AP SI, Constable Free Coaching: గుడ్‌న్యూస్! ఏపీ పోలీస్ కానిస్టేబుల్/ఎస్‌ఐ ఉద్యోగాలకు ఉచిత కోచింగ్.. ఇలా అప్లై చేసుకోండి..
ఆంధ్రప్రదేశ్‌లో తాజాగా 6100 పోలీస్ కానిస్టేబుల్, 411 ఎస్సై ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదలైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో..
ఆంధ్రప్రదేశ్‌లో తాజాగా 6100 పోలీస్ కానిస్టేబుల్, 411 ఎస్సై ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదలైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దాదాపు వెయ్యి మందికి ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ మంగళవారం (డిసెంబర్ 6) ప్రకటించారు. హైదరాబాద్‌లోని ప్రముఖ కోచింగ్ సంస్థ అయిన ఐఎసిఇ భాగస్వామ్యంతో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానల్లో ఉచిత కోచింగ్ ఇవ్వనున్నట్లు ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు.
ఐతే ముందుగా స్ట్రీనింగ్ టెస్ట్ నిర్వహించి, దానిలోమెరిట్ సాధించినవారికి వెయ్యి మంది అభ్యర్ధులకు ఉచిత కోచింగ్ ఇవ్వనున్నారు. స్ట్రీనింగ్ టెస్ట్ డిసెంబరు 11వ తేదీని ఉదయం 9 గంటల 30 నిముషాలకు రెండు తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు 38 పరీక్ష కేంద్రాల్లో రాత పరీక్ష నిర్వహిస్తారు. వీటిల్లో దాదాపు 21 పరీక్ష కేంద్రాలు ఏపీలోనే ఉంటాయి. ఆసక్తి కలిగిన అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు 7093651037 వాట్సప్ నంబర్‌కు ‘Hai’ అని ఇంగ్లిష్‌లో టైప్ చేసి మెసేజ్ పంపించాలి. సందేహాలు, ఇతర వివరాలకు మొబైల్ నెంబర్ 9533200400కు సంప్రదించవల్సిందిగా జేడీ లక్ష్మీనారాయణ సూచించారు.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.