AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Womens Health Tips: ఈ 3 రకాల జ్యూస్‌లు మహిళల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది..

ముఖ్యంగా 30 సంవత్సరాల తర్వాత, మహిళల శరీర కణాలు మందగించడం ప్రారంభిస్తాయి. ఇది కండరాలు, కాలేయం, మూత్రపిండాలు వంటి అనేక అవయవాలను ప్రభావితం చేస్తుంది. ఎముకలు బలహీనంగా మారితే రోజువారీ జీవితంలో సాధారణ కార్యకలాపాలలో ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉంటుంది.

Womens Health Tips: ఈ 3 రకాల జ్యూస్‌లు మహిళల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది..
Womens Health Tips
Jyothi Gadda
|

Updated on: Dec 05, 2022 | 9:07 AM

Share

ఒక మహిళ జీవితం కష్టాలతో నిండి ఉంటుంది. ముఖ్యంగా ఆమె ఉద్యోగం చేసే మహిళ అయితే, ఆఫీసుతో పాటు ఇంటి బాధ్యతలను నిర్వహించడం ఆమెకు సవాలుగా మారుతుంది. ఈ బిజీ లైఫ్ స్టైల్ వల్ల మహిళలు తమ ఆరోగ్యం గురించి పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా 30 సంవత్సరాల తర్వాత, మహిళల శరీర కణాలు మందగించడం ప్రారంభిస్తాయి. ఇది కండరాలు, కాలేయం, మూత్రపిండాలు వంటి అనేక అవయవాలను ప్రభావితం చేస్తుంది. ఎముకలు బలహీనంగా మారితే రోజువారీ జీవితంలో సాధారణ కార్యకలాపాలలో ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉంటుంది. కాబట్టి శరీరానికి శక్తినిచ్చే ఆహారం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అందుకోసం ఈరోజు కాస్త జ్యూస్ తీసుకొచ్చాం.. ఇలాంటి జ్యూస్‌లు మహిళ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

స్త్రీలు 3 రకాల జ్యూస్ తాగాలి.. మహిళలు సాధారణంగా తమ అందం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. చర్మం, జుట్టు సంరక్షణను జాగ్రత్తగా చూసుకోవాలి. దీని కోసం ఖరీదైన, రసాయన ఆధారిత ఉత్పత్తులను మాత్రమే ఉపయోగించాల్సిన అవసరం లేదు. కానీ అంతర్గత పోషకాల ద్వారా కూడా కూడా జుట్టు, చర్మానికి ప్రకాశాన్ని తెచ్చుకోవచ్చు. మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి మహిళలు ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం…

1. ఫ్రూట్ బ్లెండ్ జ్యూస్.. పండ్లు అనేక రకాల విటమిన్లు, ఖనిజాలను కలిగి ఉంటాయి. పండ్లు శరీరానికి, మెదడుకు ప్రయోజనం చేకూరుస్తాయి. ఇది గుండెపోటు వంటి ప్రమాదకరమైన గుండె జబ్బులను నివారిస్తుంది. దీనితో పాటు, ఇది కళ్ళు, చర్మం, జుట్టుకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

2. కొబ్బరి నీరు.. కొబ్బరి నీళ్ల వల్ల కలిగే ప్రయోజనాల గురించి మనందరికీ తెలుసు. కానీ, ప్రతి ఒక్కరూ దీనిని తమ రోజువారీ ఆహారంలో చేర్చుకోలేరు. కొబ్బరి నీళ్లు తాగడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. అదే సమయంలో చర్మ సంబంధిత సమస్యలు కనిపించవు. సాధారణంగా మనం బీచ్ వెకేషన్‌లకు వెళ్లినప్పుడు, ఈ నేచురల్ డ్రింక్ శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడంలో సహాయపడుతుంది. కాబట్టి మనం ఖచ్చితంగా ఆస్వాదిస్తాము.

3. కూరగాయల రసం.. తాజా కూరగాయలు ఎల్లప్పుడూ ఆరోగ్యానికి ప్రయోజనకరంగా పరిగణించబడతాయి. కొన్ని రకాల కూరగాయలతో తయారు చేసిన జ్యూస్‌లు తాగడం అలవాటు చేసుకోండి. దీంతో మీకు విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు, పొటాషియం, జింక్, కెరోటినాయిడ్స్ వంటి పోషకాలు శరీరానికి అందుతాయి. దీంతో అధిక రక్తపోటు, రక్తహీనత, చర్మ సమస్యలు వంటి సమస్యలు తొలగిపోతాయి.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
పంటి నొప్పితో హాస్పిటల్‌కి వెళ్లిన బాలిక.. ఎక్స్-రే చూస్తే..
పంటి నొప్పితో హాస్పిటల్‌కి వెళ్లిన బాలిక.. ఎక్స్-రే చూస్తే..
రూ.199 రీఛార్జ్‌తో ప్రతిరోజు 1.5GB డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్..
రూ.199 రీఛార్జ్‌తో ప్రతిరోజు 1.5GB డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్..
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతం ఎవరెస్ట్ కాదా? అసలు వాస్తవం ఏంటో
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతం ఎవరెస్ట్ కాదా? అసలు వాస్తవం ఏంటో
ఇండస్ట్రీ నుంచి ఎవ్వరూ సపోర్ట్ చేయలేదు..
ఇండస్ట్రీ నుంచి ఎవ్వరూ సపోర్ట్ చేయలేదు..
బెల్లం పానకంపై బొమ్మలు గీస్తూ.. రూ.62 లక్షలు దోచుకున్నారు..
బెల్లం పానకంపై బొమ్మలు గీస్తూ.. రూ.62 లక్షలు దోచుకున్నారు..
నెటిజన్లను కన్నీళ్లు పెట్టిస్తున్న జొమాటో ‘ఉమా’ రియల్ స్టోరీ!
నెటిజన్లను కన్నీళ్లు పెట్టిస్తున్న జొమాటో ‘ఉమా’ రియల్ స్టోరీ!
అమెరికాలో కూతురి పెళ్లి... ఆన్‌లైన్‌లో అక్షింతలు..!
అమెరికాలో కూతురి పెళ్లి... ఆన్‌లైన్‌లో అక్షింతలు..!
ప్రజావాణితో వెలిగిన రైతు జీవితం..25 ఏళ్ల కల నెరవేరి.. బీడు భూమిలో
ప్రజావాణితో వెలిగిన రైతు జీవితం..25 ఏళ్ల కల నెరవేరి.. బీడు భూమిలో
కోట్లు ఖర్చు పెట్టినా తగ్గని రోగాలను చిటికెలో మాయం చేసే నేచురల్ మ
కోట్లు ఖర్చు పెట్టినా తగ్గని రోగాలను చిటికెలో మాయం చేసే నేచురల్ మ
తుమ్మిడిహెట్టిపై తెలంగాణ మాస్టర్ ప్లాన్..!
తుమ్మిడిహెట్టిపై తెలంగాణ మాస్టర్ ప్లాన్..!