AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Housework and Women: ఇంటి పనులను భార్య భర్తలు కలిసి చేయడం వల్ల ఎన్ని ప్రయోజనాలో.. ఆర్టికల్ చదివినాక ఓ సారి పాటించి చూడండి, మీకే తెలుస్తాయి..

ఎప్పటి నుంచో ఇంటిపని అనేది గృహిణులే చేయవలసిన పని అనే భావన కుటుంబంలోనూ, సమాజంలోనూ పాతుకుపోయింది. అయితే భార్యాభర్తలిద్దరూ బయట పనిచేసి వచ్చి కుటుంబాన్ని నడుపుకోవాల్సిన..

Housework and Women: ఇంటి పనులను భార్య భర్తలు కలిసి చేయడం వల్ల ఎన్ని ప్రయోజనాలో.. ఆర్టికల్ చదివినాక ఓ సారి పాటించి చూడండి, మీకే తెలుస్తాయి..
Couple Working Together
శివలీల గోపి తుల్వా
|

Updated on: Dec 04, 2022 | 7:27 AM

Share

ఎప్పటి నుంచో ఇంటిపని అనేది గృహిణులే చేయవలసిన పని అనే భావన కుటుంబంలోనూ, సమాజంలోనూ పాతుకుపోయింది. అయితే భార్యాభర్తలిద్దరూ బయట పనిచేసి వచ్చి కుటుంబాన్ని నడుపుకోవాల్సిన అవసరం నేటి కాలంలో ఎక్కువగా ఉంది. అలాగే చిన్న కుటుంబాలే ఉన్నందున భార్యాభర్తలు ఇంటి పనుల్లో ఒకరికొకరు సహకరించుకుంటేనే దాంపత్యంలో ప్రేమ చిగురిస్తుంది.. జీవితం ముందుకు  సాగుతుంది. నేటి రోజుల్లో వివాహ బంధం సంతోషకరంగా ఉండడం కోసం, పరస్పర నమ్మకంతో పాటు ఇంటి నిర్వహణలో పాలు పంచుకోవడం అత్యవసరం. భార్య ఏదైనా పని చేస్తుంటే భర్త తప్పక వెళ్లి తోచినంత సాయం చేయాలి. కనీస సహాయం చేస్తేనే  పని భారం తమపైనే పడిందని భావనకు వారు లోనవరు. ఈ పని ఆడవారే చేయాలి.. ఇది మగవారు చేయకూడదని ఎక్కడా లేదా ఎవరూ చెప్పలేదు. ఇంకా సొంత పనులను చేసుకునే సమయంలో, విషయంలో మొహమాటం ఉండకపోవడమే మేలు. భార్య పనిలో భర్త, భర్త పనిలో భార్య.. ఇలా ఒకరికొకరు పరస్పరం చేదోడువాదోడుగా సహకరించుకుని ముందుకు సాగాలి.

ఇంటి పనిలో సహాయం చేయడానికి ఎందుకు అయిష్టత..?

భర్త పనికి వెళ్లి.. భార్య ఇంటి బాధ్యతలను భుజానికెత్తుకుంటే, భర్త ఇంటి పనిలో ఆమెకు సహాయం చేయడంలో తప్పు ఏమిటి..? ఇంటిపనులు చేస్తే ఇతరులు ఏమనుకుంటారో అనే భావన చాలా మంది భర్తలకు ఉంటుంది. చాలా మంది టీవీ ముందు కూర్చోవడానికి లేదా భార్య అదే పని చేస్తున్నట్టుగా మొబైల్ ఫోన్ పట్టుకోవడానికి కారణం ఇదే. కానీ, మీ ఈ ప్రవర్తన భార్య మనసుపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసా..? ఆమె మీపై కోపం తెచ్చుకోవచ్చు ఇంకా మీరు ఆమెను పట్టించుకోవడం లేదని భావించవచ్చు. అలాంటి భావాలు వివాహం బంధంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి.

ఇవి కూడా చదవండి

భర్త తన భార్యకు ఇంటి పనులలో సహాయం చేస్తేనే వారి వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. అలా సహాయం చేసుకోవడం వల్ల రిలేషన్ షిప్ లో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసా..?

  • ప్రేమ పెరుగుతుంది: భార్యకు భర్తపై ప్రేమను పెంచడంలో అతను ఇంటి పనిలో చేసే సహాయం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. తన భర్త తనను ఎంతగా ప్రేమిస్తున్నాడో, పట్టించుకుంటున్నాడో భార్యకు అర్థమవుతుంది. దీనివల్ల ఇద్దరూ ఒకరినొకరు బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.
  •  బంధం బలపడుతుంది: భర్త తన కష్టాలను భుజానికెత్తుకుంటాడనే నమ్మకంతో భార్య ఉంటుంది. భర్త తన భార్యకు సాయం చేయడం వల్ల అతనిపై ఆమెకున్న నమ్మకాన్ని మరింతగా బలపరుస్తుంది. అంతేకాకుండా తన లక్ష్యాలకు, కలలకు భర్త వెన్నుదన్నుగా నిలుస్తాడన్న విశ్వాసం కూడా ఆమెలో పుడుతుంది.
  •  అపార్థాలు తగ్గుతాయి: భార్యపై భర్తకు లేదా భార్యపై భర్తకు కొన్ని అపోహలు ఉంటాయి. కొన్ని పరిస్థితులు, సంఘటనల కారణంగా ఈ భావాలు తలెత్తవచ్చు. అయితే వంట చేయడం, బట్టలు ఆరబెట్టడం వంటి కొన్ని పనులు కలిసి చేయడం వల్ల ఇద్దరి మధ్య అనుకూలత పెరుగుతుంది. ఇద్దరి మధ్య మనస్పర్థలు తొలగిపోయే అవకాశం ఉంది.
  •  భావాలను పంచుకునే సమయం: రెండూ పంచుకున్నప్పుడు పనులు వేగంగా పూర్తవుతాయి. మిగిలిన సమయాల్లో ఇద్దరూ కలిసి కూర్చుని కబుర్లు చెప్పుకోవచ్చు, టీవీ చూడొచ్చు, మనసుకు విశ్రాంతినిచ్చే కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. వివిధ అంశాల గురించి మాట్లాడటానికి మరియు భావాలను పంచుకోవడానికి సమయం ఉంటుంది.
  •  పరస్పర గౌరవ భావన: ఈ పరస్పర ప్రేమ కారణంగా, బంధం పెరుగుతుంది మరియు ఇద్దరి మధ్య గౌరవ భావన కూడా పుడుతుంది. ఒకరి అభిప్రాయాన్ని మరొకరు గౌరవించడం ప్రారంభిస్తారు.
  •  ఇంటిపని మహిళలకే పరిమితమనే భావన నెలకొంది. కానీ, బయట పని చేస్తూ కుటుంబాన్ని పోషించే భార్య బాధ్యతలను పంచుకోవడం భర్త బాధ్యత కాదా? భార్యాభర్తలు ఇంటిపనులు పంచుకోవడం వల్ల దాంపత్యంలో సామరస్యం పెరుగుతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం..