AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: మీరు ఎంతో మంది దొంగలను చూసి ఉంటారు.. కానీ ఇలాంటి దొంగను చూశారా..? చూస్తే నవ్వకుండా ఉండలేరు..

ఉన్నవాడి దగ్గర నుంచి దోచుకొని లేనివాడికి పంచిపెట్టడం అనే మాటలను అందరూ వినే ఉంటారు. కానీ అలాంటి మాటలను సినిమాలలోనే వింటాం, నిజ జీవితంలో విన్న తావే ఉండదు. కానీ

Watch: మీరు ఎంతో మంది దొంగలను చూసి ఉంటారు.. కానీ ఇలాంటి దొంగను చూశారా..? చూస్తే నవ్వకుండా ఉండలేరు..
Ccharrisgarh Sp And Thief
శివలీల గోపి తుల్వా
|

Updated on: Dec 04, 2022 | 8:07 AM

Share

ఉన్నవాడి దగ్గర నుంచి డబ్బులను దోచుకొని లేనివాడికి పంచిపెట్టడం అనే మాటలను అందరూ వినే ఉంటారు. కానీ అలాంటి మాటలను సినిమాలలోనే వింటాం, నిజ జీవితంలో విన్న తావే ఉండదు. కానీ ఛత్తీస్‌గఢ్ దుర్గ్ జిల్లాలో అలాంటి ఘటన నిజంగా  జరిగింది. ఛత్తీస్‌గఢ్‌లోని ఓ దొంగ స్వయంగా పోలీసుల వద్దకు వచ్చి.. దొంగతనం చేేసి మంచిపని చేశానని, దొంగింలించిన డబ్బులతో పేదలకు దుప్పట్లు కొని ఇచ్చానని చెప్పాడు. దొంగ నిజాయితీకి పోలీసులు ఏంచేయాలో అర్థంకాక అతని మాటలకు పగలబడి నవ్వుకున్నారు. ఇంకా ఆ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. కొన్ని రోజుల క్రితం ఓ యువకుడు దుర్గ్ జిల్లాలోని ఓ ఇంట్లో 10 వేల రూపాయలను దొంగిలించాడు. అయితే దొంగిలించిన ఆ డబ్బులతో రోడ్డు పక్కన ఉండే నిరావాస వృద్ధులకు దుప్పట్లు కొని ఇచ్చాడు. ఇంకా స్థానికంగా ఉంటే కుక్కలకు, ఆవులకు ఆహారం పెట్టాడు అదే డబ్బులతో.

అంతా అయిపోయిన తర్వాత పోలీసుల దగ్గరకు వచ్చి.. ఉన్న విషయాన్ని పూస గుచ్చినట్లుగా వారికి వివరించాడు ఆ దొంగ. అతను చెప్పిన మాటలకు పోలీసులు విరగబడి మరీ నవ్వుకున్నారు. అత‌ని గొప్ప మ‌న‌సుకు పోలీసులు కూడా ఫిదా అయ్యారు. ‘‘చోరీ కర్కే అచ్చా లగా (దొంగతనం చేయడం బాగుంది కానీ)’’ అని దొంగ పల్లవకు చెప్పి తరువాత పశ్చాత్తాపపడ్డాడు. పోలీసులు కారణం అడగగా, అది తప్పు అని తర్వాత అర్థమైందని చెప్పాడు. ఇంకా ‘వృద్ధుల నుంచి నీకు ఆశీర్వాదం ల‌భించిందా’ అని పోలీసులు అతన్ని అడ‌గ్గా.. ‘ఆశీర్వాదం తీసుకున్నాను’ స‌ర్ అని అతను తెలిపాడు. దీనికి సంబంధించిన వీడియోను వారు షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఇవి కూడా చదవండి

దొంగను పోలీసులు విచారిస్తున్న వీడియో..

ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. వీడియోలో.. దుర్గ్ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ డాక్టర్ అభిషేక్ పల్లవ ఆ దొంగను విచారిస్తున్నాడు. పల్లవ అడిగే ప్రశ్నలకు అతను సమాధానం ఇస్తుండగా అక్కడున్న ఇతర పోలీసు అధికారులు పగలబడి నవ్వుకుంటున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను పలు వార్తాసంస్థలు, జర్నలిస్టులు  కూడా తమ ఖాతాలలో పోస్ట్ చేశారు. కాగా ఆ వీడియోకు నెటిజన్లు వింత వింతగా స్పందిస్తున్నారు. వారు ఆ దొంగను ‘రాబిన్‌హుడ్’, ‘క్రాంతికారి చోర్’ అని పిలుస్తారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..