Indian Railways: టికెట్ లేకుండా ప్రయాణించే వారిపై సెంట్రల్ రైల్వే కఠిన చర్యలు.. 8 నెలల్లో కోట్లాది రూపాయలు వసూలు

భారతీయ రైల్వే ప్రపంచంలోనే అతిపెద్ద రైలు నెట్‌వర్క్‌లో ఒకటి. ప్రతిరోజు వేల సంఖ్యలో రైళ్లు నడుస్తాయి. కోట్లాది మంది ప్రయాణికులు తమ తమ గమ్యస్థానాలకు చేరుకుంటారు..

Indian Railways: టికెట్ లేకుండా ప్రయాణించే వారిపై సెంట్రల్ రైల్వే కఠిన చర్యలు.. 8 నెలల్లో కోట్లాది రూపాయలు వసూలు
Indian Railway
Follow us
Subhash Goud

|

Updated on: Dec 04, 2022 | 2:56 PM

భారతీయ రైల్వే ప్రపంచంలోనే అతిపెద్ద రైలు నెట్‌వర్క్‌లో ఒకటి. ప్రతిరోజు వేల సంఖ్యలో రైళ్లు నడుస్తాయి. కోట్లాది మంది ప్రయాణికులు తమ తమ గమ్యస్థానాలకు చేరుకుంటారు. రైల్వే ఆదాయానికి మూల కారణం సరుకు రవాణా, జరిమానాలు. టికెట్‌ లేకుండా ప్రయాణించే ప్రయాణికులపై రైల్వే శాఖ జరిమానా విధించింది. ఇటీవల సెంట్రల్ రైల్వే టిక్కెట్లు లేకుండా ప్రయాణించే వ్యక్తులపై ప్రత్యేక దృష్టి సారించింది. దీని ద్వారా రైలులో టిక్కెట్లు లేకుండా ప్రయాణిస్తూ పట్టుబడిన 32.77 లక్షల మందిని గుర్తించారు రైల్వే సిబ్బంది. వీరి నుంచి సెంట్రల్ రైల్వే మొత్తం రూ.218 కోట్ల జరిమానాను వసూలు చేసింది.

గతేడాది కంటే ఎక్కువ జరిమానాలు వసూలు చేసింది:

గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది జరిమానాల రూపంలో ఎన్నో రెట్లు అధికంగా వసూళ్లు చేసినట్లు సెంట్రల్ రైల్వే తెలిపింది. ఈ ఏడాది 74.83 శాతం ఎక్కువ వసూళ్లు వచ్చాయి. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి నవంబర్ 30, 2022 వరకు టిక్కెట్లు లేకుండా ప్రయాణిస్తున్న ప్రయాణికుల నుంచి రైల్వేశాఖ మొత్తం రూ.218 కోట్లు వసూలు చేసింది. అదే సమయంలో గతేడాది ఈ సమయానికి రూ.124.68 కోట్లు మాత్రమే రికవరీ అయింది. అందుకే రైలులో ప్రయాణించే ప్రయాణికులు తప్పనిసరిగ్గా టికెట్‌ తీసుకోవాలని, లేని పక్షంలో భారీగా జరిమానా పడుతుందని రైల్వే హెచ్చరించింది.

అలాగే భారత రైల్వే శాఖ తన ఆదాయాన్ని మరింతగా పెంచుకుంది. ఏప్రిల్‌ నుంచి నవంబర్‌ మధ్య కాలంలో ప్రయాణికుల విభాగంలో భారత రైల్వే 76 శాతం ఆదాయన్ని సంపాదించుకున్నట్లు రైల్వే శాఖ వివరించింది. గత ఏడాది రూ.24,631 కోట్ల ఆదాయం ఉండగా, ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి నవంబర్ మధ్య రూ. 43,324 కోట్లు గడించింది. ప్రయాణికుల రిజర్వేషన్ విభాగంలోనే ఈ ఆర్థిక సంవత్సరం 50 శాతంకు మించిన ఆదాయం వచ్చింది. గత సంవత్సరం రూ. 22,904 కోట్లు ఉండగా, ఈ ఏడాది అది రూ. 34,303 కోట్లు పెరిగింది. ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్య కాలంలో టిక్కెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికుల సంఖ్య 10 శాతం పెరిగింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి