IOB Bank Recruitment 2022: బ్యాంక్ జాబ్స్! ఇండియన్ ఒవర్సీస్ బ్యాంక్‌లో మేనేజర్ ఉద్యోగాలు.. అర్హతలేవంటే..
చెన్నైలోని ఇండియన్ ఒవర్సీస్ బ్యాంక్.. 25 మేనేజర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత..
చెన్నైలోని ఇండియన్ ఒవర్సీస్ బ్యాంక్.. 25 మేనేజర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత స్పెషలైజేషన్లో బీఈ/బీటెక్/ఎంఈ/ఎంటెక్ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది. అలాగే నవంబర్ 1, 2022వ తేదీ నాటికి దరఖాస్తుదారుల వయసు కనిష్టంగా 25, గరిష్టంగా 30 ఏళ్లకు మించకుండా ఉండాలి. ఆసక్తి కలిగినవారు ఆన్‌లైన్ విధానంలో డిసెంబర్ 17, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో తప్పనిసరిగా జనరల్ అభ్యర్ధులు రూ.500లు, ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్ధులు రూ.100లు అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఆన్‌లైన్ రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. ఎంపికైవారికి నెలకు రూ.48,170ల నుంచి రూ.69,810ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
ఖాళీల వివరాలు..
- మేనేజర్-బిజినెస్ అనలిస్ట్ పోస్టులు: 1
- మేనేజర్-డేటా ఇంజనీర్ పోస్టులు: 2
- మేనేజర్-క్లౌడ్ ఇంజనీర్ పోస్టులు: 1
- మేనేజర్-డేటా సైంటిస్ట్ పోస్టులు: 1
- మేనేజర్-నెట్‌వర్క్ సెక్యూరిటీ ఇంజనీర్ పోస్టులు: 1
- మేనేజర్-ఒరాకిల్ DBA పోస్టులు: 2
- మేనేజర్-మిడిల్ వేర్ ఇంజనీర్ పోస్టులు: 1
- మేనేజర్-సర్వీస్ అడ్మినిస్ట్రేటర్ పోస్టులు: 2
- మేనేజర్-నెట్‌వర్క్- రూటింగ్ & స్విచింగ్ ఇంజనీర్ పోస్టులు: 2
- మేనేజర్-హార్డ్‌వేర్ ఇంజనీర్ పోస్టులు: 1
- మేనేజర్-సొల్యూషన్ ఆర్కిటెక్ట్ పోస్టులు: 1
- మేనేజర్ – డిజిటల్ బ్యాంకింగ్ (RTGS/ NEFT) పోస్టులు: 1
- మేనేజర్ – డిజిటల్ బ్యాంకింగ్ (డెబిట్ కార్డ్ & ATM స్విచ్) పోస్టులు: 1
- మేనేజర్ – ATM మేనేజ్డ్ సర్వీసెస్ & ATM స్విచ్ పోస్టులు: 2
- మేనేజర్ – మర్చంట్ అక్విజిషన్ పోస్టులు: 1
- మేనేజర్ – డిజిటల్ బ్యాంకింగ్ (IB, MB, UPI) పోస్టులు: 3
- మేనేజర్ – డిజిటల్ బ్యాంకింగ్ (రికన్సిలియేషన్) పోస్టులు: 1
- మేనేజర్ –కంప్లియెన్స్ & ఆడిట్ పోస్టులు: 1
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.