AP Police selection process 2022: ఆంధ్రప్రదేశ్‌ పోలీసు ఉద్యోగాలకు ఎన్ని దశల్లో ఎంపిక చేస్తారంటే..

ఆంధ్రప్రదేశ్‌లో 6100 పోలీసు కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఈనెల 28వ తేదీలోపు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ముగుస్తుంది. ఆ తర్వాత సెలక్షన్ ప్రక్రియ కూడా వెనువెంటనే జరిగిపోతుంది. ఈ సందర్భంగా స్టేట్‌ లెవల్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు అవలంభించే ఎంపిక ప్రక్రియ ఏవిధంగా..

AP Police selection process 2022: ఆంధ్రప్రదేశ్‌ పోలీసు ఉద్యోగాలకు ఎన్ని దశల్లో ఎంపిక చేస్తారంటే..
APSLPRB Constable Selection Process
Follow us
Srilakshmi C

|

Updated on: Dec 05, 2022 | 3:48 PM

ఆంధ్రప్రదేశ్‌లో 6100 పోలీసు కానిస్టేబుల్‌ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఈనెల 28వ తేదీలోపు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ముగుస్తుంది. ఆ తర్వాత సెలక్షన్ ప్రక్రియ కూడా వెనువెంటనే జరిగిపోతుంది. ఈ సందర్భంగా స్టేట్‌ లెవల్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు అవలంభించే ఎంపిక ప్రక్రియ ఏవిధంగా ఉంటుంది? ఎన్ని దశల్లో పూర్తవుతుంది? రాత పరీక్ష విధానం వంటి విషయాలపై అభ్యర్ధులకు అవగాహన అవసరం. దరఖాస్తుదారులు ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి..

నియామక ప్రక్రియ మొత్తం 4 దశల్లో ఉంటుంది.

స్టేట్‌-1 (ప్రిలిమినరీ పరీక్ష)

మొదటి దశలో ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహిస్తారు. సివిల్‌, ఏపీఎస్పీ కానిస్టేబుల్‌ ఉద్యోగాలకైతే.. మొత్తం 200 మార్కులకు 200 ఆబ్జెక్టివ్‌ టైప్‌ ప్రశ్నలు ఉంటాయి. తెలుగు, ఆంగ్లం, ఉర్దూ భాషల్లో మాత్రమే క్వశ్చన్‌పేపర్‌ ఉంటుంది.

సివిల్‌, ఏపీఎస్పీ ఆర్‌ఎస్సై ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారికి 2 పేపర్లకు ప్రిలిమినరీ పరీక్ష ఆబ్జెక్టివ్‌ టైప్‌లో ఉంటుంది. ఒక్కో పేపర్‌100 మార్కుల చొప్పున మొత్తం 200 మార్కులకు ఉంటుంది. క్వశ్చన్‌పేపర్‌ తెలుగు, ఆంగ్లం, ఉర్దూ భాషల్లో ఉంటుంది. ప్రిలిమినరీ పరీక్షలో కటాఫ్‌ మార్కులు సాధించిన వారు తదుపరి దశలో శారీరక కొలతలు (పీఎంటీ), దేహ దారుఢ్య పరీక్షలకు (పీఈటీ) ఎంపిక చేస్తారు.

ఇవి కూడా చదవండి

స్టేట్‌-2 (శారీరక కొలతలు)

ఎస్సై, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నవారు పురుషులైతే 167.6 సెంటిమీటర్లు, మహిళలు 152.5 సెంటిమీటర్ల కంటే తక్కువ ఎత్తు ఉండకూడదు. పురుషుల ఛాతీ కొలత 86.3 సెంటిమీటర్లు ఆపైన ఉండాలి. ఇక మహిళల బరువు 40 కిలోలకుపైగా ఉండాలి.

స్టేజ్‌-3 (పీఈటీ)

  • సివిల్‌ ఎస్సై, సివిల్‌ కానిస్టేబుల్‌ పోస్టులకు పురుషులు 8 నిమిషాల్లో, మహిళలైతే 10 నిమిషాల 30 సెకన్లలో 1,600 మీటర్ల పరుగు పూర్తి చేయాలి. ఆ తర్వాత 100 మీటర్ల పరుగు, లాంగ్‌జంప్‌ విభాగాల్లో ఏదో ఒక దాంట్లో అర్హత సాధిస్తే సరిపోతుంది. ఇవి కేవలం అర్హత పరీక్ష మాత్రమే. ఈ మార్కులను తుది ఎంపికలో పరిగణనలోకి తీసుకోరు.
  • ఏపీఎస్పీ ఆర్‌ఎస్సై, ఏపీఎస్పీ కానిస్టేబుల్‌ పోస్టులకు పురుషులు 1,600 మీటర్ల పరుగు, 100 మీటర్ల పరుగు, లాంగ్‌జంప్‌లో అర్హత సాధించాలి. ఈ పరీక్ష మొత్తం100 మార్కులకు ఉంటుంది. నిర్దేశించిన సమయం కంటే ఎంత ముందు గమ్యాన్ని చేరుకుంటే అన్ని ఎక్కువ మార్కులు లభిస్తాయి. ఈ మార్కులను తుది ఎంపికలో పరిగణనలోకి తీసుకుంటారు.

