AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Friendship Video: ట్రెండ్ మారినా.. తరాలు మారినా.. ప్రెండ్షిప్ మాత్రం మారదు.. 80 ఏళ్ల తర్వాత కలిసిన ఇద్దరు మిత్రులు

పెళ్లయిన తర్వాత చిన్ననాటి స్నేహాలను కొనసాగించడం మహిళలకు కష్టంగా ఉంటుంది. ఎందుకంటే కుటుంబాన్ని మొత్తం నడిపించే బాధ్యత మహిళలే మోయాలి. అంతేకాదు,

Friendship Video: ట్రెండ్ మారినా.. తరాలు మారినా.. ప్రెండ్షిప్ మాత్రం మారదు.. 80 ఏళ్ల తర్వాత కలిసిన ఇద్దరు మిత్రులు
Old Friends
Jyothi Gadda
|

Updated on: Dec 03, 2022 | 9:44 AM

Share

మనం మన కోసం ఎంచుకునే కుటుంబం స్నేహం.. వాస్తవానికి స్నేహితులు మన జీవితంలో చాలా ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంటారు. చిన్న పిల్లల నుండి పెద్దయ్యాక, యుక్తవయస్సులోకి అడుగుపెట్టే వరకు స్నేహితులు మాత్రమే స్థిరంగా ఉంటారు. అందరూ తమ తమ స్నేహితులతో కలిసి ఉన్న కాలంనాటి జ్ఞాపకాల భారంతో పెరుగుతారు. వయసుతో పాటు వచ్చే బాధ్యతలు, లాభ, నష్టాలు అనేవి ప్రతిఒక్కరి జీవితంలో సహాజం.. కానీ, వారి చుట్టూ ఏళ్లతరబడి వారి స్నేహితులతోనే కలిసి ఉన్నవారు నిజంగా అదృష్టవంతులనే చెప్పాలి. పెద్దవాళ్లుగా బాధ్యతలు పెరిగిన వెంటనే స్నేహితుల్ని కలవటం, మాట్లాడుకోవటం తగ్గిపోతుంది. ఏది ఏమైనప్పటికీ భావోద్వేగాలు మాత్రం ఎప్పుడూ మారవు. ముఖ్యంగా స్నేహితుల మధ్య బంధం ఎన్నేళ్లకు కలుసుకున్నా ఆ భావోద్వేగాలు మారవన్నది వాస్తవం. 80 ఏళ్లకు పైగా దూరంగా ఉన్న ఇద్దరు వృద్ధ మహిళల విషయంలో సరిగ్గా అదే జరిగింది. ఇద్దరు చిన్ననాటి స్నేహితులు ఎవరికీ వారుగా జీవితంలో స్థిరపడిపోయి చాలా సంవత్సరాలు కలవలేకపోయారు. అయితే, ఆ ఇద్దరు 80ఏళ్ల వయసులో కలుసుకున్న వేళ అద్భుతంగా ఉంది.

పెళ్లయిన తర్వాత చిన్ననాటి స్నేహాలను కొనసాగించడం మహిళలకు కష్టంగా ఉంటుంది. ఎందుకంటే కుటుంబాన్ని మొత్తం నడిపించే బాధ్యత మహిళలే మోయాలి. అంతేకాదు, తమ స్నేహితులను కలవడానికి సమయం దొరకడం వారికి ఇబ్బందిగా ఉంటుంది. అలాంటి ఓ అందమైన స్నేహమే ఈ వృద్ధ మహిళల కలయిక. ఎనిమిది దశాబ్దాలుగా స్నేహంగా మెలిగిన ఇద్దరు వృద్ధ మహిళల అందమైన భేటీకి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

వైరల్‌ అవుతున్న ఆ వీడియోలో ఇద్దరు స్నేహితులు మాట్లాడుకునేటప్పుడు ఒకరి చేతులు ఒకరు పట్టుకుని కౌగిలించుకుంటారు. ఈ దృశ్యం చూసిన వారికి నిజంగా స్నేహం అంటే చాలా అందమైన అనుభూతి అనిపిస్తుంది. ఇంటర్‌ వినియోగదారులందరినీ భావోద్వేగానికి గురి చేసింది. 80 ఏళ్లకు పైగా స్నేహాన్ని పంచుకుంటున్న తన అమ్మమ్మను ఆమె పాత బెస్టీతో తిరిగి కలపడానికి చొరవ తీసుకున్న ఒక వినియోగదారు ఈ వీడియోను షేర్ చేశారు. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ తీవ్రంగా స్పందిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి