AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Expensive Cities: ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరాలు.. ఈ అగ్రస్థానంలో ఈ రెండు దేశాలు

ప్రపంచ నగరాల్లో ఇంధన ధరలు పెరగడం ద్రవ్యోల్బణం రేటును రెట్టింపు చేసింది. ప్రపంచంలోని ప్రధాన నగరాల్లో సర్వే చేయబడిన 172 నగరాల్లో జీవన వ్యయం ఏటా సగటున..

Expensive Cities:  ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరాలు.. ఈ అగ్రస్థానంలో ఈ రెండు దేశాలు
Singapore
Subhash Goud
|

Updated on: Dec 04, 2022 | 8:39 PM

Share

ప్రపంచ నగరాల్లో ఇంధన ధరలు పెరగడం ద్రవ్యోల్బణం రేటును రెట్టింపు చేసింది. ప్రపంచంలోని ప్రధాన నగరాల్లో సర్వే చేయబడిన 172 నగరాల్లో జీవన వ్యయం ఏటా సగటున 8.1 శాతం పెరిగింది. ఈ రేటు గత 20 ఏళ్లలో అత్యధికం. మూడు భారతీయ నగరాల పేర్లు కూడా జాబితాలో ఉన్నాయి. భారతదేశంలోని ఏ నగరం కూడా టాప్ 100లో చేర్చలేదు. మూడు అమెరికన్ నగరాలు న్యూయార్క్, లాస్ ఏంజిల్స్, శాన్ ఫ్రాన్సిస్కో ప్రపంచంలోని 10 అత్యంత ఖరీదైన నగరాల జాబితాలో ఉన్నాయి. న్యూయార్క్‌కు అగ్రస్థానం దక్కడం ఇదే తొలిసారి. సర్వేలో చేర్చబడిన మొత్తం 22 యూఎస్‌ నగరాలు కూడా ధరల పెరుగుదల, డాలర్ బలం మధ్య ర్యాంకింగ్‌లో లాభపడ్డాయి. వీటిలో ఆరు (అట్లాంటా, షార్లెట్, ఇండియానాపోలిస్, శాన్ డియాగో, పోర్ట్‌ల్యాండ్, బోస్టన్) ర్యాంకింగ్స్‌లో అతిపెద్ద జంప్‌లు చేసిన 10 నగరాల్లో ఉన్నాయి. చాలా యూరోపియన్ నగరాలు వాటి ర్యాంకింగ్స్‌లో క్షీణించాయి.

గ్లోబల్ సర్వేలో విడుదల చేసిన ర్యాంకింగ్‌లో ఇజ్రాయెల్ నగరం టెల్ అవీవ్ గతేడాది అగ్రస్థానంలో ఉండగా, ఇప్పుడు మూడో స్థానంలో నిలిచింది. రష్యా నగరాలైన మాస్కో, సెయింట్ పీటర్స్‌బర్గ్‌ల ర్యాంకింగ్‌లో అతిపెద్ద మార్పు జరిగింది. విపరీతమైన ద్రవ్యోల్బణం పరంగా రెండింటి ర్యాంకింగ్‌లు వరుసగా 88, 70 పాయింట్లు పెరిగాయి.

ఉక్రెయిన్‌లో యుద్ధం, రష్యాపై పాశ్చాత్య ఆంక్షలు, చైనా జీరో-కోవిడ్ విధానాలు సరఫరా-గొలుసు సమస్యలకు ఆజ్యం పోశాయి. అదే సమయంలో వడ్డీ రేట్ల పెరుగుదల, మారకపు రేట్లలో మార్పులు ప్రపంచవ్యాప్తంగా జీవన వ్యయ సంక్షోభాన్ని సృష్టించాయి. దీని కారణంగా ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం వేగంగా పెరుగుతోంది.

ఇవి కూడా చదవండి

ఈ జాబితాలో మూడు భారతీయ నగరాలు

నివేదిక ప్రకారం.. ప్రపంచంలోని చౌకైన నగరాలు సిరియాలోని డమాస్కస్, లిబియాలోని ట్రిపోలీ. ఈ పరిస్థితి ఈ దేశాల బలహీన ఆర్థిక వ్యవస్థలు, కరెన్సీలను ప్రతిబింబిస్తుంది. అట్టడుగున ఉన్న టాప్ 10 స్థానాల్లో మూడు భారతీయ నగరాలు కూడా ఉన్నాయి. వీటిలో బెంగళూరు 161వ స్థానంలో, చెన్నై 164వ స్థానం, అహ్మదాబాద్ 165వ స్థానంలో ఉన్నాయి. ఈ ఏడాది ఆగస్టు, సెప్టెంబర్ మధ్య నిర్వహించిన ఈ సర్వేలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న నగరాల్లో 200 కంటే ఎక్కువ వస్తువులు, సేవల ధరలు మదింపు చేయబడ్డాయి.

అత్యంత ఖరీదైన నగరాలు:

ర్యాంక్ అండ్ సిటీ, న్యూయార్క్, సింగపూర్, టెల్ అవీవ్, హాంకాంగ్, లాస్ ఏంజిల్స్, జ్యూరిచ్, జెనీవా, శాన్ ఫ్రాన్సిస్కో, పారిస్, సిడ్నీ, కోపెన్‌హాగన్ ఉన్నాయి.

తక్కువ ఖరీదైన నగరాలు

ర్యాంక్ అండ్ సిటీ, కొలంబో, బెంగళూరు, అల్జీర్స్, చెన్నై, అహ్మదాబాద్, అల్మాటీ, కరాచీ, తాష్కెంట్, టునిస్, టెహ్రాన్, ట్రిపోలీ, డమాస్కస్ ఉన్నాయి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి