AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tax Saving Scheme: ఆదాయపు పన్ను పోటును తప్పించుకోవాలనుకుంటున్నారా.. వెంటనే ఈ వీటిలో పెట్టుబడి పెట్టండి.. ఎంత మిగులుతాయో తెలుసా..

ఉద్యోగస్తులు ఆదాయపు పన్ను మినహాయింపు గురించి చాలా ఆందోళన చెందుతారు. వారు ఆదాయంపై పన్ను ఎలా ఆదా చేయాలనే ఆలోచనలు చేస్తుంటారు. అయితే మీరు ఆదాయపు పన్ను నుంచి ఎలా బయటపడవచ్చో ఇక్కడ తెలుసుకోండి..

Tax Saving Scheme: ఆదాయపు పన్ను పోటును తప్పించుకోవాలనుకుంటున్నారా.. వెంటనే ఈ వీటిలో పెట్టుబడి పెట్టండి.. ఎంత మిగులుతాయో తెలుసా..
Best Tax Saving Options
Follow us
Sanjay Kasula

|

Updated on: Dec 04, 2022 | 1:45 PM

మనం చాలా కష్టపడి డబ్బు సంపాదిస్తాం. ప్రభుత్వం మన నుంచి ఆదాయపు పన్ను తీసుకుంటుందని చాలా మంది ఆందోళన వ్యక్తం చేస్తారు. వ్యాపారులు తమ పన్నును ఆదా చేస్తారని, కానీ మనం ఆదా చేయలేకపోతున్నామని జీతభత్యాలు తీసుకునే వారు తెగ ఫీలవుతారు. మీరు కూడా ఇలాగే ఆలోచిస్తే టెన్షన్ పడకండి. ఇక్కడ కొన్ని ప్రభుత్వ పథకాల గురించి తెలుసకుందాం. వీటిపై మీరు పెట్టుబడి పెట్టవచ్చు. దీంతో మీరు పన్నుపై మినహాయింపు పొందవచ్చు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇంకా 4 నెలలు మిగిలి ఉంది. త్వరలో ఈ పథకాలలో పెట్టుబడి పెట్టండి. పన్ను మినహాయింపు ప్రయోజనాన్ని పొందండి.

బ్యాంక్, పోస్టాఫీసులో FD..

మీరు బ్యాంకు లేదా పోస్టాఫీసులో పెట్టుబడి పెట్టడం ద్వారా కూడా పన్ను ఆదా చేసుకోవచ్చు. ఇక్కడ సెక్షన్ 80C కింద మీరు రూ. 1 లక్షా 50 వేల పన్ను మినహాయింపును పొందవచ్చు.

ఉద్యోగుల భవిష్య నిధికి పన్ను ఆదా అవుతుంది

ఉద్యోగుల భవిష్య నిధి (EPF) అనేది ప్రజలు జీతం పొందేందుకు సులభమైన మార్గంగా పరిగణించబడుతుంది. సెక్షన్ 80సి కింద, మీరు డిపాజిట్ చేసిన పిఎఫ్‌పై రూ. 1 లక్షా 50 వేల పన్ను రాయితీని పొందవచ్చు.

మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా పన్ను ఆదా అవుతుంది

మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా పన్ను ఆదా చేసుకోవచ్చు. మీరు ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ELSS)లో పెట్టుబడి పెట్టడం ద్వారా సెక్షన్ 80C కింద మినహాయింపు పొందవచ్చు. రిటర్న్‌లు, పన్ను మినహాయింపు వంటి రెట్టింపు ప్రయోజనాల కారణంగా.. ఉద్యోగులు ఈ పథకంలో చాలా పెట్టుబడి పెడతారు.

NPS పన్ను ఆదా అవుతుంది

నేషనల్ పెన్షన్ స్కీమ్ (NPS)లో, ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80CCE కింద రూ. 1 లక్షా 50 వేల పన్ను మినహాయింపు లభిస్తుంది. ఇది కాకుండా, ఈ పథకంలో 80 CCD (1B) కింద, మీరు 50 వేల రూపాయల అదనపు రాయితీని పొందవచ్చు.

PPFలో 15 ఏళ్లపాటు పన్ను మినహాయింపు లభిస్తుంది!

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) పన్ను మినహాయింపును క్లెయిమ్ చేయడానికి ఉత్తమ ఎంపిక అని చెప్పవచ్చు. ఈ స్కీమ్‌లో పెట్టుబడితో పాటు, మెచ్యూరిటీ మొత్తం, వడ్డీ కూడా పన్ను రహితం అంటే పెట్టుబడితో పాటు, మెచ్యూరిటీ ఫండ్, వడ్డీ మొత్తం కూడా పన్ను రహితంగానే ఉంటుంది. మీరు దీర్ఘకాలికంగా సురక్షితమైన పెట్టుబడి పెట్టాలనుకుంటే, ఇది మంచి ప్రణాళిక. ఇక్కడ మీరు పెద్ద ఫండ్‌ను సంపాదించవచ్చు, PPF ఖాతాలో పెట్టుబడి పెడితే సెక్షన్ 80C కింద రూ. 1 లక్ష 50 వేల మినహాయింపు లభిస్తుంది.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం