Watch Video: పెళ్లి కోసం బస్సు బుక్ చేయడం కామన్.. కానీ వీళ్లు ఏం చేశారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
ప్రతీ ఒక్కరి జీవితంలో వివాహాన్ని ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. జీవితంలో ఎంతో ముఖ్యమైన పెళ్లిని అంగరంగ వైభవంగా జరుపుకోవాలని భావిస్తుంటారు. అందుకోసం అన్ని రకాల ఏర్పాట్లు చేసుకుంటారు. తమ ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా ఎవరికి తోచిన విధంగా వారు వివాహాన్ని వేడుకగా జరుపుకుంటారు...
ప్రతీ ఒక్కరి జీవితంలో వివాహాన్ని ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. జీవితంలో ఎంతో ముఖ్యమైన పెళ్లిని అంగరంగ వైభవంగా జరుపుకోవాలని భావిస్తుంటారు. అందుకోసం అన్ని రకాల ఏర్పాట్లు చేసుకుంటారు. తమ ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా ఎవరికి తోచిన విధంగా వారు వివాహాన్ని వేడుకగా జరుపుకుంటారు. బంధువులను వివాహ వేడుకలకు తరలించడానికి బస్సులు, కార్లను ఏర్పాటు చేస్తుండడం మనం చూశే ఉంటాం. కానీ ఓ పెళ్లింటి వారు మాత్రం ఏకంగా విమానాన్నే బుక్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌లో జైసల్మేర్‌కు చెందిన ఓ జంట వివాహానికి ముహుర్తం ఖరారైంది. వివాహ తేదీ రానే వచ్చింది. బంధు మిత్రులను పెళ్లి జరిగే ప్రదేశానికి తీసుకెళ్లే క్రమంలో ఈ జంట వినూత్నంగా ఆలోచించింది. వదువు, వరుడు తరపున బంధువలను వివాహానికి తీసుకెళ్లేందుకు గాను విమానం మొత్తాన్ని బుక్ చేశారు. బస్సులో వివాహానికి వెళ్తున్నట్లు విమానంలో బయలుదేరారు. డెస్టినేషన్ వెడ్డింగ్ కావడంతో బంధువులు సమయానికి పెళ్లి వేదికకు చేరుకోవడానికి ఈ జంట ప్లాన్ చేశారంటా.
View this post on Instagram
బంధువులు అంతా విమానంలో కేరింతలు కొడుతుండగా, కాబోయే వధూవరులు విమానం చివర్లో కూర్చొని సందడి చేశారు. దీనంతటినీ వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. శ్రేయ సాహ్ అనే డిజిటల్ క్రియేటర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియోను పోస్ట్ చేయడంతో ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు పెళ్లి కోసం విమానం బుక్ చేయడం నిజంగా గ్రేట్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక మరికొందరు పెళ్లంటే ఇదేరా.? అంటున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..