Cute video: అందమైన పులిపిల్ల చేసిన అల్లరితో తల్లికి ముచ్చెమటలు .. ఫన్నీ వీడియో చూస్తే పొట్ట చెక్కలే..

తాజాగా అలాంటిదే పాత వీడియో ఒకటి సోషల్ మీడియాలో మళ్లీ వైరల్‌ అవుతోంది. ఇటీవలి ట్విట్టర్‌లో షేర్‌ చేయబడ్డ ఈ వీడియోలో తెల్లటి పులి పిల్ల ఒకటి తన తల్లి చుట్టూ తిరుగుతూ ఆటపట్టిస్తున్న దృశ్యం అందరినీ ఆకట్టుకుంటోంది.

Cute video: అందమైన పులిపిల్ల చేసిన అల్లరితో తల్లికి ముచ్చెమటలు .. ఫన్నీ వీడియో చూస్తే పొట్ట చెక్కలే..
Tiger Cub
Follow us
Jyothi Gadda

|

Updated on: Dec 05, 2022 | 1:54 PM

జంతువుల వీడియోలు చాలా అందంగా,ఫన్నీగా ఉంటాయి. ఇంటర్నెట్‌లో వీక్షకుల హృదయాలను గెలుచుకుంటాయి. సోషల్ మీడియా పుణ్యమా అని చాలా రకాల జంతువులకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. అందులో కొన్ని సోషల్ మీడియా వినియోగదారులను దిగ్భ్రాంతి కలిగిస్తే.. మరికొన్ని నవ్వు పుట్టించే విధంగా ఉంటున్నాయి. ఎక్కువగా సోషల్ మీడియాలో విచిత్రమైన వీడియోలు, జంతువులు, పాములకు సంబంధించిన వీడియోలు చెక్కర్లు కొడుతున్నాయి. తాజాగా అలాంటిదే పాత వీడియో ఒకటి సోషల్ మీడియాలో మళ్లీ వైరల్‌ అవుతోంది. ఇటీవలి ట్విట్టర్‌లో షేర్‌ చేయబడ్డ ఈ వీడియోలో తెల్లటి పులి పిల్ల ఒకటి తన తల్లి చుట్టూ తిరుగుతూ ఆటపట్టిస్తున్న దృశ్యం అందరినీ ఆకట్టుకుంటోంది. కానీ, ఆ తల్లి పులికి మాత్రం షాక్‌ తగిలినంత పనైంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో రాయల్ బెంగాల్ జాతికి చెందిన తెల్లపులి.. దాని పిల్ల చేసిన పనితో దెబ్బకు దడుసుకుంది. తల్లి ఎన్‌క్లోజర్‌ బయట ఏదో తింటూ ఉండగా.. వెనుక నుంచి ఒక్కసారిగా పులిపిల్ల వచ్చింది. నడుస్తూ కాకుండా గది లోపలి నుంచి ఎగిరి తల్లి ముందు దూకింది. దాంతో తనపై ఏదో దాడి చేస్తుందనుకుని తల్లి ఉలిక్కిపడింది.

ఇవి కూడా చదవండి

అయితే, తల్లి భయంతో ఉలిక్కిపడి కింద పడిపోవడం చూసి పిల్లపులి కూడా భయపడింది. రెండడుగులు వెనక్కి వేసింది. తర్వాత తల్లికి కోపం వచ్చిందని గ్రహించి ఏమీ ఎరుగనట్టు మెల్లగా పక్కకు వెళ్లిపోయింది. కేవలం మూడు సెకన్‌ల నిడివిగల ఈ వీడియో చూసిన నెటిజన్లు కడుపుబ్బ నవ్వుకుంటున్నారు.. పిల్లల అల్లరి ఎక్కడైనా ఒకేలా ఉంటుందంటూ నెటిజన్లు విపరీతంగా కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
పాన్ కార్డు 2.0 అంటే ఏంటి? పాత కార్డు పని చేయదా? అసలు నిజం ఇదే
పాన్ కార్డు 2.0 అంటే ఏంటి? పాత కార్డు పని చేయదా? అసలు నిజం ఇదే
బ్యాంకు లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే లోన్ భారం వారిదే..!
బ్యాంకు లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే లోన్ భారం వారిదే..!