Telangana: నిరుద్యోగులకు అలర్ట్‌! డిసెంబర్ మూడో వారంలో 12 వేలకుపైగా టీచర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌

తెలంగాణలో మరో భారీ నోటిఫికేషన్ విడుదలకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ఎస్సై, కానిస్టేబుల్‌ ఉద్యోగాలతోపాటు, గ్రూప్-1, గ్రూప్-4 తదితర పోస్టుల నియామక ప్రక్రియ కొనసాగుతోంది. వీటితోపాటు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి..

Telangana: నిరుద్యోగులకు అలర్ట్‌! డిసెంబర్ మూడో వారంలో 12 వేలకుపైగా టీచర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌
Telangana Gurukula Jobs
Follow us
Srilakshmi C

|

Updated on: Dec 04, 2022 | 6:31 PM

తెలంగాణలో మరో భారీ నోటిఫికేషన్ విడుదలకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ఎస్సై, కానిస్టేబుల్‌ ఉద్యోగాలతోపాటు, గ్రూప్-1, గ్రూప్-4 తదితర పోస్టుల నియామక ప్రక్రియ కొనసాగుతోంది. వీటితోపాటు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి రాష్ట్ర సర్కార్ ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. గురుకులాల్లో దాదాపు 12 వేలకు పైగా టీచర్ పోస్టులకు భారీ ఉద్యోగ ప్రకటన విడుదల చేసేందుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. వీటిల్లో ఇప్పటికే గురుకులాల్లో 9,096 ఖాళీల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులుచ్చింది. మరో 3 వేల ఖాళీల భర్తీకి సీఎం కేసీఆర్ ఆమోద ముద్ర వేశారు. ఈ పోస్టులకు ఆర్థిక శాఖ నుంచి అనుమతి రావాల్సి ఉంది. అనుమతి రాగానే నోటిఫికేషన్ వెనువెంటనే విడుదల చేయాలని తెలంగాణ రెసిడెన్షియల్‌ రిక్రూట్‌మెంట్ బోర్డు ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రంలో బీఈడీ, టీటీసీ పూర్తి చేసిన నిరుద్యోగులు అత్యధిక సంఖ్యలో ఉండటం మూలంగా టీచర్‌ ఉద్యోగాల ప్రకటనపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

కాగాఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న టీచర్ జాబ్స్ నోటిఫికేషన్ విడుదల అంశం ఓ కొలిక్కి వచ్చినట్లు సమాచారం. అంతా అనుకున్నట్లు జరిగితే డిసెంబర్‌ మూడో వారంలో నోటిఫికేషన్‌ విడుదలయ్యే అవకాశం ఉంది. గ్రూప్‌ 2, 3 నోటిఫికేషన్లు కూడా ఈ నెల్లోనే విడుదలవ్వనున్నాయి. ఇక టీచర్ల పదోన్నతులు, బదిలీల ప్రక్రియ కూడా వీలైనంత త్వరగా పూర్తిచేయనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!