స్టేజ్‌-4 (మెయిన్‌ రాత పరీక్ష)

  • సివిల్‌ ఎస్సై ఉద్యోగాలకు పోటీపడేవారికి..మొత్తం 600 మార్కులకు 4 పేపర్లుంటాయి.
  • ఏపీఎస్పీ ఆర్‌ఎస్సై ఉద్యోగాలకు పోటీపడేవారికి.. మొత్తం 4 పేపర్లకు పరీక్ష ఉంటుంది. మొదటి రెండు పేపర్లలో అర్హతసాధిస్తే చాలు. తర్వాత రెండు పేపర్లు ఒక్కొక్కటి 100 మార్కుల చొప్పున మొత్తం 200 మార్కులకు నిర్వహిస్తారు. ఈ రెండు పేపర్లలో వచ్చిన మార్కులను, 100 మార్కులకు నిర్వహించిన దేహ దారుఢ్య పరీక్షల్లో సాధించిన మార్కులకు కలుపుతారు. అంటే మొత్తం 300 మార్కుల్లో సాధించిన మెరిట్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
  • సివిల్‌ కానిస్టేబుల్‌ పోస్టులకు పోటీపడే వారికి.. 200 ప్రశ్నలు 200 మార్కులకు ఉంటాయి.
  • ఏపీఎస్పీ కానిస్టేబుల్‌ పోస్టులకు పోటీపడే వారికి.. 200 ప్రశ్నలు 100 మార్కులకు ఉంటాయి.100 మార్కులకు నిర్వహించిన దేహ దారుఢ్య పరీక్షల్లో సాధించిన మార్కులకు కలుపుతారు. అంటే మొత్తం 200ల మార్కుల్లో సాధించిన మెరిట్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

హైదరాబాద్‌లో కారు బీభత్సం.. డ్రైవర్ని చితకబాదిన స్థానికులు.
హైదరాబాద్‌లో కారు బీభత్సం.. డ్రైవర్ని చితకబాదిన స్థానికులు.
దైవ దర్శనానికి వెళ్లి ప్రదక్షిణలు చేస్తున్న యువకుడు. అంతలోనే షాక్
దైవ దర్శనానికి వెళ్లి ప్రదక్షిణలు చేస్తున్న యువకుడు. అంతలోనే షాక్
కూలిన మర్రి చెట్టు కింద శివలింగం ప్రత్యక్షం.. పోటెత్తిన జనం.!
కూలిన మర్రి చెట్టు కింద శివలింగం ప్రత్యక్షం.. పోటెత్తిన జనం.!
గోండ్ కటిరా, పెరుగు కలిపి తింటే ఏమవుతుందో తెలుసా.?
గోండ్ కటిరా, పెరుగు కలిపి తింటే ఏమవుతుందో తెలుసా.?
అమెరికా వెళ్లాలనుకునేవారికి షాకింగ్‌ న్యూస్‌.! ఇండియన్స్ కి మరింత
అమెరికా వెళ్లాలనుకునేవారికి షాకింగ్‌ న్యూస్‌.! ఇండియన్స్ కి మరింత
బ్రష్ పై టూత్ పేస్ట్ ను ఎక్కువుగా పెడుతున్నారా.? అయితే ఇది మీకోసం
బ్రష్ పై టూత్ పేస్ట్ ను ఎక్కువుగా పెడుతున్నారా.? అయితే ఇది మీకోసం
అల్లు అర్జున్ నార్త్‌ ఫ్యాన్స్‌కు ఇక పండగే.! గ్రాండ్‌గా ట్రైలర్..
అల్లు అర్జున్ నార్త్‌ ఫ్యాన్స్‌కు ఇక పండగే.! గ్రాండ్‌గా ట్రైలర్..
కూలి పని చేసుకుంటున్న స్టార్ హీరో కొడుకు.! వీడియో వైరల్..
కూలి పని చేసుకుంటున్న స్టార్ హీరో కొడుకు.! వీడియో వైరల్..
రాంగోపాల్ వర్మకు బిగుస్తున్న ఉచ్చు.. పోలీసుల చేతిలో వర్మ.!
రాంగోపాల్ వర్మకు బిగుస్తున్న ఉచ్చు.. పోలీసుల చేతిలో వర్మ.!
ఉత్తరాంధ్ర యాసలో అభిమానిని ఆటపట్టించిన మెగాస్టార్.! వీడియో వైరల్.
ఉత్తరాంధ్ర యాసలో అభిమానిని ఆటపట్టించిన మెగాస్టార్.! వీడియో వైరల్.