AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాహుల్‌ డ్రాప్‌క్యాచ్‌ వల్లే భారత జట్టు ఓడిందా?.. అలా చేసి ఉంటే ఆట మరోలా ఉండేది: సునీల్‌ గవాస్కర్‌

తొలివన్డేలో భారత్‌ జట్టు ఓటమిపాలైందని అందరూ వికెట్ కీపర్ కేఎల్‌ రాహుల్‌ను ఆడిపోసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తొలిసారిగా లెజెండరీ ఇండియన్‌ సీనియర్‌ క్రికెటర్‌ సునీల్‌ గవాస్కర్‌ మాత్రం కేఎల్‌ రాహుల్‌ పక్షాన నిలిచి..

రాహుల్‌ డ్రాప్‌క్యాచ్‌ వల్లే భారత జట్టు ఓడిందా?.. అలా చేసి ఉంటే ఆట మరోలా ఉండేది: సునీల్‌ గవాస్కర్‌
Sunil Gavaskar Comes Out In Kl Rahul's Defence
Srilakshmi C
|

Updated on: Dec 07, 2022 | 2:13 PM

Share

బంగ్లాదేశ్‌తో ఆదివారం జరిగిన తొలి వన్డేలో 41.2 ఓవర్లలో 186 పరుగులకే టీం ఇండియా ఆల్‌ఔట్‌ అయ్యింది. అటు రోహిత్ శర్మ సారథ్యంలో జరిగిన ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌ పరంగానూ, ఇటు ఫీల్డింగ్‌ పరంగానూ టీం ఇండియా పేలవమైన ఆటతీరును కనబరిచి, అభిమానులను నిరాశ పరిచింది. ఇక చివరి ఓవర్‌లో బంతిని వదిలేయడం వల్లనే భారత్‌ జట్టు ఓటమిపాలైందని అందరూ వికెట్ కీపర్ కేఎల్‌ రాహుల్‌ను ఆడిపోసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తొలిసారిగా లెజెండరీ ఇండియన్‌ సీనియర్‌ క్రికెటర్‌ సునీల్‌ గవాస్కర్‌ మాత్రం కేఎల్‌ రాహుల్‌ పక్షాన నిలిచి ఓటమికి గల కారణాలను విశ్లేషించారు.

‘కేవలం రాహుల్‌ బంతిని వదిలేయడం వల్లనే తొలి వన్డేలో టీం ఇండియా ఓటమి పాలైందని చెప్పలేం. అది చివరి వికెట్‌ మాత్రమే. దానితో మ్యాచ్‌ ముగిసిపోయింది. కానీ అప్పటికే భారత్‌ జట్టు186 స్కోర్‌ మాత్రమే సాధించింది. బౌలర్లు అద్భుతంగా రాణించి.. 136-9తో నిలిచారు. ఆ తర్వాత వచ్చిన హసన్ మిరాజ్‌కు డ్రాప్ క్యాచ్‌ కలిసొచ్చింది. అతను అద్భుతమైన ఆటతీరు కనబరిచాడు. బంగ్లా జట్టు జాగ్రత్తగా ఆడి, ప్రత్యర్ధి జట్టుపై దాడి కొనసాగించింది’.

‘కెప్టెన్ రోహిత్ 31 బంతుల్లో 27 పరుగులు చేయగా, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ 15 బంతుల్లో 9 పరుగులకు ఔటయ్యాడు. రాహుల్ 70 బంతుల్లో 73 పరుగులు చేయడంతో స్కోర్‌ అమాంతం పెరిగిపోయింది. అనూష్యంగా బంగ్లా 46 ఓవర్లలో లక్షాన్ని ఛేదించింది. ఒక ఓవర్‌కు 4 పరుగుల కంటే తక్కువ పరుగులు ఛేదిస్తే సరిపోతుందంటే కచ్చితంగా ఆటగాళ్లపై ఒత్తిడి తగ్గి, కాస్త తేలికపడేవారు. ఐతే అప్పటికే భారత్ 80-70 పరుగులు తక్కువ చేసింది. 250 పరుగులు చేసి ఉంటే ఆట వేరేలా ఉండేది’ అని సునీల్‌ గవాస్కర్‌ విశ్లిషించారు. కాగా రేపు (బుధవారం) జరగనున్న రెండో వన్డేలో బంగ్లాతో భారత్‌ మరోమారు తలపడనున్న విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా క్రికెట్‌ అప్‌డేట్ల కోసం క్లిక్‌ చేయండి.