AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అయ్యా బాబోయ్‌… కిలో బంగాళాదుంప ఖరీదు రూ.50వేలు.. ఎందుకంటే ఇది వెరీ వెరీ స్పెషలట..!

ఈ ఆలు ధర కిలో రూ.100 లేదా రూ.200ల రూపాయలో కాదు, కిలో ఆలుగడ్డ ధర రూ.50,000వేలు.. అంటే, మీరు ఒక కేజీ బంగాళదుంప ధరతో తులం బంగారం కొనుగోలు చేయవచ్చు.

అయ్యా బాబోయ్‌... కిలో బంగాళాదుంప ఖరీదు రూ.50వేలు.. ఎందుకంటే ఇది వెరీ వెరీ స్పెషలట..!
Le Bonnotte
Jyothi Gadda
|

Updated on: Dec 03, 2022 | 1:00 PM

Share

బంగాళాదుంపను సాధారణంగా కూరగాయలలో రారాజు అని పిలుస్తారు. బంగాళాదుంప ధర మార్కెట్లో తక్కువగానే ఉంటుంది. సీజన్‌ను బట్టి రూ.5 నుండి రూ.35 వరకు ఉంటుంది. అయితే ఇతర కూరగాయలతో పోలిస్తే బంగాళదుంప ధర చాలా తక్కువగానే ఉంటుంది, కానీ, ఈ రోజు మనం తెలుసుకోబోతున్నది అత్యంత ఖరీదైన ఒక రకమైన బంగాళాదుంప గురించి. ఈ ఆలు ధర కిలో రూ.100 లేదా రూ.200ల రూపాయలో కాదు, కిలో ఆలుగడ్డ ధర రూ.50,000వేలు.. అంటే, మీరు ఒక కేజీ బంగాళదుంప ధరతో తులం బంగారం కొనుగోలు చేయవచ్చు. ఇక అంత్యంత ఖరీదైన కూరగాయల విషయానికి వస్తే, ఈ బంగాళదుంప ఖచ్చితంగా ఆ జాబితాలో నెం.1 స్థానాన్ని ఆక్రమిస్తుంది అనటంలో అతిశయోక్తి లేదు.

ఈ అత్యంత ఖరీదైన బంగాళాదుంప పేరు లే బోనోట్. ఇది భారతదేశంలో కాకుండా ఫ్రాన్స్‌లో పండే బంగాళాదుంప జాతి. ఇది ఫ్రెంచ్ ద్వీపం ఐల్ డి నోయిర్‌మౌటియర్‌లో ప్రత్యేకంగా పెరుగుతుంది. ఈ బంగాళాదుంపను పండించడానికి ఒక ప్రత్యేక రకమైన ఇసుక నేలను ఉపయోగిస్తారు. దీనిని పెంచడానికి సముద్రపు పాచి ఎరువుగా ఉపయోగిస్తారు. లే బోనోట్ 50 చదరపు మీటర్ల భూమిలో మాత్రమే పెరుగుతుంది.

ఈ బంగాళదుంప అర కిలో 250 యూరోలు అంటే దాదాపు 22 వేల నుంచి 23 వేల రూపాయల వరకు ఉంటుంది. ఈ బంగాళదుంప ధర పెరుగుతూనే ఉంది. అయితే, ఇక్కడ మరో ఆశ్చరకర విషయం ఏంటంటే.. ఈ ఖరీదైన బంగాళాదుంప సంవత్సరానికి కేవలం10 రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ ఉప్పగా ఉండే బంగాళదుంపలు తరచుగా ఇంట్లో సలాడ్లు,సూప్‌లను తయారు చేయడానికి ఉపయోగిస్తారు. ఇది అనేక వ్యాధులపై ప్రభావాన్ని చూపుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఆ గడ్డి జ్యూస్ మోజులో పడిన ప్రజలు.. ఒక్కసారి తాగితే ఆగట్లేదుగా
ఆ గడ్డి జ్యూస్ మోజులో పడిన ప్రజలు.. ఒక్కసారి తాగితే ఆగట్లేదుగా
ఆ కవలల పెళ్లి చూసి అంతా మురిసిపోయారు.. కానీ 30 రోజుల్లోనే..
ఆ కవలల పెళ్లి చూసి అంతా మురిసిపోయారు.. కానీ 30 రోజుల్లోనే..
గుడ్ న్యూస్.. ధురంధర్ 2 ఇకపై తెలుగులోనూ చూడొచ్చు..
గుడ్ న్యూస్.. ధురంధర్ 2 ఇకపై తెలుగులోనూ చూడొచ్చు..
టీ20లో ఒక్కడే 14 సిక్సర్లు, 21 ఫోర్లతో ఏకంగా 193 పరుగులు
టీ20లో ఒక్కడే 14 సిక్సర్లు, 21 ఫోర్లతో ఏకంగా 193 పరుగులు
రంజాన్ వేళ భారీగా పెరిగిన చికెన్ ధరలు.. ఎంతంటే..?
రంజాన్ వేళ భారీగా పెరిగిన చికెన్ ధరలు.. ఎంతంటే..?
తిరుమల క్యూ లైన్లలో పాముల హల్చల్.. భయం గుప్పిట్లో భక్తులు!
తిరుమల క్యూ లైన్లలో పాముల హల్చల్.. భయం గుప్పిట్లో భక్తులు!
శ్రీవారి ప్రసాదాల కల్తీకి చెక్.. తిరుమలలో అత్యాధునిక ల్యాబ్
శ్రీవారి ప్రసాదాల కల్తీకి చెక్.. తిరుమలలో అత్యాధునిక ల్యాబ్
హైదరాబాద్‌లో ఉంటున్న ఉద్యోగులకు కేంద్రం శుభవార్త
హైదరాబాద్‌లో ఉంటున్న ఉద్యోగులకు కేంద్రం శుభవార్త
మీ వాష్ బేసిన్ పసుపు రంగులోకి మారిందా? డోంట్ వర్రీ.. ఇలా చేయండి!
మీ వాష్ బేసిన్ పసుపు రంగులోకి మారిందా? డోంట్ వర్రీ.. ఇలా చేయండి!
ఈ ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ రికార్డు ఎవరైనా బద్దలు కొడతారా?
ఈ ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ రికార్డు ఎవరైనా బద్దలు కొడతారా?