- Telugu News Photo Gallery Viral photos High Cholesterol Symptoms: What Is High Cholesterol? What to Know?
High cholesterol Symptoms: ఈ లక్షణాలు కన్పిస్తే మీ శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగినట్లే..
ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్ చాలా అవసరం. కణజాలాల నిర్మించడంలో కొలెస్ట్రాల్ కీలకపాత్ర పోషిస్తుంది. ఒక్కోసారి పరిమిత స్థాయికిమించి కొలెస్ట్రాల్ పెరిగితే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఐతే శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగిందో? లేదో? ఎలా తెలుస్తుందని సందేహిస్తున్నారా.. ఈ లక్షణాలు కన్పిస్తే..
Updated on: Dec 05, 2022 | 6:39 PM

ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్ చాలా అవసరం. కణజాలాల నిర్మించడంలో కొలెస్ట్రాల్ కీలకపాత్ర పోషిస్తుంది. ఒక్కోసారి పరిమిత స్థాయికిమించి కొలెస్ట్రాల్ పెరిగితే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఐతే శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగిందో? లేదో? ఎలా తెలుస్తుందని సందేహిస్తున్నారా.. ఈ లక్షణాలు కన్పిస్తే కొలెస్ట్రాల్ పెరిగినట్లే..

తరచుగా ఛాతీలో నొప్పి వస్తుంటే.. నిర్లక్ష్యం చేయకండి. వెంటనే డాక్టర్‌ను సంప్రదించడం అస్సలు మర్చిపోకూడదు. గ్యాస్ వల్ల వచ్చిందో.. మరేదైనా కారణంతో వచ్చిందో టెస్టుల ద్వారా నిర్ధారించుకోవాలి.

మరో సంకేతం హార్ట్ ఎటాక్. హార్ట్ ఎటాక్ సంభవించినప్పుడు సకాలంలో చికిత్స అందిస్తే.. ప్రమాదం నుంచి బయటపడవచ్చు. ఎవరికైనా గుండెపోటు వచ్చినా, వచ్చే అవకాశం ఉందని వైద్యులు స్పష్టం చేసినా.. ఆ వ్యక్తి శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి పెరిగినట్లు భావించాలి.

శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి బీపీ పెరిగే అవకాశం ఎక్కువ. ఒక్కోసారి స్ట్రోక్ కూడా సంభవించవ్చు.

కిడ్నీ సమస్యలతో బాధపడేవారి శరీరంలో కొలెస్ట్రాల్ అధికమోతాదులో ఉంటుంది.




