
  • జలపహార్ ఖాళీలు: 7
  • జబల్పూర్ ఖాళీలు: 48
  • అహ్మద్‌నగర్ ఖాళీలు: 40
  • కాన్పూర్ ఖాళీలు: 9
  • షాజహాన్‌పూర్ ఖాళీలు: 5
  • ఔరంగాబాద్ ఖాళీలు: 31
  • షిల్లాంగ్ ఖాళీలు: 9
  • బెల్గాం ఖాళీలు: 5

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.