AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ind vs Ban 1st ODI: బార్బర్ కుటుంబంలో పుట్టి అంతర్జాతీయ క్రికెటర్‌గా ఎదిగిన యంగ్ పేసర్ కుల్దీప్‌ సేన్‌ కన్నీటి ప్రయాణం

క్రికెట్‌ చరిత్రలో భారత్‌కు ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. ఎటువంటి బ్యాక్‌గ్రౌడ్‌ లేకపోయినా.. నిరుపేద కుటంబాల నుంచి వచ్చిన ఎందరో ఆటగాళ్లు చెదరని ముద్ర వేశారు. తాజాగా అటువంటి మరో ఆటగాడిని..

Ind vs Ban 1st ODI: బార్బర్ కుటుంబంలో పుట్టి అంతర్జాతీయ క్రికెటర్‌గా ఎదిగిన యంగ్ పేసర్ కుల్దీప్‌ సేన్‌ కన్నీటి ప్రయాణం
Son of a barber makes ODI debut for India
Srilakshmi C
|

Updated on: Dec 04, 2022 | 7:53 PM

Share

క్రికెట్‌ చరిత్రలో భారత్‌కు ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. ఎటువంటి బ్యాక్‌గ్రౌడ్‌ లేకపోయినా.. నిరుపేద కుటంబాల నుంచి వచ్చిన ఎందరో ఆటగాళ్లు చెదరని ముద్ర వేశారు. తాజాగా అటువంటి మరో ఆటగాడిని భారత క్రికెట్‌ పరిచయం చేస్తోంది. బార్బర్‌ కుటుంబంలో పుట్టి ఓడీఐలో తొలిసారి ఆడేందుకు స్థానం పొందిన 26 ఏళ్ల యువ పేసర్‌ కుల్దీప్‌ సేన్‌ గురించే మనం చర్చిస్తోంది. ఈ మధ్యప్రదేశ్‌ క్రికెటర్‌ ఢాకా వేదికగా ఆదివారం బంగ్లాదేశ్‌తో తొలి వన్డేకు ఆడేందుకు టీమిండియాలో స్థానం పొందాడు. అంతర్జాతీయ క్రికెటర్‌గా ఎదిగిన కుల్దీప్‌ సేన్‌ మధ్యప్రదేశ్‌లో రెవా జిల్లాలోని హరిహర్‌పూర్‌ అనే చిన్న గ్రామంలోని బార్బర్‌ కుటంబంలో జన్మించాడు.

కుల్దీప్‌ తండ్రి రాంపాల్‌ సేన్‌ చిన్న హెయిర్‌ సెలూన్‌ నడుపుతూ కుటుంబాన్ని పోషించేవాడు. రాంపాల్‌ ఐదుగురు సంతానంలో కుల్దీప్‌ మూడోవాడు. కుల్దీప్‌కు చిన్నతనం నుంచే క్రికెట్‌ అంటే మక్కువ ఎక్కువ. మూడు పూటల తిండి పెట్టడమే గగనమైన తండ్రి రాంపాల్‌ కటిక పేదరికం కారణంగా కొడుకుకు క్రికెట్‌ ఆడేందుకు కావల్సిన సరంజామా కొనలేని దీన స్థితిలో ఉండేవాడు. క్రికెట్‌పై కుల్దీప్‌కు ఉన్న ఇష్టాన్ని గమనించిన ఆంథోనీ అనే కోచ్‌ అతడికి అండగా నిలిచాడు. క్రికెట్‌ కిట్స్‌తో పాటు మంచి భోజనం పెట్టి భారత్‌కు యంగ్‌ ఫాస్ట్‌ బౌలర్‌ను ఇవ్వడంలో కీలక పాత్ర పోషించాడు.

ఇవి కూడా చదవండి

ఆ తర్వాత వింధ్య క్రికెట్ అకాడమీ క్లబ్‌ ఎటువంటి ఫీజు తీసుకోకుండా కుల్దీప్‌తో క్రికెట్‌ ఆడించేవారు. 2018లో మధ్యప్రదేశ్‌ తరపున రంజీట్రోఫీలో ఆడి కుల్దీప్‌ క్రికెట్‌ ఆరంగెట్రం చేశాడు. 8 మ్యాచుల్లో 25 వికెట్లు పడగొట్టాడు. ఇక ఐపీఎల్‌లో ఆడేందుకు కుల్దీప్‌కు నాలుగేళ్లు పట్టింది. 2022లో రాజస్థాన్ రాయల్స్ 20 లక్షల రూపాలకు కొనుగోలు చేసింది. ఇప్పటి వరకు దాదాపు 7 మ్యాచుల్లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఐపీఎల్‌ ఆడి, 8 వికెట్లు సాధించాడు. ఇవేకాకుండా 13 లిస్ట్ఎ మ్యాచుల్లో 25 వికెట్లు, 30 టీ20 మ్యాచుల్లో 22 వికెట్లు కుల్దీప్ ఖాతాలో ఉన్నాయి. కష్టపడి ఈ స్థాయికి చేరుకున్న కుల్దీప్‌ను ట్విటర్ వేదికగా అభిమానులు అభినందనలు తెల్పుతున్నారు.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.