Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vladimir Putin: మెట్లపై నుంచి జారిపడ్డ వ్లాదిమిర్‌ పుతిన్‌.. క్షీణించిన ఆరోగ్యం..

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ (70) ఆయన స్వగృహంలో మెట్లపై నుంచి జారి పడినట్లు పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు పేర్కొంటున్నాయి. పుతిన్ మాస్కోలోని తన అధికారిక నివాసంలో మెట్లు దిగుతుండగా..

Vladimir Putin: మెట్లపై నుంచి జారిపడ్డ వ్లాదిమిర్‌ పుతిన్‌.. క్షీణించిన ఆరోగ్యం..
Russian President Vladimir Putin
Follow us
Srilakshmi C

|

Updated on: Dec 05, 2022 | 2:36 PM

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ (70) ఆయన స్వగృహంలో మెట్లపై నుంచి జారి పడినట్లు పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు పేర్కొంటున్నాయి. పుతిన్ మాస్కోలోని తన అధికారిక నివాసంలో మెట్లు దిగుతుండగా, కాలు జారి ఐదు మెట్లకు కింద పడిపోయినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన తుంటి ఎముక విరిగిపోయినట్లు న్యూయార్క్‌ పోస్ట్‌ పేర్కొంది. తుంటి ఎముక దెబ్బతిన్న కారణంగా అతని ప్రమేయం లేకుండానే మలమూత్ర విసర్జన జరుగుతోందట. అంతేకాకుండా ఆయన చేతులు పర్పుల్‌ రంగులోకి మారిపోయాయని, తీవ్ర అనారోగ్యంలో ఉన్నట్లు న్యూయార్క్‌ పోస్ట్‌ తెల్పింది. ప్రస్తుతం ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తన కథనంలో తెలిపింది. కాగా క్యూబా అధ్యక్షుడు మిగుయేల్‌ డియాజ్‌తో ద్వైపాక్షిక భేటీ సందర్భంగా వారిద్దరూ కరచాలనం చేసుకుంటున్న సందర్భంలో తీసిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

ఈ ఫొటోలో పుతిన్‌ చేతులు పర్పుల్‌ రంగులో ఉండటంతో ఆయన ఆరోగ్యం ప్రమాదకరంగానే ఉన్నట్లు నిర్థారిస్తున్నాయి పలు వార్తాసంస్థలు. దీనిపై స్పందించిన బ్రిటన్‌ ఆర్మీ మాజీ అధికారి లార్డ్స్‌ రిచర్డ్‌ దనత్‌ ఈ విధంగా వివరణ ఇచ్చారు.. పుతిన్‌ చేతులపై ఉన్న మచ్చలు ఇంజక్షన్‌ సూదులు గుచ్చడం వల్ల ఏర్పడినట్లుగా కనిపిస్తోందన్నారు. అందువల్లే చేతులు రంగుమారి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. మరోవైపు పుతిన్‌ బ్లడ్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్నారంటూ పుతిన్‌ సన్నిహితుడు గతంలో అన్న మాటలు పుకార్లకు మరింత ఊతమిస్తున్నాయి.