సిగరెట్ తాగుతూ అర్ధ నగ్నంగా.. వర్చువల్ హియరింగ్‌లో పాల్గొన్న మహిళా జడ్జి
కొలంబియా దేశంలో ఒక మహిళా న్యాయమూర్తి అర్ధ నగ్నంగా బెడ్‌పై పడుకుని, సిగరెట్ తాగుతూ కోర్టు వర్చువల్ హియరింగ్‌లో పాల్గొంది. దీంతో ఆమెను కొన్ని నెలలు సస్పెండ్ చేశారు.
కొలంబియా దేశంలో ఒక మహిళా న్యాయమూర్తి అర్ధ నగ్నంగా బెడ్‌పై పడుకుని, సిగరెట్ తాగుతూ కోర్టు వర్చువల్ హియరింగ్‌లో పాల్గొంది. దీంతో ఆమెను కొన్ని నెలలు సస్పెండ్ చేశారు. 2021 జూన్‌లో ఆ దేశంలో జరిగిన ఉగ్రవాద కారు బాంబు పేలుడు కేసుపై ఈ నెల నవంబర్ 18న వర్చువల్‌గా విచారణ జరిగింది. ఈ హియరింగ్‌లో 24 ఏళ్ల మహిళా న్యాయమూర్తి వివియన్ పోలానియా, అర్ధ నగ్నంగా బెడ్‌పై పడుకుని కనిపించింది. అంతేగాక ఆమె సిగరెట్ తాగుతూ నిందితుడి బెయిల్ విచారణలో పాల్గొంది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కాగా, దీనిపై విమర్శలతోపాటు ఫిర్యాదులు రావడంతో జ్యుడిషియల్ డిసిప్లినరీ కమిషన్ స్పందించింది. మహిళా జడ్జీ వివియన్ పోలానియా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు నిబంధనలు ఉల్లంఘించినందుకు మూడు నెలల పాటు ఆమెను సస్పెండ్ చేసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తోకతో పుట్టిన ఆడశిశువు.. అరుదుగా ‘ట్రూ టెయిల్స్’ శిశువుల జననం..
ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. వారానికి 4 రోజులే వర్కింగ్ డేస్..
Digital TOP 9 NEWS: చిన్నారి ప్రాణం తీసిన కోతి..ఏం జరిగిందంటే.! | రైలు ఎక్కలేక ఇబ్బందిపడ్డ మహిళ