AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Signs of Stress: మాన‌సిక ఒత్తిడి త‌గ్గించుకోండిలా..! ఈ 5 చిట్కాలు మీకు ఉపశమనం కలిగిస్తాయి…

ఎక్కువ కాలం పాటు ఒత్తిడికి గురికావడం వల్ల శరీరంపై తీవ్ర ప్రతికూల ప్రభావాలు ఉంటాయి. అది శారీరకమైనా, భావోద్వేగమైనా లేదా మానసికమైనా, ఒత్తిడికి దారి తీస్తాయి. ఈ పరిణామాలపై శ్రద్ధ చూపకపోతే

Signs of Stress: మాన‌సిక ఒత్తిడి త‌గ్గించుకోండిలా..! ఈ 5 చిట్కాలు మీకు ఉపశమనం కలిగిస్తాయి...
Stress
Jyothi Gadda
|

Updated on: Dec 06, 2022 | 8:24 AM

Share

ఒత్తిడి.. ఇది అందరినీ అనేక అనారోగ్య సమస్యల్లోకి నెట్టేస్తుంది. ఈ రోజుల్లో వివిధ కారణాల వల్ల ప్రజలలో ఒత్తిడి, అధిక రక్తపోటు పెరుగుతోంది. దీని కారణంగా చాలా మంది డిప్రెషన్‌కు గురవుతున్నారు. ఇది వారి మొత్తం కుటుంబాన్ని ప్రభావితం చేస్తుంది. అయితే ఇప్పటికీ సమాజంలో చాలా మందికి ఒత్తిడిపై సరైన అవగాహన లేకపోవటం ప్రమాద తీవ్రతను పెంచుతోంది. అధిక రక్తపోటు కారణంగా చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారంటూ ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎక్కువ కాలం పాటు ఒత్తిడికి గురికావడం వల్ల శరీరంపై తీవ్ర ప్రతికూల ప్రభావాలు ఉంటాయి. అది శారీరకమైనా, భావోద్వేగమైనా లేదా మానసికమైనా, ఒత్తిడికి దారి తీస్తాయి. ఈ పరిణామాలపై శ్రద్ధ చూపకపోతే చాలా భయంకరమైనవిగా మారుతాయంటున్నారు. ఈ సమస్య రాకుండా ఉండాలంటే మీ జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవాలి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మీకు కలత లేదా ఒత్తిడి, కోపం లేదా ఉత్సాహంగా అనిపించినప్పుడు 3-4 సార్లు లోతైన శ్వాస తీసుకోండి. ఆ తరువాత, మెట్లు 2-3 సార్లు పైకి క్రిందికి ఎక్కి దిగండి. మీకు మెట్లు ఎక్కడం సమస్యగా ఉంటే కాస్త వాకింగ్‌ చేసినా కూడా మంచిదే. దీంతో చికాకులు తొలగిపోయి మానసిక ప్రశాంతత లభిస్తుంది.

మంచి ఫిట్‌నెస్ కోసం ప్రతిరోజూ 7-8 గంటల నిద్ర అవసరం. దీని కంటే తక్కువ నిద్రపోవడం వల్ల రోజంతా మీ శరీరం అలసిపోతుంది. ఇది మీ మనస్సు, కళ్ళను కూడా ప్రభావితం చేస్తుంది. దీని వల్ల మానసిక ఒత్తిడికి కూడా గురికావాల్సి వస్తుంది.

కోపం ఎక్కువగా ఉన్నవారు ఉప్పు తీసుకోవడం తగ్గించాలి. ఎందుకంటే ఎక్కువ ఉప్పు తినడం వల్ల రక్తపోటు పెరుగుతుంది. ఇది చిరాకు, కోపం లేదా ఒత్తిడికి దారితీస్తుంది. దీని కారణంగా, గుండెపోటు ప్రమాదం కూడా పెరుగుతుంది. కాబట్టి వీలైనంత వరకు ఉప్పు తీసుకోవడం తగ్గించండి.

ఇవి కూడా చదవండి

పని నుండి కొన్ని రోజులు సెలవు తీసుకుని, ఒత్తిడిని తగ్గించుకోవడానికి మీ కుటుంబంతో కలిసి బయటకు వెళ్లండి. ఇది శరీరం, మనస్సు రెండింటినీ రిలాక్స్ చేస్తుంది. ఒత్తిడి స్థాయిలను తగ్గిస్తుంది. దాంతో పనికి కొత్త శక్తి వస్తుంది.

ఒంటరిగా జీవించడానికి ఇష్టపడే వ్యక్తులు ఒత్తిడికి గురవుతారు. అలాంటి వ్యక్తులు తమ మాటలను ఇతరులతో సులభంగా పంచుకోలేరు. ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి, మీ సోషల్ నెట్‌వర్కింగ్‌ను పెంచుకోండి మరియు మీ స్నేహితులు, పరిచయస్తులను కలవడం ప్రారంభించండి. ఇది మీ ఒంటరితనం, ఒత్తిడి రెండింటినీ తొలగిస్తుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి