Peanuts: చల్లటి చలిలో వేడి వేడి పల్లీలు తింటున్నారా..? అయితే ప్రమాదం పొంచివున్నట్టే..! జర భద్రం..

మీకు కూడా చలికాలంలో రోజంతా వేరుశెనగలు తినే అలవాటు ఉంటే, ఇప్పుడు మేల్కొనండి.. అవును, ఈ అలవాటును మీరు వెంటనే మానేయడం మంచిది. ఎందుకంటే..

Peanuts: చల్లటి చలిలో వేడి వేడి పల్లీలు తింటున్నారా..? అయితే ప్రమాదం పొంచివున్నట్టే..! జర భద్రం..
Peanuts
Follow us
Jyothi Gadda

|

Updated on: Dec 05, 2022 | 12:41 PM

చాలా మంది శీతాకాలంలో సూర్యరశ్మిని ఇష్టపడతారు. అంతే కాదు.. ఎండలో నిలబడి వేరుశెనగ తినడానికి కూడా చాలా మంది ఇష్టపడుతుంటారు. శీతాకాలపు ఉత్తమ ఆహారాలలో వేరుశెనగ మొదటి స్థానంలో ఉంది. ఎందుకంటే ఇందులో చాలా పోషకాలు ఉన్నాయి. ఇది ఆరోగ్యానికి అద్భుతమైనదిగా పరిగణించబడుతుంది. అయితే మీకు కూడా చలికాలంలో రోజంతా వేరుశెనగలు తినే అలవాటు ఉంటే, ఇప్పుడు మేల్కొనండి.. అవును, ఈ అలవాటును మీరు వెంటనే మానేయడం మంచిది. ఎందుకంటే మీరు ఒకేసారి అవసరమైన దానికంటే ఎక్కువగా వేరుశెనగలు తింటే మీరు అనేక కడుపు సంబంధిత సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు అపానవాయువు, అతిసారం, మలబద్ధకం మొదలైనవి. అంతే కాకుండా వేరుశెనగ తినడం వల్ల పక్షవాతం, గుండెపోటు, అధిక రక్తపోటు వంటి సమస్యలు కూడా వస్తాయి.

చలికాలంలో ఒకేసారి ఎక్కువ వేరుశెనగలు తినకండి.. రోజుకు ఒక పిడికెడు వేరుశెనగలు మాత్రమే తినాలి. వేరుశెనగ తినడానికి ఉత్తమ సమయం పగలు లేదంటే సాయంత్రం. మీరు వేరుశెనగలను ఎక్కువగా తింటే అది శరీరంలో అలెర్జీ సమస్యలను కలిగిస్తుంది. మలబద్ధకం, విరేచనాలు, కడుపు ఉబ్బరం వంటి అవకాశాలను కూడా పెంచుతుంది. చలికాలంలో వేరుశెనగలు తినడం, మీరు బరువు పెరగటానికి సంబంధం లేదని మీరు అనుకున్నట్టయితే పొరపడినట్టే. కనీసం ఒక గుప్పెడు వేరుశెనగల్లో 170 కేలరీలు ఉంటాయి. కాబట్టి వీలైనంత వరకు ఒకే రోజులో ఎక్కువ వేరుశెనగలను తీసుకోకుండా ఉండండి.

అధిక రక్తపోటు వంటి సమస్య ఉండవచ్చు! చలికాలంలో చౌకగా లభించే పప్పుల్లో వేరుశనగ ఒకటి. కానీ వాటిలో భాస్వరం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, మీరు వాటిని ఎక్కువగా తింటే మీ శరీరంలో పోషకాలు లోపించే ప్రమాదం ఉంది. మన శరీరంలోని అనేక భాగాలకు అలెర్జీలు వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. పల్లీల వల్ల దురద, శ్వాస సమస్యలు, డయేరియా వచ్చే అవకాశాలు అయితే ఉంటాయని సమాచారం. వేరుశనగ వేడి పదార్థం. మీ శరీరంలో కూడా ఇటువంటి సమస్యలను ఎదుర్కొంటే, వెంటనే వేరుశెనగ తినడం మానేయండి. లేదంటే వినియోగాన్ని తగ్గించండి. ఏదైనా ఎక్కువగా తినడం వల్ల దాంతో మన శరీరంపై చెడు ప్రభావం పడుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?