Naval Dockyard: పదో తరగతి అర్హతతో విశాఖపట్నం నావెల్ డాక్‌యార్డ్‌లో 275 ఖాళీలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..
కేంద్ర ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన విశాఖపట్నంలోని నావెల్ డాక్‌యార్డ్ అప్రెంటిసెస్ స్కూల్ 2023-24 ట్రైనింగ్ బ్యాచ్‌కు సంబంధించి.. 275 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు..
కేంద్ర ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన విశాఖపట్నంలోని నావెల్ డాక్‌యార్డ్ అప్రెంటిసెస్ స్కూల్ 2023-24 ట్రైనింగ్ బ్యాచ్‌కు సంబంధించి.. 275 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఫిట్టర్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్, మెషినిస్ట్, పెయింటర్, వెల్డర్, కార్పెంటర్ , పైప్ ఫిట్టర్ తదితర ట్రేడుల్లో ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా పూరించనున్నారు. ఆసక్తి కలిగిన వారు 50 శాతం మార్కులతో పదో తరగతితోపాటు సంబంధిత ట్రేడుల్లో 65 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దరఖాస్తుదారులు తప్పనిసరిగా మే 2, 2009వ తేదీకి ముందు జన్మించి ఉండాలి.
ఆసక్తి కలిగినవారు జనవరి 2, 2023వ తేదిలోపు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. అనంతరం హార్డుకాపీని డౌన్‌లోడ్ చేసుకుని కింది అడ్రస్కు జనవరి 9వ తేదీలోపు పంపించవల్సి ఉంటుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్స్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైనవారిలో టీచింగ్ అసోసియేట్ పోస్టులకు పీహెచ్‌డీ ఉన్నవారికి నెలకు రూ.45,000లు, పీహెచ్‌డీ లేని వారికి రూ.40,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు..
- రాత పరీక్ష తేదీ: ఫిబ్రవరి 28, 2023.
- రాత పరీక్ష ఫలితాల ప్రకటన తేదీ: మార్చి 3, 2023.
- ఇంటర్వ్యూ తేదీలు: మార్చి 6, 7, 9, 10 తేదీల్లో నిర్వహిస్తారు.
- మెడికల్ టెస్ట్స్ తేదీలు: మార్చి 16 నుంచి 28 తేదీల్లో నిర్వహిస్తారు.
- ట్రైనింగ్ ప్రారంభం: మే 2, 2023.
అడ్రస్..
The Officer-in-Charge (for Apprenticeship), Naval Dockyard Apprentices School, VM Naval Base S.O., P.O., Visakhapatnam – 530 014, Andhra Pradesh.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.