AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs BAN: చిరుతలా గాల్లోకి దూకి.. బంగ్లా కెప్టెన్ కళ్లు చెదిరే క్యాచ్‌.. కింగ్ కోహ్లీ కూడా షాక్‌

కోహ్లీ షాట్ సెలెక్షన్‌ సూపర్బ్‌గా ఉంది. అందులో వంక పెట్టేందుకు ఏమీ లేదు. కానీ కవర్స్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న లిటన్‌ దాస్ అద్భుతంగా డైవ్‌ చేస్తూ ఒంటిచేత్తో క్యాచ్‌ అందుకున్నాడు.

IND vs BAN: చిరుతలా గాల్లోకి దూకి.. బంగ్లా కెప్టెన్ కళ్లు చెదిరే క్యాచ్‌.. కింగ్ కోహ్లీ కూడా షాక్‌
India Vs Bangladesh
Basha Shek
|

Updated on: Dec 04, 2022 | 3:58 PM

Share

మిర్పూర్ వేదికగా జరుగుతున్న భారత్-బంగ్లాదేశ్ మొదటి వన్డేలో బంగ్లాదేశ్ స్టాండింగ్‌ కెప్టెన్ లిటన్ దాస్ మ్యాచ్ అద్భుతమైన క్యాచ్‌తో అందరి ప్రశంసలు అందుకున్నాడు. టీమిండియా ఇన్నింగ్స్‌ 11 ఓవర్‌లో బంగ్లా ఆల్‌రౌండర్‌ షకీబ్‌ అల్‌ హసన్‌ బౌలింగ్‌లో మూడో బంతిని మన రన్‌మెషిన్‌ విరాట్‌ కోహ్లీ కవర్ డ్రైవ్‌ షాట్‌ ఆడేందుకు ప్రయత్నించాడు. కోహ్లీ షాట్ సెలెక్షన్‌ సూపర్బ్‌గా ఉంది. అందులో వంక పెట్టేందుకు ఏమీ లేదు. కానీ కవర్స్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న లిటన్‌ దాస్ అద్భుతంగా డైవ్‌ చేస్తూ ఒంటిచేత్తో క్యాచ్‌ అందుకున్నాడు. కోహ్లీ కూడా ఇది ఊహించలేకపోయాడు. లిటన్‌ దాస్‌ క్యాచ్‌కు ఒక్కసారిగా షాక్‌ తిన్నాడు. ఈ మ్యాచ్‌లో 15 బంతులు ఎదుర్కొన్న కోహ్లి కేవలం 9 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు. ఈ క్రమంలో లిటన్‌ దాస్‌ క్యాచ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

బ్యాటర్ల ప్లాఫ్ షో..

కాగా లిటన్ దాస్ పట్టిన ఈ క్యాచ్ చూసి రోహిత్ శర్మ కూడా ఆశ్చర్యపోయాడు. అలాగే బంగ్లాదేశ్‌పై అద్భుతమైన రికార్డులున్న కోహ్లీ వికెట్‌తో ఆ జట్టు ఆటగాళ్ల సంబరాలు కూడా మిన్నంటాయి. ఇక ఈ మ్యాచ్‌లో ఎప్పటిలాగే నిలకడగా బ్యాటింగ్ ప్రారంభించిన కోహ్లి.. రోహిత్‌తో కలిసి చక్కటి ఇన్నింగ్స్‌ను నిర్మించాలని సూచించాడు. కానీ షకీబ్ వీరిద్దరినీ ఒకే ఓవర్లో పెవిలియన్‌కు పంపించాడు. 11 ఓవర్‌ రెండో బంతికి కెప్టెన్ రోహిత్ బౌల్డ్ అయ్యాడు. 4వ బంతికి విరాట్ కోహ్లి అద్భుత ఫీల్డింగ్‌కు బలయ్యాడు. ఇక ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 41.1 ఓవర్లలో 186 పరుగులకే ఆలౌటైంది. భారత ​బ్యాటర్లలో కేఎల్‌ రాహుల్‌ 73 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. బంగ్లాదేశ్‌ తరఫున షకీబ్‌ తన 10 ఓవర్లలో 36 పరుగులిచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు. అతడితో పాటు ఇబాదత్ హుస్సేన్ 8.2 ఓవర్లలో 47 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..

రూ. 2 వేలతో సిప్‌ను ప్రారంభిస్తే పదేళ్లలో లక్షలాది రూపాయల రాబడి!
రూ. 2 వేలతో సిప్‌ను ప్రారంభిస్తే పదేళ్లలో లక్షలాది రూపాయల రాబడి!
ట్రాఫిక్‌ పోలీసుల కొరడా.. 8 రోజుల్లో 21,713 కేసులు!
ట్రాఫిక్‌ పోలీసుల కొరడా.. 8 రోజుల్లో 21,713 కేసులు!
మరో 2 రోజుల్లో RRB లోకో పైలట్‌ రాత పరీక్షలు.. హాల్ టికెట్ లింక్
మరో 2 రోజుల్లో RRB లోకో పైలట్‌ రాత పరీక్షలు.. హాల్ టికెట్ లింక్
మారనున్న పాన్‌కార్డు నియమాలు.. వినియోగదారులకు ఎంతో ఉపశమనం!
మారనున్న పాన్‌కార్డు నియమాలు.. వినియోగదారులకు ఎంతో ఉపశమనం!
సచిన్ ఇంట పెళ్ళి వేడుక.. ప్రముఖులకు ఆహ్వానాలు!
సచిన్ ఇంట పెళ్ళి వేడుక.. ప్రముఖులకు ఆహ్వానాలు!
టీమిండియా రికార్డులను చెరిపేస్తూ నంబర్ 1 స్థానానికి దాయాది దేశం
టీమిండియా రికార్డులను చెరిపేస్తూ నంబర్ 1 స్థానానికి దాయాది దేశం
కన్నీళ్లు మిగిల్చిన చివరి మజిలీ.. బైక్‌పై 10 కిమీ మృతదేహం తరలింపు
కన్నీళ్లు మిగిల్చిన చివరి మజిలీ.. బైక్‌పై 10 కిమీ మృతదేహం తరలింపు
పశువులకు ఈగల బెడద నుంచి ఇలా రిలీఫ్ ఇవ్వండి...
పశువులకు ఈగల బెడద నుంచి ఇలా రిలీఫ్ ఇవ్వండి...
సల్మాన్‌తో ఉన్న ఈ పాప ఇప్పుడు స్టార్ హీరోయిన్.. గుర్తు పట్టారా?
సల్మాన్‌తో ఉన్న ఈ పాప ఇప్పుడు స్టార్ హీరోయిన్.. గుర్తు పట్టారా?
రైల్వే ట్రాక్స్‌పై FM పేరుతో తెల్లటి దిమ్మెలు ఎందుకు ఉంటాయి?
రైల్వే ట్రాక్స్‌పై FM పేరుతో తెల్లటి దిమ్మెలు ఎందుకు ఉంటాయి?