Bill Gates Dance: ప్రపంచ కుబేరుడు డ్యాన్స్ వేస్తే ఎట్టా ఉంటాదో తెలుసా.. అయితే లెటేందుకు..

ఈ వీడియోలో బిల్ గేట్స్ స్టేజ్‌పై ఇతరులతో కలిసి డ్యాన్స్ చేయడం, పాటకు లిప్ సింక్ చేయడం కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం వైరల్‌గా మారిన ఈ వీడియోను దాదాపు ఆరు మిలియన్లకు పైగా నెటిజన్లు వీక్షించారు.

Bill Gates Dance: ప్రపంచ కుబేరుడు డ్యాన్స్ వేస్తే ఎట్టా ఉంటాదో తెలుసా.. అయితే లెటేందుకు..
Bill Gates Dance
Follow us
Jyothi Gadda

|

Updated on: Dec 03, 2022 | 11:52 AM

1995లో మైక్రోసాఫ్ట్ విండోస్ లాంచ్ ఈవెంట్ కు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. ఈ వీడియోలో మైక్రోసాఫ్ట్ సీఈవో బిల్ గేట్స్ ఫుల్ హ్యాపీగా డ్యాన్స్ చేస్తున్నారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ హల్‌చల్‌ చేస్తోంది.

మైక్రోసాఫ్ట్ విండోస్ 1995 లాంచ్ పార్టీ అనే టైటిల్‌తో ఈ వీడియో సోషల్‌ మీడియాలో పోస్ట్ చేయబడింది. ఈ వీడియోలో బిల్ గేట్స్ స్టేజ్‌పై ఇతరులతో కలిసి డ్యాన్స్ చేయడం, పాటకు లిప్ సింక్ చేయడం కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం వైరల్‌గా మారిన ఈ వీడియోను దాదాపు ఆరు మిలియన్లకు పైగా నెటిజన్లు వీక్షించారు.

ఇవి కూడా చదవండి

లాస్ట్‌ ఇన్ హిస్టరీ అనే ట్విట్టర్ యూజర్ ఈ వీడియోను అప్‌లోడ్ చేసి పోస్ట్ చేశాడు. ముప్పై సంవత్సరాల క్రితం మైక్రోసాఫ్ట్ విండోస్ లాంచ్ పార్టీలో మైక్రోసాఫ్ట్ మాజీ CEO స్టీవ్ బాల్మెర్‌తో కలిసి వేదికపై ఉత్సాహంగా గ్రూటింగ్ చేయడం కనిపిస్తుంది. 23 సెకన్ల నిడివి గల చిత్రంలో మిస్టర్ గేట్స్ చూడవచ్చు. చారిత్రాత్మక ఘట్టానికి సాక్ష్యమివ్వడం పట్ల పలువురు ఇంటర్నెట్ వినియోగదారులు హర్షం వ్యక్తం చేశారు .

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి