CUAP Jobs 2022: సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేలో టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగాలు.. విభాగాల వారీగా ఖాళీలు ఇలా..
అనంతపురం జిల్లాలోని సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్..డైరెక్ట్/ డిప్యుటేషన్ ప్రాతిపదికన 24 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ..
అనంతపురం జిల్లాలోని సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్..డైరెక్ట్/ డిప్యుటేషన్ ప్రాతిపదికన 24 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది.
విభాగాలు..
ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్/ఎకనామిట్రిక్స్, సైకాలజీ, పొలిటికల్ సైన్స్/ఇంటర్నేషనల్ రిలేషన్స్/పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్/పబ్లిక్ పాలసీ, ఇంగ్లిష్, మేనేజ్‌మెంట్, తెలుగు, వొకేషనల్ స్టడీస్ అండ్ స్కిల్ డెవలస్‌మెంట్ డిపార్ట్‌మెంట్లలో ఖాళీలున్నాయి.
అర్హతలు, అప్లికేషన్ విధానం..
పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో డిగ్రీ, పోస్టు గ్రాడ్యుయేషన్, ఎంఫిల్, పీహెచ్‌డీ, డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దరఖాస్తుదారుల వయసు 32 నుంచి 40ల మధ్య ఉండాలి. ఆసక్తి కలిగిన వారు డిసెంబర్ 14, 2022వ తేదీలోపు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. అనంతరం నింపిన దరఖాస్తులను డౌన్‌లోడ్ చేసుకుని కింది అడ్రస్‌కు డిసెంబర్ 26వ తేదీలోపు పోస్టు ద్వారా పంపించవల్సి ఉంటుంది. దరఖాస్తు సమయంలో జనరల్ అభ్యర్ధులు టీచింగ్ పోస్టులకు రూ.2000లు, నాన్‌టీచింగ్ పోస్టులకు రూ.1000ల చొప్పున అప్లికేషన్ ఫీజు కింద చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ/పీడబ్ల్యూబీడీ/మహిళా అభ్యర్ధులు ఎటువంటి ఫీజు చెల్లించవల్సిన అవసరం లేదు. ఎంపిక విధానం, జీతభత్యాల వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
పోస్టుల వివరాలు..
- ప్రొఫెసర్ పోస్టులు: 2
- అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు: 5
- అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు: 9
- అసిస్టెంట్ లైబ్రేరియన్ పోస్టులు: 1
- అసిస్టెంట్ రిజిస్ట్రార్ పోస్టులు: 1
- సెక్షన్ ఆఫీసర్ పోస్టులు: 1
- జూనియర్ ఇంజినీర్(సివిల్) పోస్టులు: 1
- టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు: 1
- అప్పర్ డివిజన్ క్లర్క్ పోస్టులు: 2
- సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్టులు: 2
అడ్రస్..
Central University of Andhra Pradesh, Ananthapuramu-515002.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.