Bank Jobs 2022: బ్యాంక్‌ జాబ్స్ కోసం ఎదురుచూస్తున్నారా? బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్రలో భారీగా ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. లక్షకుపైగా..

పూణెలోని బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర .. 551 ఏజీఎమ్, చీఫ్‌ మేనేజర్‌, జనరలిస్టిక్‌ ఆఫీసర్‌ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు..

Bank Jobs 2022: బ్యాంక్‌ జాబ్స్ కోసం ఎదురుచూస్తున్నారా? బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్రలో భారీగా ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. లక్షకుపైగా..
Bank Of Maharashtra
Follow us
Srilakshmi C

|

Updated on: Dec 06, 2022 | 5:05 PM

పూణెలోని బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర .. 551 ఏజీఎమ్, చీఫ్‌ మేనేజర్‌, జనరలిస్టిక్‌ ఆఫీసర్‌ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో డిగ్రీ/పోస్టు గ్రాడ్యుయేషన్‌/సీఏ/సీఎమ్ఏ/సీఎఫ్ఏ/ఎంబీఏ/పీజీడీబీఏ/పీజీడీబీఎమ్‌/పీజీపీఎమ్‌/పీజీడీఎమ్‌/బీఈ/బీటెక్‌/ఐటీ/ఎమ్‌సీఏ/ఎమ్సీఎస్/ఎమ్మెస్సీ/ఎమ్‌ఏ/ఎంఫిల్‌/పీహెచ్‌డీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. అభ్యర్ధుల వయసు 32 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.

ఆసక్తి కలిగినవారు ఆన్‌లైన్‌ విధానంలో డిసెంబర్‌ 23, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో జనరల్/ఈడబ్ల్యూఎస్‌/ఓబీసీ అభ్యర్ధులు రూ.1180లు, ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ అభ్యర్ధులు రూ.118లు రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. రాత పరీక్ష, అనుభవం ఆధారంగా ఎంపిక చేస్తారు. ప్రతిభకనబరచిన వారికి నెలకు రూ.48,170ల నుంచి రూ.1,00,350ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు..

  • ఏజీఎమ్ బోర్డు కార్యదర్శి కార్పొరేట్ గవర్నెన్స్ పోస్టులు: 1
  • ఏజీఎమ్ – డిజిటల్ బ్యాంకింగ్ పోస్టులు: 1
  • ఏజీఎమ్- నిర్వహణ సమాచార వ్యవస్థ (MIS) పోస్టులు: 1
  • చీఫ్ మేనేజర్ – MIS పోస్టులు: 1
  • చీఫ్ మేనేజర్ – మార్కెట్ ఎకనామిక్ అనలిస్ట్ పోస్టులు: 1
  • చీఫ్ మేనేజర్ – డిజిటల్ బ్యాంకింగ్ పోస్టులు: 2
  • చీఫ్ మేనేజర్ – ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఆడిట్ పోస్టులు: 1
  • చీఫ్ మేనేజర్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్ పోస్టులు: 1
  • చీఫ్ మేనేజర్ – క్రెడిట్ పోస్టులు: 15
  • చీఫ్ మేనేజర్ – డిజాస్టర్ మేనేజ్‌మెంట్ పోస్టులు: 1
  • చీఫ్ మేనేజర్ – పబ్లిక్ రిలేషన్ & కార్పొరేట్ కమ్యూనికేషన్ పోస్టులు: 1
  • జనరలిస్ట్ ఆఫీసర్ MMGS స్కేల్ – II పోస్టులు: 400
  • జనరలిస్ట్ ఆఫీసర్ MMGS స్కేల్ – III పోస్టులు: 100
  • ఫారెక్స్ / ట్రెజరీ ఆఫీసర్ పోస్టులు: 25

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.