Hair Care: ఒత్తయిన, పొడవాటి జుట్టు కోసం ఈ 3 పదార్థాలను నీటిలో కలిపి తలకు పట్టించండి..

ఈ నీటితో మీ జుట్టును వారానికి రెండు లేదా మూడు సార్లు కడగాలి. ఇలా చేయడం వల్ల వెంట్రుకలు పెరగడమే కాకుండా మూలాలకు బలం చేకూరుతుంది.

Hair Care: ఒత్తయిన, పొడవాటి జుట్టు కోసం ఈ 3 పదార్థాలను నీటిలో కలిపి తలకు పట్టించండి..
Hair Care Tips
Follow us
Jyothi Gadda

|

Updated on: Dec 05, 2022 | 10:14 AM

చలికాలంలో జుట్టు సంరక్షణ : సాధారణంగా జుట్టు పెరగడానికి చాలా రకాలుగా ప్రయత్నిస్తుంటారు. అందులో భాగంగా తలస్నానం చేసే నీటిలో కొన్ని పదార్థాలను కలిపి జుట్టును కడగడం ద్వారా జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. ఇది జుట్టు దెబ్బతినకుండా కాపాడుతుంది. జుట్టు పెరుగుదల, సంరక్షణ కోసం పాటించాల్సిన కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుసుకుందాం…

అవిసె గింజలు: అవిసె గింజల నీటిలో విటమిన్ ఇ, ప్రోటీన్ రెండూ పుష్కలంగా ఉంటాయి. కాబట్టి అవిసె గింజల నీటితో జుట్టును కడిగితే, జుట్టు పెరుగుతుంది. ఇందుకోసం మీరు 2 టేబుల్ స్పూన్ల అవిసె గింజలను రెండు గ్లాసుల నీటిలో నానబెట్టి, దానిని ఫిల్టర్ చేసి మరుసటి రోజు మీ జుట్టును కడగాలి. ఇలా చేయడం వల్ల అనేక జుట్టు సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.

నిమ్మకాయ : నిమ్మకాయ నీటిని ఉపయోగించడం వల్ల జుట్టు పెరుగుదల బాగుంటుంది. నీటిలో నిమ్మకాయ రసం పిండి.. ఈ నీటితో మీ జుట్టును వారానికి రెండు లేదా మూడు సార్లు కడగాలి. ఇలా చేయడం వల్ల వెంట్రుకలు పెరగడమే కాకుండా మూలాలకు బలం చేకూరుతుంది.

ఇవి కూడా చదవండి

బియ్యం కడిగిన నీరు: బియ్యం కడిగిన నీరు జుట్టుకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి బియ్యాన్ని నానబెట్టండి. తర్వాత ఆ నీటితో మీ జుట్టును కడగాలి. ఇది జుట్టును బలోపేతం చేయడమే కాకుండా జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంలో కూడా ఉపయోగపడుతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఏపీలో మరో ఆధ్యాత్మిక కేంద్రం.. రూ.300 కోట్లతో భారీ ఏర్పాట్లు
ఏపీలో మరో ఆధ్యాత్మిక కేంద్రం.. రూ.300 కోట్లతో భారీ ఏర్పాట్లు
భారత అమ్ములపొదలోకి అత్యాధునిక మిస్సైళ్లు!
భారత అమ్ములపొదలోకి అత్యాధునిక మిస్సైళ్లు!
మీకు ఆధార్‌ కార్డ్‌ ఉందా.? వెంటనే ఈ పనిచేయండి..
మీకు ఆధార్‌ కార్డ్‌ ఉందా.? వెంటనే ఈ పనిచేయండి..
14 ఏళ్లకే హీరోయిన్‏గా ఏంట్రీ..చిరంజీవి అలా పిలుస్తూ ఏడిపించేవారు.
14 ఏళ్లకే హీరోయిన్‏గా ఏంట్రీ..చిరంజీవి అలా పిలుస్తూ ఏడిపించేవారు.
చివరిగా.. ట్రంప్‌ను ఓ కోర్కె కోరిన జో బిడెన్‌..!
చివరిగా.. ట్రంప్‌ను ఓ కోర్కె కోరిన జో బిడెన్‌..!
చలికాలం సమస్యలకు కొబ్బరి నూనెతో చెక్‌.. ముఖానికి అప్లై చేస్తే..
చలికాలం సమస్యలకు కొబ్బరి నూనెతో చెక్‌.. ముఖానికి అప్లై చేస్తే..
ఈ పూలను వాడితే ముసలితనాన్ని వాయిదా వేయొచ్చు.. అందం అమాంతంగాపెరిగి
ఈ పూలను వాడితే ముసలితనాన్ని వాయిదా వేయొచ్చు.. అందం అమాంతంగాపెరిగి
అమెరికాలో తులసీ గబ్బార్డ్‌కు కీలక బాధ్యతలు.. ఎవరో తెలుసా?
అమెరికాలో తులసీ గబ్బార్డ్‌కు కీలక బాధ్యతలు.. ఎవరో తెలుసా?
బంగారం కొనేవారికి శుభవార్త..! ధర ఎంతో తెలిస్తే ఎగిరి గంతేస్తారు..
బంగారం కొనేవారికి శుభవార్త..! ధర ఎంతో తెలిస్తే ఎగిరి గంతేస్తారు..
బామ్మ గెటప్‏లో బిగ్‏బాస్ ముద్దుగుమ్మ.. ఇట్టా మారిపోయిందేంట్రా..
బామ్మ గెటప్‏లో బిగ్‏బాస్ ముద్దుగుమ్మ.. ఇట్టా మారిపోయిందేంట్రా..