AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Law Course: శ్రీకృష్ణదేవరాయ వర్సిటీలో లా కోర్సుకు మంగళం! ‘అవినీతిపై ప్రశ్నించడమే తప్పా?’

అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో 2022-23 విద్యాసంవత్సరం నుంచి లా అడ్మిషన్లను నిలిపివేసేందుకు భారీ కుట్ర జరుగుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే వర్సిటీ రిజిస్ట్రార్‌ లక్ష్మయ్య..

Law Course: శ్రీకృష్ణదేవరాయ వర్సిటీలో లా కోర్సుకు మంగళం! 'అవినీతిపై ప్రశ్నించడమే తప్పా?'
Srikrishna Devaraya University
Srilakshmi C
|

Updated on: Dec 06, 2022 | 3:55 PM

Share

అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో 2022-23 విద్యాసంవత్సరం నుంచి లా అడ్మిషన్లను నిలిపివేసేందుకు భారీ కుట్ర జరుగుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే వర్సిటీ రిజిస్ట్రార్‌ లక్ష్మయ్య ఉన్నత విద్యామండలికి వర్సిటీ లేఖ రాశారు. డిసెంబర్ మొదటి వారంలో నిర్వహించనున్న లాసెట్‌ కౌన్సెలింగ్‌లో తమ యూనివర్సిటీ పేరును మినహాయించాలని కోరారు. లా కోర్సుల్లో బోధనకు తగినంత మంది ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లులేరని.. ఎల్‌ఎల్‌బీ కోర్సు నిర్వహించలేమని, ప్రవేశాలు వెంటనే నిలిపివేయాలని డిసెంబ‌రు 1న ఉన్నత విద్యామండలికి పంపిన లేఖలో ఆయన పేర్కొన్నారు. మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సు నిర్వహణ సాధ్యంకానందున, రెండేళ్ల ఎల్ఎల్ఎమ్‌ (మాస్టర్‌ ఆఫ్‌ లా కోర్సు) కోర్సును మాత్రమే కొనసాగిస్తామని, ప్రస్తుతం ఉన్న ఇద్దరు ఫ్యాకల్టీలో ఒకరు మెడికల్ లీవ్‌లో ఉన్నారని, అందువల్లనే మూడేళ్ల లా కోర్సులు నిర్వహించలేమని ఆ లేఖలో వివరించారు.

ఇది కక్ష్య సాధింపు చర్య: వర్సిటీ విద్యార్ధులు

ఐతే యూనివర్సిటీ విద్యార్ధుల వాదన మరోలా ఉంది. ఈ యూనివర్సిటీలో అవినీతి, అక్రమాలు భారీ మొత్తంలో చోటుచేసుకుంటున్నాయని, వీటిపై లా స్టూడెంట్స్‌ ప్రశ్నించడంతో కక్ష్య సాధింపు కింద కోర్సును రద్దు చేస్తున్నారని విద్యార్ధులు ఆరోపిస్తున్నారు. ప్రశ్నించే గొంతుకలను నొక్కి పెట్టడానికే వర్సిటీ అధికారులు ప్రయత్నిస్తున్నారని అన్నారు. పైగా ‘లా’ విభాగంలో ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్‌తోపాటు, 8 తాత్కాలిక ఫ్యాకల్టీ కూడా ఉన్నారని, ఇంతమంది ఉన్నా కోర్సు నిర్వహించలేమని చెప్పడం విడ్డూరంగా ఉందని అంటున్నారు.

నిజంగా ఫ్యాకల్టీ కొరత ఉన్న కోర్సులను మూసివేయవల్సి వస్తే ఇతర డిపార్ట్‌మెంట్లలో ఎన్నో కోర్సులు మూసివేయాల్సి ఉంటుందని, యూనివర్సిటీలో లా కోర్సు ప్రవేశాలకు రూ. 5,000 ఫీజు చెల్లిస్తే సరిపోతుంది. వర్సిటీలో ప్రవేశాలు నిలిపివేస్తే, బయట ఈ కోర్సు చదవడానికి రూ.25 వేలకు పైగా ఫీజు చెల్లించవల్సి ఉంటుందని, తక్షణమే యూనివర్సిటీ అధికారులపై చర్యలు తీసుకోవల్సిందిగా న్యాయశాస్త్ర విద్యార్ధులు డిమాండ్‌ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.