AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫిలిప్పీన్స్‌లో అగ్నిపర్వతం బద్ధలు.. 3 కి.మీ ఎత్తుకు బూడిద!

ఫిలిప్పీన్స్ లో మయోన్ అగ్నిపర్వతం ఒక్కసారిగా బద్దలైంది.  ఆరు నిమిషాలు కొనసాగిన పేలుడుతో భారీగా బూడిద, పొగ ఆకాశంలోకి ఎగసిపడ్డాయి. 3 కి.మీ ఎత్తు వరకు బూడిద మేఘాలు వ్యాపించాయి. గాలుల ప్రభావంతో బూడిద మేఘాలు నైరుతి దిశగా సమీప జనావాసాల వైపు కదిలాయి..

ఫిలిప్పీన్స్‌లో అగ్నిపర్వతం బద్ధలు.. 3 కి.మీ ఎత్తుకు బూడిద!
Mount Mayon Volcano Erupts For Nearly 6 Minutes In Philippines
Sharada V
|

Updated on: Oct 31, 2026 | 9:41 AM

Share

ఫిలిప్పీన్స్ లో మయోన్ అగ్నిపర్వతం ఒక్కసారిగా బద్దలైంది.  ఆరు నిమిషాలు కొనసాగిన పేలుడుతో భారీగా బూడిద, పొగ ఆకాశంలోకి ఎగసిపడ్డాయి. 3 కి.మీ ఎత్తు వరకు బూడిద మేఘాలు వ్యాపించాయి. గాలుల ప్రభావంతో బూడిద మేఘాలు నైరుతి దిశగా సమీప జనావాసాల వైపు కదిలాయి.

ఆరు నిమిషాలు భారీ విస్ఫోటనం

ఫిలిప్పీన్స్‌లోని మయోన్ అగ్నిపర్వతం శుక్రవారం ఒక్కసారిగా విస్ఫోటనం చెందింది. దాదాపు ఆరు నిమిషాల పాటు ఈ పేలుడు కొనసాగింది. ఈ ఘటనతో అగ్నిపర్వతం నుంచి వెలువడిన బూడిద దాదాపు 3 కిలోమీటర్ల ఎత్తుకు ఎగసింది. ఆ తర్వాత గాలుల ప్రభావంతో బూడిద మేఘాలు నైరుతి దిశగా సమీప జనావాసాల వైపు కదిలాయి. ఫిలిప్పీన్స్ అగ్నిపర్వత, భూకంప పరిశోధన సంస్థ (PHIVOLCS) ఐదు స్థాయిల హెచ్చరిక వ్యవస్థలో అలర్ట్ స్థాయిని 2 నుంచి 3కి పెంచింది. అగ్నిపర్వతం బిలం చుట్టూ ఆరు కిలోమీటర్ల పరిధిలో నివసిస్తున్న ప్రజలు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది.

లావా పట్ల అప్రమత్తం!

మయోన్ అగ్నిపర్వతంలో తొలి దశ శిలాద్రవ విస్ఫోటన ప్రక్రియ ప్రారంభమైందనీ రాబోయే రోజుల్లో లావా ప్రవహిస్తుందని అధికారులు హెచ్చరించారు. అగ్నిపర్వతం పైభాగం నుంచి  కిందికి నదిలా సాగే వేడి వాయువులు, బూడిద, రాళ్లతో లావా ప్రవాహం క్షణాల్లో అడ్డొచ్చిన నిర్మాణాలను తుడిచిపెట్టేస్తుందని ప్రజలను అప్రమత్తం చేసారు. అగ్నిపర్వతానికి సమీపంగా విమానాలు ప్రయాణించకుండా హెచ్చరికలు జారీ చేశారు.

భారీ తరలింపుల చరిత్ర ఉన్న మయోన్

సముద్ర మట్టానికి 2,462 మీటర్ల ఎత్తులో ఉన్న మయోన్ అగ్నిపర్వతం రాజధాని మనీలాకు ఆగ్నేయంగా ఉంది. పర్ఫెక్ట్ కోన్ ఆకారంలో ఉండటం ఈ అగ్నిపర్వతం ప్రత్యేకత.  2023లో చుట్టుపక్కల నివసిస్తున్న 12 వేల మందిని  సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది.

రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో ఫిలిప్పీన్స్

పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ పరిధిలో ఉన్న ఫిలిప్పీన్స్ లో  భూమి లోపల టెక్టానిక్ ప్లేట్లు ఒకదానితో మరొకటి ఢీకొనే  ప్రాంతంలో తరచూ భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు సంభవిస్తుంటాయి. ఈ ఏడాది ఫిలిప్పీన్స్‌లో మూడు అగ్నిపర్వతాల్లో అసాధారణ చురుకుదనం కనిపించింది.

1991లో మౌంట్ పినటుబో అగ్నిపర్వత విస్ఫోటన ఘటనలో 800 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వేల కిలోమీటర్ల దూరం వరకు బూడిద మేఘాలు వ్యాపించాయి. ప్రస్తుతం మయోన్ అగ్నిపర్వతం చురుకుగా మారడంతో అధికారులు పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నారు.

Follow Us