Telangana: ఇంటర్‌ సెకండియర్‌ విద్యార్ధులకు ఫ్రీ ఎంసెట్‌ కోచింగ్‌

తెలంగాణ రాష్ట్రంలోని 2022-23 విద్యాసంవత్సరానికిగానూ ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో విద్యార్ధులకు ఎంసెట్‌ ఉచిత కోచింగ్ ఇవ్వడానికి ఇంటర్మీడియట్‌ ఎడ్యుకేషన్‌ కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌ ప్రకటన విడుదల..

Telangana: ఇంటర్‌ సెకండియర్‌ విద్యార్ధులకు ఫ్రీ ఎంసెట్‌ కోచింగ్‌
Free Eamcet Coaching For Intermediate Second Year Students
Follow us
Srilakshmi C

|

Updated on: Dec 05, 2022 | 9:57 PM

తెలంగాణ రాష్ట్రంలోని 2022-23 విద్యాసంవత్సరానికిగానూ ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో విద్యార్ధులకు ఎంసెట్‌ ఉచిత కోచింగ్ ఇవ్వడానికి ఇంటర్మీడియట్‌ ఎడ్యుకేషన్‌ కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌ ప్రకటన విడుదల చేశారు. ఇంటర్మీడియట్‌ సెకండియర్‌ చదువుతున్న ఎంపీసీ, బైపీసీ విద్యార్ధులకు 2023 వేసవి సెలవుల్లో ఎంసెట్‌ ఉచిత కోచింగ్ క్లాసులు నిర్వహించనున్నట్లు తెలిపారు.

మార్చిలో వార్షిక పరీక్షలు పూర్తవ్వగానే.. వేసవి సెలవులు ఏప్రిల్‌, మే నెలల్లో ఉండవచ్చు. వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలలో విద్యార్ధులకు స్క్రీనింగ్‌ టెస్ట్ నిర్వహిస్తారు. దీనిలో ప్రతిభకనబరచిన మెరిట్‌ విద్యార్ధులను జిల్లాకు అబ్బాయిలు 50, అమ్మాయిలు 50 మంది చొప్పున ఎంపిక చేస్తారు. వీరికి ఏప్రిల్‌ – మే నెలల్లో మోడల్‌ స్కూళ్లు, గురుకుల పాఠశాలల్లో ఫ్రీగా క్లాసులు బోధిస్తారు. ఈ మేరకు అన్ని జిల్లాల ఇంటర్మీడియట్‌ ఎడ్యుకేషన్‌ ఆఫీసర్స్, నోడల్‌ ఆఫీసర్స్, ప్రిన్సిపల్‌లకు సూచనలు జారీ చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.