AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: ఫ్రిడ్జ్‌లో పెట్టే ఈ ఆహారపదార్థాలు అస్సలు తినకండి! ఇది అనారోగ్యానికి దారితీస్తుంది..

కొన్ని వస్తువులను ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల మన ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుంది. కొన్ని పదార్థాలైతే తమ స్వభావాన్ని కోల్పోవడమే కాదు.. విషంగా మారతాయి.

Health Tips: ఫ్రిడ్జ్‌లో పెట్టే ఈ ఆహారపదార్థాలు అస్సలు తినకండి! ఇది అనారోగ్యానికి దారితీస్తుంది..
Refrigerator Using
Jyothi Gadda
|

Updated on: Dec 05, 2022 | 7:29 AM

Share

ఈ రోజుల్లో రిఫ్రిజిరేటర్ దాదాపు ప్రతి ఇంట్లోనూ ఉంటుంది. ఫ్రిజ్ వాడకం ప్రధానంగా జ్యూస్, ఐస్ క్రీం వంటి వాటిని చల్లగా ఉంచుకోవడానికి ఉపయోగిస్తారు. ఇంకా అనేక కూరగాయలు, పండ్లు, ఇతర ఆహార పదార్థాలను నిల్వ పాడవకుండా నిల్వపెట్టుకోవటం కోసం వాడుతుంటారు. ఫ్రిజ్‌లో ఆహారం చల్లగా ఉంచడమే కాకుండా ఆహారం చెడిపోకుండా చేస్తుంది. ఏ ఆహార పదార్థమైనా చెడిపోకుండా ఉండాలంటే రెండో ఆలోచన లేకుండా ఫ్రిజ్‌లో ఉంచుతాం. కొన్ని వస్తువులను ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల మన ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుంది. కొన్ని పదార్థాలైతే తమ స్వభావాన్ని కోల్పోవడమే కాదు.. విషంగా మారతాయి. ఈ నేపథ్యంలో ఫ్రిజ్‌లో ఏయే ఆహార పదార్థాలను ఉంచకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.

మందులు : చాలా మందులను చల్లని ఉష్ణోగ్రతలో ఉంచాలని సూచిస్తుంటారు. అన్ని మందులను ఫ్రిజ్‌లో ఉంచుతారు. ఇటువంటి సలహా లేని మందులు, ఫ్రిజ్‌లో ఉంచితే హానికరం. డాక్టర్ సలహా లేకుండా ఇలా చేయడం మానుకోండి.

నూనె : నూనెను ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల నూనె రుచి పోతుంది. కొన్నిసార్లు అలాంటి నూనె కూడా ఘనీభవిస్తుంది. దానిపై ఒక ప్రత్యేక పొర వస్తుంది. ఇటువంటి నూనె ఆరోగ్యానికి హానికరం.

ఇవి కూడా చదవండి

కాఫీ : చాలా మంది కాఫీ ప్యాకెట్లను కూడా ఫ్రీజ్‌లో పెడుతుంటారు. కాఫీని ఫ్రిజ్‌లో ఉంచడం మంచిది కాదు. కాఫీ బీన్ పౌడర్‌ను ఫ్రిజ్‌లో పెట్టకూడదు. ఫ్రిజ్‌లో ఉండే తేమ కాఫీ పౌడర్‌ గట్టిగా మారుతుంది. రుచి కూడా కోల్పోతుంది. మీరు కాఫీ గింజలను నిల్వ చేయాలంనుకుంటే ఒక కంటైనర్లో పెట్టి గది ఉష్ణోగ్రతలో ఉంచండి.

అరటిపండు : చాలా మంది పండ్లను ఫ్రిజ్‌లో ఉంచుతారు.కానీ, ప్రతి పండును ఫ్రిజ్‌లో ఉంచడం సరికాదు. అరటిపండ్లను ఫ్రిజ్‌లో ఉంచడం మానుకోండి. అరటిపండ్లు ఫ్రిజ్‌లో ఉంచితే త్వరగా పాడవుతాయి. గడ్డకట్టిన అరటిపండు తినడం వల్ల జలుబు, జ్వరం వస్తుంది. ఇది నొప్పి కూడా కలిగిస్తుంది. అరటిపండ్లను ఫ్రిజ్‌లో ఉంచడం మానుకోండి.

మూలికలు : మనం అనేక రకాల మూలికలను ఉపయోగిస్తాము. తులసి, కరివేపాకు, అనేక ఇతర పదార్థాలు రోజువారీ ఆహారంలో ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని ఎక్కువ కాలం ఫ్రిజ్‌లో ఉంచవచ్చు. కానీ ఇలా చేయడం వల్ల వాటి ఔషధ గుణాలు నశిస్తాయి. ఈ వస్తువులను ఫ్రిజ్‌లో ఉంచవద్దు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ ఇక్కడ క్లిక్ చేయండి