Union Bank Recruitment 2022: రాత పరీక్షలేకుండా యూనియన్‌ బ్యాంక్‌లో కొలువులు పొందే అవకాశం.. పూర్తి వివరాలివే..

ముంబయిలోని యూనియన్‌ బ్యాంక్‌.. ఒప్పంద ప్రాతిపదికన 33 ఎక్స్‌టర్నల్‌ ఫ్యాకల్టీ, అకడమిషియన్లు, ఇండస్ట్రీ అడ్వైజర్‌ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌..

Union Bank Recruitment 2022: రాత పరీక్షలేకుండా యూనియన్‌ బ్యాంక్‌లో కొలువులు పొందే అవకాశం.. పూర్తి వివరాలివే..
Union Bank
Follow us
Srilakshmi C

|

Updated on: Dec 07, 2022 | 6:03 PM

ముంబయిలోని యూనియన్‌ బ్యాంక్‌.. ఒప్పంద ప్రాతిపదికన 33 ఎక్స్‌టర్నల్‌ ఫ్యాకల్టీ, అకడమిషియన్లు, ఇండస్ట్రీ అడ్వైజర్‌ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. స్ట్రాటజీ, ఫైనాన్స్‌, క్రెడిట్‌ అండ్‌ పాలసీ, సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌, రూరల్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ ఇన్‌క్లూజన్‌, డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ తదితర విభాగాల్లోని పోస్టులను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయనున్నారు.

ఈ పోస్టుకలు దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ/ ఎంబీఏ/ ఎంఫిల్‌/ పీహెచ్‌డీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత పనిలో కనీసం 5 నుంచి10 ఏళ్ల పని అనుభవం ఉండాలి. అభ్యర్ధుల వయసు తప్పనిసరిగా ఆయా పోస్టులను బట్టి 38 నుంచి 60 ఏళ్ల మధ్య ఉండాలి. ఆసక్తి కలిగిన వారు డిసెంబర్‌ 27, 2022వ తేదీలోపు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్‌ కేటగిరి అభ్యర్ధులు రూ.750లు, ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ కేటగిరికి చెందిన వారు రూ.150లు అప్లికేషన్‌ ఫీజు చెల్లించాలి. షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారు ముంబయి, భోపాల్‌, హైదరాబాద్‌, బెంగళూరు, లఖ్‌నవూ, గురుగావ్‌, మంగళూరు ప్రదేశాల్లో పనిచేయవల్సి ఉంటుంది. ఇతర వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.