Watch Video: అన్న కోసం తల్లితో గొడవపడిన చిన్నారి.. వీడియో చూస్తే ఫిదా అవ్వాల్సిందే..

Venkata Chari

Venkata Chari |

Updated on: Dec 04, 2022 | 6:30 AM

Viral Video: అన్నదమ్ముల అనుబంధంలానే అన్నాచెళ్లళ్ల అనుబంధం కూడా ఎంతో గొప్పగా ఉంటుంది. ఇక చిన్నతనంలో ఒకరితో ఒకరు అల్లరి చేసిన వీడియోలు ఎన్నో నెట్టింట్లో కనిపిస్తుంటాయి.

Watch Video: అన్న కోసం తల్లితో గొడవపడిన చిన్నారి.. వీడియో చూస్తే ఫిదా అవ్వాల్సిందే..
Baby Viral Video

Trending Video: ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో ఏ చిన్న విషయం జరిగినా.. అందరికీ తెలిసిపోతుంది. వీడియోల రూపంలో నెట్టింట్లో ప్రత్యక్షమవుతూనే ఉంటాయి. ఇలాంటి వీడియోలు ఎన్నిసార్లు చూసిన ఇంకా, ఇంకా చూడాలని అనిపిస్తూనే ఉంటాయి. అలాంటి వీడియోనే ఒకటి నెట్టింట్లో తెగ హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియోలో ఓ చిన్నారి తన సోదరుడిపై ఎనలేని ప్రేమను చూపిస్తోంది. తన సోదరుడిని రక్షించడానికి తల్లితో పోరాడుతూ కనిపిస్తుంది. సోదరుడిని కొడుతోన్న అమ్మ నుంచి రక్షించడానికి చేసిన ప్రయత్నం చూస్తే తెగ ముచ్చటేస్తుంది.

అన్నదమ్ముల అనుబంధంలానే అన్నాచెళ్లళ్ల అనుబంధం కూడా ఎంతో గొప్పగా ఉంటుంది. ఇక చిన్నతనంలో ఒకరితో ఒకరు అల్లరి చేసిన వీడియోలు ఎన్నో నెట్టింట్లో కనిపిస్తుంటాయి. వాటిలో ఈ వీడియో కూడా ఒకటి.

ఇవి కూడా చదవండి

వైరల్ వీడియో ఇక్కడ చూడండి..

వైరల్ అవుతున్న వీడియోలో, ఏదో తప్పు కారణంగా తల్లి తన కొడుకును కొట్టడం మీరు చూడొచ్చు. ఇంతలో, పక్కనే నిలబడి ఉన్న చిన్నారికి ఆ సీన్ చూసి తెగ కోపం వస్తుంది. ఆమె తల్లిపై కోపంగా ఉంటుంది. వీడియోలో, చిన్నారి ఛోడ్.. ఛోడ్ అని చెప్పడం వినబడుతుంది. అయినప్పటికీ, తల్లి ఆ అబ్బాయిని వదలదు. అలాగే కొడుతూ ఉంటుంది. ఆ చిన్నారి తన తల్లితో గొడవపడుతూ తన సోదరున్ని కాపాడింది. చిన్నారి ప్రదర్శించిన తెగువను చూసి తల్లి కూడా మురిసిపోయి, ముద్దాడుతుంది. ఈమె చూపిన తెగువను చూసి నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు.

ఈ వీడియో @Gulzar_sahab అనే ఖాతా నెట్టింట్లో షేర్ అయింది. ‘అన్న, చెళ్లి ప్రేమ ఎప్పటికీ తగ్గదు..’ అనే క్యాప్షన్‌తో ఈ వీడియోని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. వార్త రాసే సమయానికి, 10,000 మందికి పైగా ప్రజలు వీడియోను వీక్షించారు. అలాగే చిన్నారి ప్రేమకు ఫిదా అయిన వారంతా కామెంట్లు చేశారు. ‘నిజంగా, సోదరుడు, సోదరి మధ్య సంబంధం చాలా అందమైనది’ అంటూ చాలామంది కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu