‘కుక్కలు మొరిగితేనేం.. సింహం ఎప్పటికీ రాజే’: ఇన్‌స్టా పోస్ట్‌తో స్ట్రాంగ్ కౌంటరిచ్చిన వార్నర్.. ఎవరికో తెలుసా?
తొలి టెస్టు మ్యాచ్‌లో మార్నస్ లబుషెన్, స్టీవ్ స్మిత్ లు జట్టుకు విజయాన్ని అందించారు. ఈ ఇద్దరు బ్యాట్స్‌మెన్ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. మరోవైపు కంగారూ జట్టు స్టార్ బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్ అంతగా ఆకట్టుకోలేకపోయాడు.
David Warner: వెస్టిండీస్ జట్టు ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది. రెండు జట్ల మధ్య రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ జరగనుంది. ఈ సిరీస్‌లోని మొదటి మ్యాచ్ పెర్త్‌లో ఆతిథ్య జట్టు వెస్టిండీస్ జట్టును 164 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఈ విజయంతో కంగారూ జట్టు సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. సిరీస్‌లో రెండో మ్యాచ్ డిసెంబర్ 8 నుంచి అడిలైడ్‌లో జరగనుంది. ఈ టెస్టుకు ముందు ఆస్ట్రేలియన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన ఓ ప్రత్యేక పోస్ట్ తెగ వైరల్ అవుతోంది.
తొలి టెస్టు మ్యాచ్‌లో మార్నస్ లబుషెన్, స్టీవ్ స్మిత్ లు జట్టుకు విజయాన్ని అందించారు. ఈ ఇద్దరు బ్యాట్స్‌మెన్ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. మరోవైపు కంగారూ జట్టు స్టార్ బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్ అంతగా ఆకట్టుకోలేకపోయాడు. తొలి ఇన్నింగ్స్‌లో 5, రెండో ఇన్నింగ్స్‌లో 48 పరుగులు చేశాడు. వెస్టిండీస్‌పై వార్నర్ భారీ ఇన్నింగ్స్ ఆడతాడని అభిమానులు ఆశించారు. అయితే అతని బ్యాట్ నుంచి పెద్దగా పరుగులు రాలేదు. ఈ క్రమంలో ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ రెండవ టెస్ట్ ప్రారంభానికి ముందు తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఫొటోను పంచుకున్నాడు. అభిమానులు వారి ఆలోచనకు అనుగుణంగా రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
వార్నర్ ఇకపై జట్టుకు కెప్టెన్సీ చేయకూడదు – క్లార్క్
2018 సంవత్సరంలో దక్షిణాఫ్రికాతో ఆడిన టెస్ట్ సిరీస్‌లో బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడిన ముగ్గురు ఆటగాళ్లలో డేవిడ్ వార్నర్ కూడా ఒకడు. ఆ తర్వాత స్టీవ్ స్మిత్, కామెరాన్ బాన్‌క్రాఫ్ట్, వార్నర్‌పై నిషేధం విధించారు. అదే సమయంలో జాతీయ జట్టుకు సారథ్యం వహించినందుకుగానూ వార్నర్, స్మిత్‌లపై నిషేధం విధించారు.
View this post on Instagram
అయితే ప్రస్తుతం మళ్లీ వార్నర్‌కే కెప్టెన్సీ అప్పగిస్తారనే చర్చ జరుగుతోంది. ఈ విషయమై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ మాట్లాడుతూ.. వార్నర్‌కు జట్టు బాధ్యతలు అప్పగించే బదులు యువ ఆటగాళ్లకు మరిన్ని అవకాశాలు కల్పిస్తే బాగుంటుందని చెప్పుకొచ్చాడు.
వార్నర్ మంచి కెప్టెన్‌గా నిరూపించుకోగలడు. ఐపీఎల్‌లో కెప్టెన్‌గా వ్యవహరించడం నేను చూశాను. కానీ, 36 ఏళ్ల వయసులో మళ్లీ అతడిని జట్టుకు కెప్టెన్‌గా చేస్తే ఆశ్చర్యపోతానంటూ కీలక వ్యాఖ్యలు చేశాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..