DOST Admissions: రికార్డు స్థాయిలో 2.10 లక్షలకుపైగా డిగ్రీ చేరికలు.. ఈ సారి ఆ కోర్సులదే హవా..

తెలంగాణ రాష్ట్రంలో మునుపెన్నడూలేని విధంగా రికార్డు స్థాయిలో ఈ ఏడాది డిగ్రీ ప్రవేశాలు పెరిగినట్లు దోస్త్‌ కన్వీనర్‌ ఆచార్య ఆర్‌ లింబాద్రి స్పష్టం చేశారు. బీటెక్‌ కోర్సుల కంటే..

DOST Admissions: రికార్డు స్థాయిలో 2.10 లక్షలకుపైగా డిగ్రీ చేరికలు.. ఈ సారి ఆ కోర్సులదే హవా..
DOST Admissions
Follow us
Srilakshmi C

|

Updated on: Dec 06, 2022 | 3:21 PM

తెలంగాణ రాష్ట్రంలో మునుపెన్నడూలేని విధంగా రికార్డు స్థాయిలో ఈ ఏడాది డిగ్రీ ప్రవేశాలు పెరిగినట్లు దోస్త్‌ కన్వీనర్‌ ఆచార్య ఆర్‌ లింబాద్రి స్పష్టం చేశారు. బీటెక్‌ కోర్సుల కంటే బీకాంలో ప్రవేశాలు పొందిన విద్యార్ధుల సంఖ్యే అధికంగా ఉన్నట్లు తేలిపారు. రాష్ట్రంలో బీటెక్‌ కంటే బీకాంలో అత్యధిక ప్రవేశాలు నమోదు కావడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఇక 2022-23 విద్యా సంవత్సరానికిగానూ డిగ్రీలో మొత్తం 2,10,970 మంది అడ్మిషన్లు పొందారు. బీకాం కోర్సుల్లో దాదాపు 93,480 మంది (దోస్త్‌, నాన్‌ దోస్త్‌ ప్రవేశాలతో కలిపి)కి పైగా ప్రవేశాలు పొందారు. కామర్స్‌లో కంప్యూటర్‌ సబ్జెక్టును, బీకాం బిజినెస్‌ ఎనలిటిక్స్‌ కోర్సును ప్రవేశపెట్టడం, కామర్స్ విభాగంలో ఉద్యోగావకాశాలు కూడా పెరుగుతుండటంతో ఆ కోర్సులో చేరికలు పెరుగుతున్నాయని డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌-తెలంగాణ (దోస్త్‌) వర్గాలు అభిప్రాయపడుతున్నారు.

అబ్బాయిల కంటే రికార్డు స్థాయిలో అమ్మాయిల అడ్మిషన్లు

మొత్తం విద్యార్థుల్లో 1,09,480 మంది అమ్మాయిలు కావడం మరో విశేషం. అంటే మొత్తం ప్రవేశాల్లో 52.06 శాతం మంది అమ్మాయిలు అడ్మిషన్‌లు పొందారు. బీఎస్‌సీ లైఫ్‌సైన్స్‌, ఫిజికల్‌ సైన్స్‌, బ్యాచిలర్‌ ఆఫ్‌ సోషల్‌ వెల్ఫేర్‌ (బీఎస్‌డబ్ల్యూ) కోర్సుల్లో అధికంగా అమ్మాయిలు అడ్మిషన్‌లు పొందారు. బీఎస్‌సీ లైఫ్‌ సైన్స్‌లో అత్యధికంగా 75 శాతం వారే ఉండటం గమనార్హం. ఇక బీటెక్‌ కోర్సుల్లో 80 వేల మంది ప్రవేశాలు పొందారు. ఇంజినీరింగ్‌ అడ్మిషన్ల కంటే రెండున్నర రెట్లకు పైగా డిగ్రీ ప్రవేశాలు నమోదయ్యాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

హైదరాబాద్‌లో కారు బీభత్సం.. డ్రైవర్ని చితకబాదిన స్థానికులు.
హైదరాబాద్‌లో కారు బీభత్సం.. డ్రైవర్ని చితకబాదిన స్థానికులు.
దైవ దర్శనానికి వెళ్లి ప్రదక్షిణలు చేస్తున్న యువకుడు. అంతలోనే షాక్
దైవ దర్శనానికి వెళ్లి ప్రదక్షిణలు చేస్తున్న యువకుడు. అంతలోనే షాక్
కూలిన మర్రి చెట్టు కింద శివలింగం ప్రత్యక్షం.. పోటెత్తిన జనం.!
కూలిన మర్రి చెట్టు కింద శివలింగం ప్రత్యక్షం.. పోటెత్తిన జనం.!
గోండ్ కటిరా, పెరుగు కలిపి తింటే ఏమవుతుందో తెలుసా.?
గోండ్ కటిరా, పెరుగు కలిపి తింటే ఏమవుతుందో తెలుసా.?
అమెరికా వెళ్లాలనుకునేవారికి షాకింగ్‌ న్యూస్‌.! ఇండియన్స్ కి మరింత
అమెరికా వెళ్లాలనుకునేవారికి షాకింగ్‌ న్యూస్‌.! ఇండియన్స్ కి మరింత
బ్రష్ పై టూత్ పేస్ట్ ను ఎక్కువుగా పెడుతున్నారా.? అయితే ఇది మీకోసం
బ్రష్ పై టూత్ పేస్ట్ ను ఎక్కువుగా పెడుతున్నారా.? అయితే ఇది మీకోసం
అల్లు అర్జున్ నార్త్‌ ఫ్యాన్స్‌కు ఇక పండగే.! గ్రాండ్‌గా ట్రైలర్..
అల్లు అర్జున్ నార్త్‌ ఫ్యాన్స్‌కు ఇక పండగే.! గ్రాండ్‌గా ట్రైలర్..
కూలి పని చేసుకుంటున్న స్టార్ హీరో కొడుకు.! వీడియో వైరల్..
కూలి పని చేసుకుంటున్న స్టార్ హీరో కొడుకు.! వీడియో వైరల్..
రాంగోపాల్ వర్మకు బిగుస్తున్న ఉచ్చు.. పోలీసుల చేతిలో వర్మ.!
రాంగోపాల్ వర్మకు బిగుస్తున్న ఉచ్చు.. పోలీసుల చేతిలో వర్మ.!
ఉత్తరాంధ్ర యాసలో అభిమానిని ఆటపట్టించిన మెగాస్టార్.! వీడియో వైరల్.
ఉత్తరాంధ్ర యాసలో అభిమానిని ఆటపట్టించిన మెగాస్టార్.! వీడియో వైరల్.