IND vs BAN: షకీబ్‌పై ప్రతీకారం తీర్చుకున్న కింగ్ కోహ్లీ.. గాల్లోకి ఎగురుతూ ఒంటిచేత్తో క్యాచ్ పట్టి..
మిర్పూర్ వేదికగా బంగ్లాదేశ్‌తో భారత జట్టు తొలి వన్డే ఆడుతోంది. ఈ మ్యాచ్‌లో, కోహ్లి బ్యాట్ పెద్దగా మెరవలేదు. కేవలం 15 బంతుల్లో 9 పరుగులు చేసి షకిబ్ అల్ హసన్ బౌలింగ్‌లో లిటన్ దాస్ పట్టిన అద్భుతమైన క్యాచ్‌కు వెనుదిరిగాడు.
టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ తన అద్భుతమైన బ్యాటింగ్‌తో యావత్ ప్రపంచాన్ని మెప్పించాడు. మధ్యలో కొన్ని గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నా ఇప్పటికీ వరల్డ్‌లోనే అత్యుత్తమ బ్యాటర్‌గా విరాట్‌ను పరిగణిస్తారు. కాగా అతను ఇప్పుడు బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్నాడు. మిర్పూర్ వేదికగా బంగ్లాదేశ్‌తో భారత జట్టు తొలి వన్డే ఆడుతోంది. ఈ మ్యాచ్‌లో, కోహ్లి బ్యాట్ పెద్దగా మెరవలేదు. కేవలం 15 బంతుల్లో 9 పరుగులు చేసి షకిబ్ అల్ హసన్ బౌలింగ్‌లో లిటన్ దాస్ పట్టిన అద్భుతమైన క్యాచ్‌కు వెనుదిరిగాడు. అయితే బ్యాటింగ్‌లో విఫలమైనప్పటికీ తన ఫీల్డింగ్‌తో అద్భుతం చేశాడు విరాట్. బౌలింగ్‌లో ఐదు వికెట్లు తీయడంతో పాటు 29 పరుగులు చేసిన బంగ్లా ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్‌ను సూపర్బ్ క్యాచ్‌తో పెవిలియన్ దారి పట్టించాడు. కాగా ఆఫ్ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ 24వ ఓవర్ మూడో బంతికి షకీబ్ ఔటయ్యాడు. సుందర్ ఆఫ్ స్టంప్ మీద షార్ట్ బాల్ వేయగా షకీబ్ దానిని కవర్ మీద కొట్టడానికి ప్రయత్నించాడు. అయితే బంతిని సరిగ్గా కనెక్ట్ చేయలేకపోయాడు. దీంతో బంతి ఎక్స్‌ట్రా కవర్స్ దిశగా వెళ్లింది. అదే సమయంలో అక్కడున్న కోహ్లి తన కుడివైపుకి డైవ్ చేసి గాలిలో దూకి ఒంటిచేత్తో క్యాచ్ పట్టాడు. ఈ క్యాచ్ చూసి షకీబ్ కూడా ఆశ్చర్యపోయాడు. కొద్దిసేపు మైదానంలోనే బేల చూపులు చూస్తూ ఉండిపోయాడు.
కాగా బంగ్లా ఆల్‌రౌండర్ క్యాచ్ పట్టగానే కోహ్లీతో పాటు టీమిండియా ఆటగాళ్లందరూ సంబరాల్లో మునిగిపోయారు. ఈ మ్యాచ్‌లో షకీబ్ 38 బంతులు ఎదుర్కొని మూడు ఫోర్ల సాయంతో 29 పరుగులు చేశాడు. కాగా ఈ మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీశాడు షకీబ్. కోహ్లితో పాటు రోహిత్ శర్మ, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్ లను పెవిలియన్ దారి పట్టించాడు. షకీబ్ తన కోటాలో 10 ఓవర్లలో 36 పరుగులిచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు. అతడితో పాటు ఇబాదత్ హుస్సేన్ నాలుగు వికెట్లు తీశాడు. మెహెదీ హసన్ మిరాజ్ ఒక వికెట్ తీశాడు. కాగా ఈ మ్యాచ్‌లో టీమిండియా విజయం దిశగా పయనిస్తోంది. 187 పరుగల లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ కడపటి వార్తలు అందే సమయానికి 42 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. ఆజట్టు విజయానికి 48 బంతుల్లో 32 పరుగులు అవసరం కాగా చేతిలో ఒక్క వికెట్ మాత్రమే ఉంది.
What an athlete Virat Kohli is. Simply stunningpic.twitter.com/ohVb46B8pl
— Ratnadeep (@_ratna_deep) December 4, 2022
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..