Diabetes: రాత్రిపూట నిద్ర పట్టడం లేదా.. ఈ సమస్యలో చిక్కుకున్నట్లే.. సరికొత్త పరిశోధనలో షాకింగ్ విషయాలు..

ఇప్పటికే మధుమేహం ఉన్నవాకి నిద్ర పట్టడం కూడా ఇబ్బందిగా ఉంటుంది. అప్పుడు శరీరంలో అనేక ఇతర వ్యాధుల ప్రమాదం కూడా గణనీయంగా పెరుగుతుందని పరిశోధనలో పేర్కొన్నారు.

Diabetes: రాత్రిపూట నిద్ర పట్టడం లేదా.. ఈ సమస్యలో చిక్కుకున్నట్లే.. సరికొత్త పరిశోధనలో షాకింగ్ విషయాలు..
Sleeping
Follow us

|

Updated on: Dec 06, 2022 | 6:45 AM

భారతదేశంలో ప్రతి సంవత్సరం డయాబెటిస్ కేసులు పెరుగుతున్నాయి. ప్రపంచంలో చైనా తర్వాత అత్యధిక సంఖ్యలో మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉన్న దేశం భారత్. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, భారతదేశంలో ఈ వ్యాధితో 77 మిలియన్ల కేసులు ఉన్నాయి. ఇందులో టైప్‌-1, టైప్‌-2 రోగులు ఉన్నారు. మధుమేహం అనేక కారణాల వల్ల వస్తుంది. వీటిలో చెడు జీవనశైలి ఆహారపు అలవాట్లు, జన్యుపరమైన కారణాలు ఉన్నాయి. అయితే రాత్రి సరిగ్గా నిద్రపోకపోవడం కూడా మధుమేహం లక్షణం అని మీకు తెలుసా. అవును, ఇది కూడ ఓ కారణమని పరిశోధనల్లో తేలింది.

అవును, మీరు రాత్రి సరిగ్గా నిద్రపోకపోతే, అది టైప్-2 డయాబెటిస్ సమస్య కావచ్చు. ఆస్ట్రేలియాలో చేసిన పరిశోధన ప్రకారం, రాత్రిపూట నిద్రించడానికి ఇబ్బంది పడే వ్యక్తులు ఈ వ్యాధి బారిన పడే అవకాశం ఉంది. టైప్-2 డయాబెటిస్‌కు ఇన్‌ఫ్లమేటరీ మార్కర్‌లతో పాటు బరువు పెరగడం వంటి సమస్యలను కలిగిస్తుంది.

నిద్ర లేకపోవడం, మధుమేహం మధ్య సంబంధం ఏమిటి?

ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు వేయి మందికి పైగా పరిశోధనలు చేశారు. వీరందరి సగటు వయస్సు 45 సంవత్సరాలు. ఈ వ్యక్తుల నిద్ర విధానాల గురించి సమాచారం తీసుకున్నారు. వీరు నిద్రించడానికి ఇబ్బందిగా పడుతున్నారా.. లేదా అనేది కూడా నిర్ధారించారు. రాత్రిపూట నిద్రలేమి సమస్య, స్థూలకాయం, కొలెస్ట్రాల్ వంటి సమస్యలు కనిపించాయని, వాటి వల్ల టైప్-2 మధుమేహం వచ్చే ప్రమాదం ఉందని తేల్చారు. ఈ సమస్య ఏ వయసులోనైనా రావచ్చు. అయినప్పటికీ 40 ఏళ్లు పైబడిన వారిలో ఈ సమస్య వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని పేర్కొంది.

ఇవి కూడా చదవండి

ప్రీ-డయాబెటిక్స్‌తోనే అధిక ప్రమాదం..

ఇప్పటికే మధుమేహం ఉన్నవాకి నిద్ర పట్టడం కూడా ఇబ్బందిగా ఉంటుంది. అప్పుడు శరీరంలో అనేక ఇతర వ్యాధుల ప్రమాదం కూడా గణనీయంగా పెరుగుతుందని పరిశోధనలో పేర్కొన్నారు. ఇటువంటి పరిస్థితిలో ప్రజలందరికీ కనీసం ఏడు గంటల నిద్ర అవసరం.

ఈ పరిశోధనలో ప్రధాన పరిశోధకురాలు డాక్టర్ లిసా మెట్రిసియాని ప్రకారం, నిద్ర లేకపోవడం వల్ల శరీరం అనేక వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది. ఇటువంటి పరిస్థితిలో, మధుమేహం, నిద్ర మధ్య సంబంధం గురించి తెలుసుకోవడం కూడా అవసరం. ఇందులో తక్కువ నిద్ర, మధుమేహం వచ్చే ప్రమాదం కనుగొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలంతా దీనిపై దృష్టి సారించాలి. రాత్రిపూట నిద్రపోలేకపోతే, దాని గురించి అజాగ్రత్తగా ఉండకండి. ఇలాంటి సందర్భాల్లో వైద్యులను సంప్రదించడం చాలా ముఖ్యం.

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..