Video: ఇదేం స్టంట్‌రా బాబు.. దెబ్బకు దిమ్మతిరిగి పోయిందిగా.. నవ్వులు పూయిస్తోన్న వీడియో..

Viral Video: కొంతమంది స్వయంగా హీరోలు కావడానికి కూడా ప్రయత్నిస్తుంటారు. సోషల్ మీడియాలో ఇలాంటి అనేక వీడియోలు కనిపిస్తుంటాయి. అయితే, కొన్నిసార్లు వారు చేసిన స్టంట్స్ గాడి తప్పి నెట్టింట్లో తెగ ట్రెండింగ్ అవుతుంటారు.

Video: ఇదేం స్టంట్‌రా బాబు.. దెబ్బకు దిమ్మతిరిగి పోయిందిగా.. నవ్వులు పూయిస్తోన్న వీడియో..
Man Stunt Goes Viral
Follow us
Venkata Chari

|

Updated on: Dec 04, 2022 | 8:15 AM

Trending Video: సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వాలని చాలామంది చూస్తుంటారు. అందుకోసం ఎంతగానో ప్రయత్నిస్తుంటారు. ఆ మేరకు రకరకాలుగా స్టంట్స్, డ్యాన్స్, స్కిట్స్ చేస్తుంటారు. కాగా, కొంతమంది స్వయంగా హీరోలు కావడానికి కూడా ప్రయత్నిస్తుంటారు. సోషల్ మీడియాలో ఇలాంటి అనేక వీడియోలు కనిపిస్తుంటాయి. అయితే, కొన్నిసార్లు వారు చేసిన స్టంట్స్ గాడి తప్పి నెట్టింట్లో తెగ ట్రెండింగ్ అవుతుంటారు. తాజాగా ఓ యంగ్ మ్యాన్ వీడియో వైరల్ అవుతోంది. అందులో స్టంట్స్ చూసి, నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు.

యోగా గురు బాబా రామ్‌దేవ్‌ను కాపీ కొట్టేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించి, అయితే ఈ సమయంలో అతను పొరపాటు చేసి అతని బ్యాలెన్స్ తప్పిపోవడం వీడియోలో చూడొచ్చు.

ఇవి కూడా చదవండి

ఇక్కడ వీడియో చూడండి..

ఒక వ్యక్తి ఇటుకలను సేకరించి గోడలా నిర్మించాడు. దానిపై స్టంట్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇటుకలు దాదాపు మూడు అడుగుల పొడవు ఉంటాయి. దీని తరువాత, రెండు చేతుల సహాయంతో, వ్యక్తి ఇటుకపై వ్యతిరేక భంగిమలో రావడానికి ప్రయత్నించాడు. కానీ తన శరీర బరువును బ్యాలెన్స్ చేయలేకపోయాడు. దాని కారణంగా అతని బ్యాలెన్స్ క్షీణిస్తుంది. దాంతో కిందపడిపోవడం వీడియోలో చూడొచ్చు.

ఈ వీడియో @FaildVideo అనే ఖాతా ద్వారా ట్విట్టర్‌లో షేర్ చేశాడు. ఈ వీడియోని 88 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. దీనిపై నెటిజన్లు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ కుర్రాడు వచ్చేసారి స్టంట్ చేసే ముందు కచ్చితంగా వందసార్లు ఆలోచిస్తాడని ఓ యూజర్ కామెంట్ చేయగా, మరోవైపు, ఆ వ్యక్తి మెడ విరిగిపోయి ఉంటుందని మరొక యూజర్ కామెంట్ చేశాడు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..