Watch Video: విదేశాల్లోనూ తగ్గని పుష్ప ఫీవర్.. సామీ, సామీ పాటకు అదిరిపోయే స్టెప్పులేసిన రష్యన్ అమ్మాయిలు..
Viral Video: 'పుష్ప' సినిమా పాటపై చేసిన రీల్స్ మరే పాటకు కూడా ఉండవు. ఈ సినిమా వచ్చి దాదాపు ఏడాది కావస్తున్నా ఇంకా క్రేజ్ తగ్గలేదంటే దాని ఫీవర్ ఏంటో మీరు ఊహించవచ్చు.
Trending Video: గతేడాది విడుదలైన అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన ‘పుష్ప’ సినిమా ఎన్నో రికార్డులను బద్దలు కొట్టింది. ఈ సినిమాలోని ప్రతి సన్నివేశం, ప్రతి డైలాగ్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సినిమా పాటలు కూడా సంచలనం సృష్టించాయి. ఇప్పటికీ ఈ సినిమాలోని పాటలు ఎక్కడో ఒకచోట హాట్ టాపిక్‌గానే మారుతున్నాయి. ముఖ్యంగా ‘సామీ, సామీ’ పాట గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇక్కడే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఈ పాట మార్మోగిపోతుంది. తాజాగా ఈ లిస్టులోకి రష్యన్ మహిళలు వచ్చి చేరారు. వారి డ్యాన్స్ అద్భుతంగా ఉండడంతో నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
ఈ సినిమా వచ్చి దాదాపు ఏడాది కావస్తున్నా ఇంకా క్రేజ్ తగ్గలేదంటే దాని ఫీవర్ ఏంటో ఊహించుకోవచ్చు. రష్యన్ మహిళల బృందం ఈ చిత్రంలోని సామీ, సామీ పాటకు తమదైన స్టైల్‌లో స్టెప్పులు వేసి అదరగొట్టారు.
వీడియో ఇక్కడ చూడండి..
View this post on Instagram
వైరల్ వీడియోలో మాస్కోలోని రెడ్ స్క్వేర్‌లోని స్టేట్ హిస్టారికల్ మ్యూజియం ముందు మహిళలు ఈ హిట్ పాటకు డ్యాన్స్ చేశారు. ఈ విదేశీ అమ్మాయిలు నిజంగా అద్భుతమైన డ్యాన్స్‌తో ఆకట్టుకున్నారు.
ఈ వీడియోను నటాలియాడెగోవా అనే ఖాతా ద్వారా ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియోను షేర్ చేశారు. వార్తలు రాసే సమయానికి 1200 మందికి పైగా లైక్ చేశారు. లక్షల మంది ఈ వీడియోని వీక్షించారు. భారతీయ యూజర్లతో పాటు విదేశీ యూజర్లు కూడా ఈ వీడియోను బాగా లైక్ చేస్తున్నారు. ‘పుష్ప: ది రైజ్’ డిసెంబర్ 8న రష్యాలో విడుదల కానుంది. దీంతో ఇప్పటికే అక్కడ ఈ సినిమా పాటలు, రీల్స్‌తో దూసుకపోతుంది.
మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..