AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Driving License: వాహనదారులకు అలెర్ట్.. ఇకపై ఆర్‌సీ, లైసెన్స్‌తో పన్లేదు.. ఇదొక్కటి ఉంటే చాలు..

గతంలో డ్రైవింగ్ లైసెన్స్‌ లేకుండా వాహనాలు నడిపేవారు ఎందరో ఉన్నారు. కానీ ఇప్పుడు రూల్స్ అన్నీ మారాయి. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా..

Driving License: వాహనదారులకు అలెర్ట్.. ఇకపై ఆర్‌సీ, లైసెన్స్‌తో పన్లేదు.. ఇదొక్కటి ఉంటే చాలు..
Driving License
Ravi Kiran
|

Updated on: Dec 04, 2022 | 3:12 PM

Share

గతంలో డ్రైవింగ్ లైసెన్స్‌ లేకుండా వాహనాలు నడిపేవారు ఎందరో ఉన్నారు. కానీ ఇప్పుడు రూల్స్ అన్నీ మారాయి. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలను నడపడం కష్టం. నడిపే వ్యక్తి దగ్గర లైసెన్స్, ఆర్‌సీ, పొల్యూషన్ సర్టిఫికేట్, ఇన్సూరెన్స్ ఇలా అన్ని పత్రాలు ఉండాలి. లేదంటే కఠిన చర్యలు తప్పవు. ఒకవేళ లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే భారీ జరిమానా చెల్లించాల్సిందే. పైన పేర్కొన్న పత్రాలు ఏవి లేకుండా ట్రాఫిక్ పోలీసులకు మీరు దొరికినట్లయితే.. రూ. 2 వేల నుంచి రూ. 5 వేల వరకు జరిమానా కట్టాల్సి వస్తుంది. అందుకే వాహనాలు నడిపేవారికి వద్ద డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉండటం తప్పనిసరి. అయితే మీకు ఇప్పుడొకటి చెప్పబోతున్నాం. ఈ ఒక్క యాప్ మీ దగ్గర ఉంటే.. లైసెన్స్, ఆర్‌సీ లేకపోయినా మీకు చలానా వేయరు.

డిజిటల్ ఇండియాను దృష్టిలో పెట్టుకుని వాహనం నడపటానికి అవసరమైన అన్ని పత్రాలను ఒకే చోట పొందేలా పలు యాప్‌లు రూపొందించింది కేంద్ర ప్రభుత్వం. అవే Digilocker, mParivahan మొబైల్ యాప్‌లు. ఈ యాప్‌లలో మీరు మీ డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, పొల్యూషన్ సర్టిఫికేట్, బీమా పత్రాలను అప్‌లోడ్ చేయవచ్చు. అవసరమైనప్పుడు ఎప్పుడైనా, ఎక్కడైనా ఉపయోగించవచ్చు. ఈ యాప్‌లు రెండూ అధికారికమైనవి, దేశవ్యాప్తంగా చెల్లుబాటు అయ్యేవి.

హార్డ్ కాపీని ఉంచాల్సిన అవసరం లేదు..

మీరు రోడ్డుపై డ్రైవింగ్ చేస్తూ ఈ పత్రాలు ఏవీ లేకుండా, పట్టుబడితే భారీ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అందువల్ల, మీ వాహనాన్ని రోడ్డుపైకి తీసుకెళ్లే ముందు, మీ వద్ద అవసరమైన అన్ని పత్రాలు అందుబాటులో ఉన్నాయో లేదో నిర్ధారించుకోండి. కానీ భారతదేశం డిజిటల్‌గా మారుతున్నందున, డ్రైవింగ్‌కు అవసరమైన పత్రాల హార్డ్ కాపీలు లేకపోయినా ఫర్లేదు. మీరు డిజిలాకర్, mParivahan మొబైల్ యాప్‌లో అన్ని ముఖ్యమైన పత్రాలను సులభంగా పొందొచ్చు. కాగా, 2018 సంవత్సరంలో, భారత ప్రభుత్వ రోడ్డు, రవాణా మంత్రిత్వ శాఖ డిజిలాకర్, mParivahan మొబైల్ యాప్‌లలో అప్‌లోడ్ చేసిన పత్రాలను అసలైనవిగా నిర్ధారించాలని ఆదేశాలు జారీ చేసింది.

Follow Us
iSmart News: మా తమ్ముడే పెద్ద దానకర్ణుడు..నా దగ్గర ఏమీ లేదు!
iSmart News: మా తమ్ముడే పెద్ద దానకర్ణుడు..నా దగ్గర ఏమీ లేదు!
డీఆర్‌డీఓ కొత్త డైరెక్టర్ జనరల్‌గా డాక్టర్ జగన్నాథ్ నాయక్ నియామకం
డీఆర్‌డీఓ కొత్త డైరెక్టర్ జనరల్‌గా డాక్టర్ జగన్నాథ్ నాయక్ నియామకం
సుడిగాలి సుధీర్ హైలెస్సో నుంచి మరో పోస్టర్..
సుడిగాలి సుధీర్ హైలెస్సో నుంచి మరో పోస్టర్..
కాంట్రాక్టు పనులకు బిల్లు రాలేదని బడికి తాళం
కాంట్రాక్టు పనులకు బిల్లు రాలేదని బడికి తాళం
కబ్జాదారుల నుంచి 1166 గజాల ప్రభుత్వ స్థలాన్ని కాపాడిన హైడ్రా..
కబ్జాదారుల నుంచి 1166 గజాల ప్రభుత్వ స్థలాన్ని కాపాడిన హైడ్రా..
నాగలితో దుక్కి దున్నిన మంత్రి పొన్నం.. ఇదిగో వీడియో
నాగలితో దుక్కి దున్నిన మంత్రి పొన్నం.. ఇదిగో వీడియో
IND vs ENG తొలిపోరు.. పిచ్ రిపోర్ట్ చూస్తే మైండ్ బ్లాంకే..?
IND vs ENG తొలిపోరు.. పిచ్ రిపోర్ట్ చూస్తే మైండ్ బ్లాంకే..?
రైతు భరోసా పడలేదా..? ఈ విధానంలో ఫిర్యాదు చేస్తే ప్రాబ్లం క్లియర్
రైతు భరోసా పడలేదా..? ఈ విధానంలో ఫిర్యాదు చేస్తే ప్రాబ్లం క్లియర్
హైవేలపై వంతెనల భద్రత కోసం NHAI కొత్త రూల్స్.. రంగంలోకి 12 ఐఐటీలు!
హైవేలపై వంతెనల భద్రత కోసం NHAI కొత్త రూల్స్.. రంగంలోకి 12 ఐఐటీలు!
తారక్‌ను ముద్దుగా 'నాన్నా'అని పిలిచే ముగ్గురు హీరోలు ఎవరో తెలుసా?
తారక్‌ను ముద్దుగా 'నాన్నా'అని పిలిచే ముగ్గురు హీరోలు ఎవరో తెలుసా?