‘ఆ క్యాచ్‌ ఎందుకు వదిలేశాడో నాకైతే అర్ధం కావడం లేదు’ దినేష్ కార్తీక్

బంగ్లాదేశ్‌ తొలి వన్డేలో ఒకే ఒక్క వికెట్ తేడాతో టీం ఇండియా పరాజయంపాలైన సంగతి తెలిసిందే. భారత జట్టు ఆటతీరుపై తాజాగా సీనియర్ క్రికెటర్‌ దినేష్ కార్తీక్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు..

'ఆ క్యాచ్‌ ఎందుకు వదిలేశాడో నాకైతే అర్ధం కావడం లేదు' దినేష్ కార్తీక్
కార్తీక్, దీపిక రెండు విధాలుగా వివాహం చేసుకున్నారు. మొదట హిందూ ఆచారంలో, రెండోసారి క్రైస్తవ ఆచారంలో చేసుకున్నారు. మొదట్లో కార్తీక్ ఆట కారణంగా దీపికకు అంతగా నచ్చలేదు.
Follow us

|

Updated on: Dec 05, 2022 | 8:00 PM

బంగ్లాదేశ్‌ తొలి వన్డేలో ఒకే ఒక్క వికెట్ తేడాతో టీం ఇండియా పరాజయంపాలైన సంగతి తెలిసిందే. భారత జట్టు ఆటతీరుపై తాజాగా సీనియర్ క్రికెటర్‌ దినేష్ కార్తీక్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు.

‘టీం ఇండియా చెత్త ఫీల్డింగ్‌ వెనుక అసలు కారణం ఏమైవుంటుందో అర్థంకావడంలేదు. సహజంగానే వికెట్‌ కీపర్‌ కెఎల్ రాహుల్ డ్రాప్ అయ్యాడు. సుందర్‌కు క్యాచ్‌ పట్టేందుకు అవకాశం వచ్చినా కనీసం ప్రయత్నించలేదు. లైట్ల కారణంగా అని నేననుకోవడం లేదు. అతను ఒకవేళ బాల్‌ను చూసి ఉంటే, ఖచ్చితంగా క్యాచ్‌పట్టేందుకు వెళ్లాలి. దానికి సమాధానం కేవలం సుందర్‌ మాత్రమే చెప్పాలి. మొత్తానికి ఫీల్డింగ్‌ పరంగా మెప్పించలేకపోయారు. మొత్తం ఫీల్డింగ్ 50-50గా ఉంది. ఇదేం అత్యుత్తమ ఆట కాదు. అలా అని చెత్త ఆట కూడా కాదు. ఒత్తిడి కారణంగా ఇలా జరిగి ఉండవచ్చు’ అని కార్తీక్‌ అన్నాడు.

ఈ మ్యాచ్‌లో కేఎల్‌ రాహుల్‌ క్యాచ్‌ను వదిలివేయడంతో ఎప్పుడూ కూల్‌గా ఉండే కెప్టెన్ రోహిత్ శర్మకు కూడా పట్టరాని కోపం వచ్చింది. ఏకంగా రెండు క్యాచింగ్‌ అవకాశాలను చేజార్చడంతో మైదానంలో రోహిత్ శర్మ తిట్లవర్షం కురిపించాడు. మ్యాచ్‌ అనంతరం కేఎల్ రాహుల్ మీడియాతో మాట్లాడుతూ..’క్రికెట్‌లో ఒక్కోసారి ఊహించని సంఘటనలు ఇలానే జరుగుతుంటాయి. క్రికెట్ ఆడినంత కాలం ఇలాంటివి సహజం. చివరి వరకు జట్టు చాలా బాగా పోరాడింది. మెహిదీ నుంచి రెండు క్యాచ్‌లు కోల్పోవడంతో ఓడిపోవల్సి వచ్చింది’ అని అన్నాడు. కాగా బుధవారం జరిగే 2వ వన్డేలో బంగ్లాదేశ్‌తో భారత జట్టు మరోమారు తలపడనున్న విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని  తాజా క్రికెట్ అప్ డేట్ల కోసం క్లిక్ చేయండి.