NPCIL Recruitment 2022: టెన్త్/ఇంటర్‌ అర్హతతో.. న్యూక్లియర్ పవర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాలో 243 ఉద్యోగాలు..

గుజరాత్‌లోని న్యూక్లియర్ పవర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌లో.. 243 సైంటిఫిక్‌ అసిస్టెంట్, ఫార్మసిస్ట్‌, స్టైపెండరీ ట్రైనీ, నర్స్, అసిస్టెంట్‌ గ్రేడ్-1 (కేటగిరీ 1 & 2) తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు..

NPCIL Recruitment 2022: టెన్త్/ఇంటర్‌ అర్హతతో.. న్యూక్లియర్ పవర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాలో 243 ఉద్యోగాలు..
NPCIL Gujarat
Follow us
Srilakshmi C

|

Updated on: Apr 06, 2023 | 1:07 PM

గుజరాత్‌లోని న్యూక్లియర్ పవర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌లో.. 243 సైంటిఫిక్‌ అసిస్టెంట్, ఫార్మసిస్ట్‌, స్టైపెండరీ ట్రైనీ, నర్స్, అసిస్టెంట్‌ గ్రేడ్-1 (కేటగిరీ 1 & 2) తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి పోస్టును బట్టి పదో తరగతి/ఇంటర్మీడియట్‌/ నర్సింగ్‌ , మిడ్‌వైఫరీ, ఫార్మీసీ లేదా తత్సమాన స్పెషలైజేషన్‌లో డిప్లొమా/బీఎస్సీ నర్సింగ్‌/ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అభ్యర్ధుల వయసు 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్‌ వర్గాలకు వయోపరిమితి విషయంలో సడలింపు ఉంటుంది.

ఈ అర్హతలున్నవారు జనవరి 5, 2023వ తేదిలోపు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్‌ 6వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. ఆన్‌లైన్‌ రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా జీతభత్యాలు చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు..

  • సైంటిఫిక్‌ అసిస్టెంట్ పోస్టులు: 4
  • స్టైపెండరీ ట్రైనీ పోస్టులు: 200
  • నర్స్‌-ఏ పోస్టులు: 3
  • ఫార్మీసిస్ట్ పోస్టులు: 1
  • అసిస్టెంట్‌ గ్రేడ్‌-1 పోస్టులు: 24
  • స్టెనో గ్రేడ్‌-1 పోస్టులు: 11

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.