Benefits of Dates: నానబెట్టిన ఖర్జూరాలతో పురుషుల్లో అవి మరింత పెంపు..!
పోషకాలు పుష్కలంగా ఉండే ఖర్జూరం అనేక వ్యాధులను దూరం చేస్తుంది. ఇందులో ఉండే పీచు జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలను దూరం చేస్తుంది..
పోషకాలు పుష్కలంగా ఉండే ఖర్జూరం అనేక వ్యాధులను దూరం చేస్తుంది. ఇందులో ఉండే పీచు జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలను దూరం చేస్తుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఇది గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. బ్లడ్ షుగర్ కూడా నియంత్రణల ఉంటుంది. రోజువారీ ఖర్జూరం బలాన్ని ఇస్తుంది. దీనిని ఆరోగ్య నిధి అని కూడా పిలుస్తారు. ఇందులో ఉండే సహజమైన తీపి శరీరానికి మేలు చేస్తుంది. కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, కార్బోహైడ్రేట్లు, ఫైబర్, ప్రోటీన్, విటమిన్లు, జింక్, మాంగనీస్ వంటి అనేక పోషకాలు ఖర్జూరాలలో కనిపిస్తాయి. ఇందులో ఉండే ఐరన్ శరీరంలో రక్తాన్ని పెంచడంలో సహాయపడుతుంది.
ఖర్జూరాలతో ఉపయోగాలు
- చెడు ఆహారపు అలవాట్లు, జీవనశైలి సరిగ్గా లేకపోవడం కారణంగా ఈ రోజుల్లో పురుషులలో అనేక లైంగిక సమస్యలు వస్తున్నాయి. ఈ కారణంగా వారు తమ వైవాహిక జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కొంటారు. రోజూ పాలతో వండిన 4 ఖర్జూరాలను తినడం వల్ల శరీరంలో బలం పెరుగుతుందని, స్పెర్మ్ కౌంట్ కూడా పెరుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
- ప్రతి రోజూ ఉదయం ఖాళీ కడుపుతో ఖర్జూరాన్ని తినే వ్యక్తికి జీర్ణక్రియకు సంబంధించిన ఎలాంటి సమస్యలు ఉండవు. ఇది అజీర్ణం, కడుపు నొప్పి, గ్యాస్, మలబద్ధకం నుండి ఉపశమనం ఇస్తుంది.
- ఇంట్లో పిల్లలు కడుపు సమస్యతో బాధపడుతుంటే ప్రతిరోజూ 2 నుండి 3 నానబెట్టిన ఖర్జూరాన్ని ఇవ్వండి ఎంతో ప్రయోజనం ఉంటుంది.
- ఖర్జూరం శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. రోజూ 4 ఖర్జూరాలను పాలతో కలిపి తింటే శరీర బరువు వేగంగా పెరుగుతుంది.
- పైల్స్ సమస్యతో బాధపడేవారు కూడా దీనిని తినవచ్చు. ఇది మానసిక ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అంతేకాకుండా ఒత్తిడిని తగ్గిస్తుంది.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..